కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా 2000 పెంపుడు జంతువులను చంపేయాలని హాంకాంగ్ నిర్ణయం

ఫొటో సోర్స్, Getty Images
ఓ పెంపుడు జంతువులను విక్రయించే షాప్‌లో కోవిడ్-19 వ్యాప్తితో దాదాపు 2,000 పెంపుడు జంతువులను చంపేయడానికి హాంకాంగ్ సిద్ధమవుతోంది. హ్యామ్‌స్టర్లు, చిన్న క్షీరదాలు ఈ పెట్‌షాప్‌లో విక్రయిస్తారు.
ఈ షాప్‌లో పనిచేసే ఓ వ్యక్తి డెల్టా వేరియంట్ కేసులు వ్యాప్తికి కారణమైనట్లు అధికారులు గుర్తించారు. అనంతరం షాపులోని వందల జంతువులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వీటిలో 11 హ్యామ్‌స్టర్లకు వైరస్ సోకినట్లు నిర్ధరణైంది.
కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి హాంకాంగ్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ‘‘జీరో కోవిడ్’’ పేరుతో ఈ ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా తరిమేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
ఈ షాప్‌లో కేవలం హ్యామ్‌స్టర్లకు మాత్రమే వైరస్ సోకినట్లు తెలుస్తోంది. కుందేళ్లు, షించిలాస్ లాంటి జంతువులకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా దాదాపు 2,000 హ్యామ్‌స్టర్లు, ఇతర చిన్న జంతువులను చంపేయాలని నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం వధించబోయే హ్యామ్‌స్టర్లు 34 భిన్న ప్రాంతాల్లోని షాప్‌లు, జంతు సంక్షణ కేంద్రాల్లో ఉన్నాయి.
డిసెంబరు 22 తర్వాత ఎవరైనా హ్యామ్‌స్టర్లను కొనుగోలు చేసినా లేదా క్రిస్మస్ బహుమతిగా పొందినా వాటిని అధికారులకు అప్పగించాలని ఆదేశాలు జారీచేశారు.
మరోవైపు టెలిఫోన్ హ్యామ్‌స్టర్ హాట్‌లైన్ నంబరును ఏర్పాటుచేశారు. హ్యామ్‌స్టర్ల దిగుమతి, అమ్మకాలపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
‘‘ఒక పెట్ షాప్ సిబ్బంది, ఒక వినియోగదారుడు, అతడి భార్య ప్రస్తుతం పాజిటివ్‌గా తేలారు’’అని ఆరోగ్య అధికారులు తెలిపారు.
కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే కరోనావైరస్.. కుక్కలు, పిల్లులు, ఎలుకలు లాంటి పెంపుడు జంతువులకూ సోకే అవకాశముంది. అయితే, ఈ జంతువుల వల్ల మనుషులకు మళ్లీ సులువుగా ఇన్ఫెక్షన్ సోకుతున్నట్లు ఆధారాలు లేవు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘పెంపుడు జంతువుల యజమానులు పరిశుభ్రత పాటించాలి. జంతువులను ముట్టుకున్న వెంటనే, చేతులను కడుక్కోవాలి. జంతువులను ముద్దు పెట్టుకోవడం, వాటిని ముట్టుకున్న తర్వాత ఆహార పదార్థాలను ముట్టుకోవడం లాంటివి చేయకూడదు’’అని హాంకాంగ్ వ్యవసాయ విభాగం డైరెక్టర్ లియూగ్ సీయూ ఫాయ్ చెప్పారు.
హ్యామ్‌స్టర్ల యజమానులు ముఖ్యంగా వాటిని ఇళ్లలోనే ఉంచాలని ఆమె సూచించారు.
ఈ 2000 జుంతువులను వధించేటప్పుడు.. నొప్పి తక్కువగా ఉండే పద్ధతులనే అనుసరిస్తామని చెప్పారు.
2020 చివర్లో డెన్మార్క్ కూడా ఇలానే లక్షల సంఖ్యలో మింక్‌లను చంపేసింది. వీటి వల్ల వైరస్‌లో మ్యుటేషన్లు జరిగే ముప్పు ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- స్కాచ్ విస్కీ: బ్రిటన్ – ఇండియా వాణిజ్య చర్చల్లో ఈ అంశం ఎందుకంత కీలకం
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










