సైనా నెహ్వాల్‌‌కు క్షమాపణ చెప్పిన సిద్ధార్థ్

సిద్ధార్థ్

ఫొటో సోర్స్, Getty Images

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై చేసిన 'లింగవివక్షతో కూడిన' వ్యాఖ్యలకు సినీ నటుడు సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పారు. సైనా చేసిన ట్వీట్‌ మీద 'మొరటు హాస్యం'తో స్పందించే ప్రయత్నం చేశానని ఆయన వివరించారు.

కానీ, "అందులో ఉపయోగించిన మాటలు, వాటి అంతరార్థాలు" సరైనవిగా లేవంటూ సిద్ధార్థ్ తన క్షమాపణల ట్వీట్‌లో తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఒక జోక్‌ను వివరించాల్సి వచ్చిందంటే అది మంచి జోక్ కాదనే అర్థం, అందుకు నేను క్షమాపణలు కోరుతున్నానని చెప్పిన సిద్ధార్థ్, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ఆశిస్తున్నట్లు సైనాను కోరారు.

'మీరెప్పటికీ నాకు చాంపియనే' అంటూ సిద్ధార్థ్ తన క్షమాపణ లేఖను ముగించారు.

సిద్ధార్త్, సైనా

ఫొటో సోర్స్, Pramod Thakur/Hindustan Times via Getty Images/ANI

ట్వీట్లతో రేగిన దుమారం

ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయమై సైనా ట్విటర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. సైనా ట్వీట్‌కు రిప్లై ఇస్తూ సిద్దార్థ్ చేసిన ట్వీట్లు స్త్రీలను కించపరిచేవిగా ఉన్నాయంటూ మహిళా కమిషన్ విమర్శించింది.

ఇటీవల పంజాబ్ పర్యటన సమయంలో ప్రధాని మోదీ కాన్వాయ్ ఒక ఫ్లై ఓవర్‌పై కొంతసేపు నిలిచిపోయింది.

ప్రధాని భద్రత ఏర్పాట్లలో లోపాల గురించి సైనా నెహ్వాల్ ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

"ఒక దేశ ప్రధాని భద్రతకే భంగం కలిగినప్పుడు ఏ దేశమూ తమని తాము సురక్షితం అని ప్రకటించుకోలేదు. ప్రధానిపై అరాచకులు చేసిన దాడిని పిరికిపందల చర్యగా అభివర్ణిస్తూ దీనిని నేను ఖండిస్తున్నాను" అని సైనా జనవరి 05న ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

సైనా ట్వీట్‌ను సిద్దార్థ్ రీట్వీట్ చేశారు.

"పైకి కనిపిస్తున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్. ధన్యవాదాలు. దేశాన్ని రక్షించే సంరక్షకులున్నారు. నమస్కారాలు. రిహానా నువ్వు సిగ్గు పడాలి" అంటూ రిహానాను ఆయన ట్యాగ్ చేశారు.

జనవరి 10న ఆయన ఈ ట్వీట్ చేశారు.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు పాప్‌స్టార్ రిహానా వారికి తన మద్దతు తెలిపారు.

అయితే, భారతదేశ వ్యవహారాలలో ఆమె జోక్యం చేసుకోవడం పట్ల దేశంలో అనేక మంది సెలబ్రిటీలు, నాయకులు ఆమెను విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

సిద్దార్థ్ ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఆయన చేసిన ట్వీట్‌ను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ విమర్శించారు.

"ఈయనకు ఒకటో రెండో గుణపాఠాలు నేర్పాలి. ఈయన అకౌంట్ ఇంకా ఎందుకుంది? అని ట్విటర్‌ను ప్రశ్నించారు.

సిద్ధార్థ్ చేసిన ట్వీట్‌ను సంబంధిత పోలీస్ అధికారుల దగ్గరకు తీసుకుని వెళుతున్నట్లు చెబుతూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఈ నటుడిపై సత్వర చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె తమిళనాడు డీజీపీకి రాసిన లేఖను జాతీయ మహిళా కమిషన్ ట్వీట్ చేసింది. పోలీసులు తీసుకున్న చర్యలను వెంటనే మహిళా కమిషన్‌కు తెలియచేయాలని డిమాండ్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

కొంతసేపటి తర్వాత సిద్ధార్థ్ స్పందించారు. తన ట్వీట్ ద్వారా ఎవరినీ అవమానించాలని అనుకోలేదని, 'సటిల్ కాక్' అనే పదంలో ఆరోపణలు లేవని అంటూ మరో ట్వీట్ చేశారు.

"కాక్ అండ్ బుల్" అని ఇన్వర్టెడ్ కామాలో సంబోధించారు.

ఇది కేవలం ప్రతీకాత్మకం. దీనిని మరోలా అర్థం చేసుకోవడం సమంజసం కాదు. ఇందులో ఎవరినీ అగౌరవపరిచే విధంగా ఆలోచన చేయడం కానీ, చెప్పడం కానీ, ఆరోపణలు చేయడం కానీ లేవు" అని కూడా రాశారు. ఈ ట్వీట్‌ను ఆయన ప్రొఫైల్‌కు పిన్ కూడా చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా సిద్దార్థ్ ట్వీట్‌ను తప్పుబట్టారు.

"సిద్ నువ్వు నా స్నేహితుడివి. కానీ, నీ నుంచి ఇలాంటి ట్వీట్ ఆశించలేదు. ఇది ఆలోచన లేకుండా చేసిన పనిలా ఉంది. నువ్విలా చేయడం పట్ల అంకుల్, ఆంటీ కచ్చితంగా గొప్పగా భావించరు. ఒక వ్యక్తిపై నీకున్న వ్యక్తిగత ద్వేషంతో ప్రవర్తించకు" అని సందేశమిస్తూ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

ఆమె జాతీయ మహిళా కమిషన్ చేసిన ట్వీట్లను కూడా రీట్వీట్ చేశారు.

సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్‌పై కూడా విమర్శలు వచ్చాయి. సైనా! నువ్వు గతంలో వలే బీజేపీ ఐటీ సెల్ పంపిన ట్వీట్ కాపీ పేస్ట్ చేసినట్లున్నావు. ప్రధానిపై ఎటువంటి దాడి జరగలేదంటూ సమాధానాలిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)