భారతీ సింగ్: డబ్బు కోసం తన భారీకాయం, పేదరికంపైనే జోకులు వేసుకున్న స్టార్ కమెడియన్

ఫొటో సోర్స్, BHARATI SINGH/FACEBOOK
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ ప్రమేయం వెలుగులోకి వచ్చిన తర్వాత సినీ, టీవీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) ప్రశ్నిస్తోంది.
ఇదే క్రమంలో ఎన్సీబీ ఎంతోమంది ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు కూడా నిర్వహించింది.
తాజాగా ఇందులో ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ పేరు కూడా చేరింది. ఎన్సీబీ శనివారం ఆమెను తన ఇంట్లోనే అరెస్ట్ చేసింది.
భారతీ సింగ్ ఇంట్లో, ప్రొడక్షన్ హౌస్‌లో జరిపిన తనిఖీల్లో 86.5 గ్రాముల గంజాయి దొరికినట్లు ఎన్సీబీ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారతీ సింగ్, ఆమె భర్త గంజాయి తీసుకుంటున్నట్లు అంగీకరించారని కూడా ఎన్సీబీ అధికారులు చెప్పారు.
ఈ కేసులో భారతీ సింగ్‌తో పాటూ ఆమె భర్త హర్ష్ లింబాచియాను కూడా అరెస్ట్ చేశారు.
సోమవారం భారతీ సింగ్, ఆమె భర్త హర్ష్ లించాబియాలకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఫొటో సోర్స్, BHARATI SINGH/BBC
ఎవరీ భారతీ సింగ్?
'దగ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్', 'కామెడీ సర్కస్' నుంచి ఒక స్టాండప్ కమెడియన్‌గా ఒక గుర్తింపు తెచ్చుకున్న భారతీ సింగ్ స్వస్థలం పంజాబ్.
ఆమె గత 12 ఏళ్లుగా స్టాండప్ కామెడీ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే, ఆమెను 'కామెడీ క్వీన్' అని కూడా అంటుంటారు.
సుదీర్ఘ సంఘర్షణ తర్వాత 36 ఏళ్ల భారతీ సింగ్‌కు ఈ విజయాన్ని అందుకోగలిగారు.
భారతీ సింగ్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 1984 జులై 3న పుట్టారు. ఆమెకు రెండేళ్ల వయసులో తండ్రి మరణించారు.
ఆమె తల్లికి ఆ సమయంలో 22 ఏళ్లు. భారతి తండ్రి నేపాలీ సంతతికి చెందినవారు. తల్లి పంజాబీ. ఆమె బాల్యం పేదరికంలో గడిచింది. దాని గురించి ఆమె చాలాసార్లు తన ఇంటర్వ్యూల్లో చెప్పారు.

ఫొటో సోర్స్, BHARATI SINGH/FACEBOOK
డబ్బు కోసం తన భారీకాయంపైనే జోకులు
డబ్బులు సంపాదించడం కోసం తన పేదరికం, భారీకాయంపై ఎలా జోకులు వేసుకునేదాన్నో భారతీ సింగ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
జీ టీవీలో వచ్చిన జజ్బాత్ అనే కార్యక్రమంలో ఇల్లు నడవడం కోసం తన తల్లి బట్టలు కుట్టేవారని, ఇప్పుడు కుట్టు మిషన్ శబ్దం వినగానే ఆ రోజులు గుర్తుకొస్తాయని ఆమె చెప్పారు.
తన ముందు అప్పటికే ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారని, దాంతో, తల్లికి తనకు జన్మనివ్వడం ఇష్టం లేదని కూడా భారతీ సింగ్ అదే షోలో చెప్పారు.
తనకు రెండేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో ఎన్నో కష్టాలు భరించామని, తన తల్లి ఒక కంబళ్ల ఫ్యాక్టరీలో పనిచేసేవారని, డబ్బులు లేక ప్రతి పండగలకూ తాము ఏడ్చేవాళ్లమని, డబ్బు అడిగితే తన తల్లిని అందరూ తిట్టేవారని భారతీ వివరించారు.
అలాంటి దీన పరిస్థితుల్లోంచి ముందుకు సాగిన భారతీ సింగ్ చివరికి తన లక్ష్యాన్ని అందుకోగలిగారు. అమృత్‌సర్‌లో కాలేజీ రోజుల్లోనే ఆమెకు ప్రముఖ స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ తెలుసు. వీరిద్దరి సక్సెస్ జర్నీ కూడా ఒకేలా ఉంటుంది.
భారతీ సింగ్ అరెస్ట్ తర్వాత కొందరు ట్విటర్‌లో కపిల్ శర్మను ట్రోల్ చేస్తున్నారు. "కపిల్ ఇప్పుడు తన షోలో భారతీ సింగ్‌ను ఎగతాళి చేస్తారా" అని అడుగుతున్నారు.

