లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్... జైలు నుంచి విడుదలవుతారా? -Newsreel

లాలూ ప్రసాద్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాలూ ప్రసాద్ యాదవ్

పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది.

జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో లాలూ యాదవ్‌కు జైలు నుంచి బయటకు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది.

లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దుమ్కా ట్రెజరీగా ప్రాచుర్యం పొందిన కేసులో దోషిగా నిర్ధరించింది. గతంలో దుమ్కా నగర ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు అక్రమంగా తీసుకున్నారనే ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి.

ప్రస్తుతం అనారోగ్యంతో దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆయన చికిత్స పొందుతున్నారు. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో మూడింట్లో ఆయనకు ఇప్పటికే బెయిల్ లభించింది. ఇప్పుడు దుమ్కా కేసులో కూడా బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగినట్లయింది.

జైలు జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆయన రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లోనే గడిపారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న లాలూనూ గత జనవరి నెలలో దిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)