NeoCov కరోనాలో అత్యంత ప్రమాదకరం ఇదేనా? చైనా సైంటిస్టులు చెప్పినదాంట్లో నిజమెంత? దీని గురించి డబ్ల్యూహెచ్‌వో ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, JONATHAN KITCHEN
'నియోకోవ్' కరోనా వైరస్ పూర్తి స్వభావం గురించి తెలుసుకోవాలంటే దానిపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.
దక్షిణాఫ్రికాకు చెందిన గబ్బిలాలలో ఈ కొత్త కరోనా వైరస్ 'నియోకోవ్'ను చైనా పరిశోధకులు కనుగొన్నారు. ప్రస్తుతానికైతే ఈ వైరస్ జంతువుల్లోనే వేగంగా వ్యాపిస్తోంది.
భవిష్యత్‌లో ఈ వైరస్ మానవులకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు.
సాధారణ జలుబు దగ్గర నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారి తీసే విభిన్న వైరస్‌ల సమూహంలో కరోనా వైరస్‌లు ఒక భాగం.
''ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని, అయితే ఇది మానవులకు ప్రమాదకరమా? కాదా? అనే విషయం తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం'' అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
''మానవుల్లో పుట్టుకొస్తోన్న 75 శాతం కంటే ఎక్కువ అంటురోగాలకు ప్రధాన మూలం జంతువులే. ఇందులో ముఖ్యంగా అడవి జంతువుల పాత్ర మరింత ఎక్కువ. సాధారణంగా కరోనా వైరస్ తరచుగా జంతువుల్లో కనిపిస్తుంది. గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉంటుంది. అనేక వైరస్‌లకు గబ్బిలాలు ఆవాసాలుగా ఉంటాయి'' అని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
'నియోకోవ్' వైరస్ సమాచారాన్ని తెలిపినందుకు చైనా పరిశోధకులకు డబ్ల్యూహెచ్‌వో కృతజ్ఞతలు తెలిపింది.

ఫొటో సోర్స్, ROGER HARRIS/SCIENCE PHOTO LIBRARY
కేవలం ఒక మ్యుటేషన్ సంభవిస్తే ఇది ప్రమాదకరంగా తయారవుతుంది
ఒక అధ్యయనం ప్రకారం, కోవిడ్-19 తరహాలోనే నియోకోవ్ కూడా మానవకణాలపైనే సంచరిస్తుంది. ''నియోకోవ్‌లో మరొక్క మ్యుటేషన్ సంభవిస్తే, అది మానవులకు ప్రమాదకరంగా మారుతుంది.'' అయితే ఈ అధ్యయన ఫలితాలను ఇంకా సమీక్షించాల్సి ఉంది.
ఈ వైరస్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS-మర్స్)ను సరిపోలేలా ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ను మొట్టమొదటగా సౌదీ అరేబియాలో కనుగొన్నారు.
'మర్స్-కోవ్' వైరస్, మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ సోకిన ప్రతీ ముగ్గురిలో ఒక్కరు మృత్యువాతపడతారు. ప్రస్తుతానికైతే 'సార్స్-కోవ్ 2' వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.
'మర్స్-కోవ్' వైరస్, లక్షణాల పరంగా 'సార్స్-కోవ్ 2'ను పోలి ఉంటుంది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. మొదటిసారిగా మర్స్-కోవ్ వైరస్‌ను 2012లో సౌదీ అరేబియాలో కనిపెట్టారు. 2012 నుంచి 2015 వరకు మధ్యప్రాచ్య దేశాల్లో ఇది ప్రభావం చూపింది.
చాలా కేసుల్లో మర్స్-కోవ్ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి సోకింది. దీని కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, EPA/DIVYAKANT SOLANKI
టీకా ప్రభావం
'సార్స్-కోవ్ 2', 'మర్స్-కోవ్' వ్యాక్సిన్ల నుంచి లభించే రోగనిరోధక శక్తి, నియోకోవ్ వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ''అధిక సంఖ్యలో మ్యుటేషన్లు కలిగి ఉన్నందున సార్స్ కోవ్2, ఒమిక్రాన్ వంటి వైరస్‌లు యాంటీబాడీలను సర్దుబాటు చేసుకుంటూ మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.''
ప్రస్తుతం కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. చైనాలో తొలుత ఈ వైరస్‌ను కనుగొన్నారు. 2019 నుంచి ఇది వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటివరకు కోట్లాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడగా, లక్షలాది మంది వైరస్ కారణంగా మరణించారు.
కోవిడ్-19తో పోరాడటానికి ప్రజలకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వ్యాక్సిన్‌లోని యాంటీబాడీలు, వైరస్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- తిట్లు, నిందలు, అసత్యాలు, నిరాధారమైన కుట్రలు: బాలీవుడ్‌ను వ్యతిరేకిస్తూ యూట్యూబ్‌లో వ్యూస్ పెంచుకుంటున్న వ్యక్తులు
- టీఆర్ఎస్ రూ. 301 కోట్లు, టీడీపీ రూ. 188 కోట్లు, వైసీపీ రూ. 143 కోట్లు
- కేంద్ర బడ్జెట్ క్విజ్: ఈ ప్రశ్నలన్నింటికీ మీకు సమాధానాలు తెలుసా
- ఏపీలో కొత్త పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు ఎంత తగ్గుతున్నాయి, పెన్షనర్లకు ఎంత నష్టం? ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలా
- ‘మా అక్కపై అత్యాచారం చేసి, మొహానికి నల్ల సిరా రాసి, మెడలో చెప్పులదండతో ఊరేగించారు’
- ‘‘పది రూపాయల సమోసా తినడానికి బదులుగా ఆ డబ్బుతో జిరాక్స్ తీసుకుని పరీక్ష కోసం చదువుకుంటా’’
- వీధుల్లో అడుక్కుంటున్న డాక్టర్లు.. ఆకలేస్తోంది, ఆహారం లేదు.. 8 నెలలుగా జీతాలు అందట్లేదు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