ఫొటో సోర్స్, BHARTI SINGH
భారతీ సింగ్ మంచి షూటర్ కూడా
భారతీ సింగ్ కమెడియన్ మాత్రమే కాదు, ఆమెకు షూటింగ్, విలువిద్యలో కూడా నైపుణ్యం ఉంది. ఒకసారి ఇంటర్వ్యూలో తను కమెడియన్ కాకుంటే, షూటర్ అయ్యేదాన్నని భారతీ చెప్పారు.
"అప్పుడు మీరు నన్ను ఒలింపిక్ క్రీడల్లో షూటింగ్ లేదా విలువిద్య పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం చూసుండేవార"ని అప్పుడామె అన్నారు.
"నేను షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి బట్టలు, మిగతా పరికరాల ధర అడిగితే, పది లక్షలు అవుతాయని చెప్పారు. మా దగ్గర అప్పుడంత డబ్బు లేదు. ఆ సమయంలో పది లక్షలంటే మాకు చాలా పెద్ద మొత్తం. అందుకే నేను షూటింగ్ వదిలేశా. దానికి ఇప్పటికీ చాల బాధగా ఉంటుంది" అంటారు భారతీ.
ఇప్పుడు తన దగ్గర డబ్బున్నా, సమయం మించిపోయిందని భారతీ సింగ్ అదే ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, BHARATI SINGH/FACEBOOK
కామెడీ కెరీర్ సూపర్ సక్సెస్
భారతీ సింగ్ 'ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్' రియాలిటీ షోతో తన కెరీర్ ప్రారంభించారు. ఆ షోలో ఆమె సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత 'కామెడీ సర్కస్-3కా తడ్కా'లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమె దాదాపు ప్రతి కామెడీ షోలో కనిపిస్తూ వచ్చారు. అందరికీ చాలా ఫేవరెట్ అయ్యారు.
ఆమె చాలా కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా పనిచేశారు. 'కామెడీ దంగల్' అనే షోలో జడ్జిగా కూడా ఉన్నారు.
'ఖతరోం కే ఖిలాడీ' షో చాలా సీజన్లలో ఆమె గెస్ట్ గా కూడా పాల్గొన్నారు. కపిల్ శర్మ షోలో కూడా అప్పుడప్పుడూ కనిపించేవారు.
సాధారణంగా పురుషుల ఆధిపత్యం ఉండే కామెడీ రంగంలో భారతీ సింగ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లో కూడా నటించారు.

ఫొటో సోర్స్, BHARATI SINGH/FACEBOOK
సోషల్ మీడియాలో యాక్టివ్
భారతీ సింగ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఆమెకు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కనిపిస్తుంది. ఫేస్‌బుక్‌లో ఆమెకు 72 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో 36 లక్షలకు పైగా ఆమెను ఫాలో అవుతున్నారు.
అయితే ట్విటర్‌లో ఆమె ఈమధ్య అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. కానీ, అక్కడ కూడా ఆమెకు 2.8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఆమె అరెస్టైన తర్వాత ఆమె ఒక పాత ట్వీట్‌ను జనం జోరుగా షేర్ చేస్తున్నారు, భారతీ సింగ్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
2015 జులై 9న ఒక ట్వీట్ చేసిన భారతీ సింగ్ డ్రగ్స్ తీసుకోవద్దని సలహా ఇస్తూ, వాటివల్ల ఆరోగ్యం నాశనం అవుతుందని చెప్పారు. ఇప్పుడు ఆమె చేసిన ఆ ట్వీట్‌ను షేర్ చేస్తూ చాలా మంది ఎగతాళి చేస్తున్నారు.

ఫొటో సోర్స్, BHARATI/FACEBOOK
భర్త కంటే మూడేళ్లు పెద్ద
భారతీ సింగ్ 2017 డిసెంబర్ 3న హర్ష్ లింబాచియాను పెళ్లాడారు. హర్ష్ ఒక స్క్రిప్ట్ రైటర్, ప్రొడ్యూసర్, హోస్ట్ కూడా.
కామెడీ సర్కస్ షో కోసం పనిచేస్తున్న సమయంలో భారతీ, హర్ష్ కలిశారు. ఆ షోకు స్క్రిప్ట్ రైటర్‌గా ఉన్న హర్ష్ కూడా అదే సమయంలో కెరీర్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
హర్ష్ వయసులో భారతీ కంటే మూడేళ్లు చిన్నవారు. ఆయన తర్వాత ఎన్నో కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు.
కామెడీ షోలతోపాటూ హర్ష్ 'పీఎం నరేంద్ర మోదీ' సినిమాకు డైలాగులు కూడా ఇచ్చారు. మలంగ్ సినిమాకు టైటిల్ ట్రాక్ రాశారు.
భారతీ భర్త హర్ష్ లింబాచియా 'ఖత్రా, ఖత్రా, ఖత్రా', 'హమ్ తుమ్', 'క్వారంటీన్ షాట్' లాంటి షోలకు నిర్మాతగా కూడా ఉన్నారు.
ప్రస్తుతం భారతీ సింగ్, హర్ష్ లింబాచియా ఇద్దరూ కలిసి 'ఇండియాస్ బెస్ట్ డాన్సర్' షో హోస్ట్ చేస్తున్నారు.
ఇవి కూడాచదవండి:
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ఆకాశంలోని విమానాలను నేలకు దించిన మనిషి.. కెప్టెన్ జీఆర్ గోపీనాథ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








