షర్మిల: నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగండి -News Reel

తాను కొత్త పార్టీ పెట్టడం తన అన్న జగన్‌కు ఇష్టం లేదని వైఎస్ షర్మిల అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..
''నేను పార్టీ పెట్టడం మా అన్నకు ఇష్టం లేదు. మా అనుబంధాల్లో ఎలాంటి తేడాలుండవు. మాటలు, అనుబంధాలు, రాఖీలుంటాయి. మా మధ్య ఉన్నవి విబేధాలో.. భిన్నాభిప్రాయాలో నాకు తెలియదు. నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌నే అడగండి. నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. విజయశాంతి, కేసీఆర్ ఇక్కడివారా?. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదు. నాకు హైదరాబాద్ నగరంతో విడదీయరాని బంధం ఉంది. నేను తెలంగాణ కోడలినే. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నా చెల్లెళ్లుగా మేమంతా ఒక్కటే. దేవుడి దయతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా? అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? ఉద్యమంలో నేను లేనంత మాత్రాన, తెలంగాణపై ప్రేమ ఉండదా? అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తా. నాకు మా అమ్మ విజయమ్మ మద్దతు ఉంది'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్-19 టీకా
భారత్‌లో మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్-19 టీకా పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, 45 ఏళ్లకు పైగా వయసు ఉండి దీర్హకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 10,000 ప్రభుత్వ కేంద్రాలు, 20,000 ప్రైవేటు కేంద్రాలలో టీకా అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు.
ప్రభుత్వ కేంద్రాలలో టీకా ఉచితంగా పంపిణీ చేస్తామని, ప్రైవేటు కేంద్రాల్లో మాత్రం ప్రజలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.
పైవేటు కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ల ధరలను మూడు నాలుగు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర మోదీ స్టేడియం: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి ప్రధాని పేరు
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియంను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. దీనికి నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేశారు.
1,32,000 మంది కూర్చునేందుకు వీలున్న ఈ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం. దీనికి నరేంద్ర మోదీ పేరు పెడుతున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
కాగా ఇక్కడి స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌కు సర్దార్ పటేల్ పేరు పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత్, ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇక్కడ ప్రారంభం కానుంది.
స్టేడియం ప్రారంభ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవరత్, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజులు పాల్గొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, REUTERS
ఒక్క ట్వీట్‌తో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని పోగొట్టుకున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్
తన కంపెనీ షేర్ విలువ భారీగా పడిపోవడంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఒకటో స్థానంలో ఉన్న టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తన ర్యాంకును కోల్పోయారు.
దీంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నారు.
జనవరిలో 880 డాలర్లకు పైగా ఉన్నా టెస్లా కంపెనీ షేర్ విలువ ఒక్కసారి 20 శాతం పడిపోయింది. బిట్‌కాయిన్ లావాదేవీల వ్యవహారంతో టెస్లాకు భారీ నష్టం ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.
ఇటీవలే బిట్‌కాయిన్‌లో ఎలాన్ మస్క్ 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. అయితే అప్పటి నుంచే బిట్ కాయిన్ షేర్ విలువ పడిపోతూ వచ్చింది. ఎలన్ మస్క్‌కు జరిగిన నష్టం ఆయన చేజేతులా చేసుకుందేనని ప్రపంచ మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడ్డారు.
బిట్‌కాయిన్ షేర్ ధర పెరుగుతోందంటూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ మార్కెట్‌ను ప్రభావితం చేసింది.
ఆయన ఈ ప్రకటన చేసిన వెంటనే టెస్లాలో పెట్టుబడులు పెట్టినవారు తమ వాటాలను విక్రయించేందుకు క్యూ కట్టారు.
దీంతో టెస్లా ఈక్విటీ విలువ పడిపోయి మస్క్ నష్టపోయారు.

ఫొటో సోర్స్, BJP GUJARAT/twitter
గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
గుజరాత్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ 476 స్థానాల్లో విజయం సాధించిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ గెలుపుతో ఆరు నగర పాలక సంస్థల్లో బీజపీ అధికారాన్ని కైవసం చేసుకుందని ఏఎన్‌ఐ తెలిపింది.
ఈ విజయం ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు సూరత్‌లో తాము గణనీయమైన విజయాలు సాధించామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
గుజరాత్‌లో కొత్త రాజకీయానికి తెరలేపిన ప్రజలకు తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని దిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ .
సూరత్‌లో 120 స్థానాలకు 93, వదోదరలో 76 స్థానాలకు 69, రాజ్‌కోట్‌లో 72లో 68, భావ్‌నగర్ 52 సీట్లలో 44, జామ్‌నగర్‌లో 64లో 50, అహ్మదాబాద్‌లో 159కి 152 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.
కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, కేవలం 44 సీట్లలోనే ఆ పార్టీని గెలిపించడం ద్వారా ప్రజలు ఆ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని అమిత్ షా తన ట్వీట్లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- కాకినాడ సెజ్: విజయసాయిరెడ్డి బంధువుల చేతుల్లోకి భూములు వెళ్తున్నాయా?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
- నేపాల్ వెళ్తే జేబు ఖాళీయే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










