అభినందన్‌ను విడిచిపెట్టకపోతే భారత్ దాడి చేస్తుందని పాక్ సైన్యాధిపతి వణికిపోయారు: పార్లమెంటులో పాక్ ఎంపీ

ఫొటో సోర్స్, ANI
భారత వాయుసేన పైలట్ అభినందన్‌ను విడిచిపెట్టకపోతే తమ దేశంపై భారత్ దాడి చేస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చెప్పినప్పుడు.. పాక్ సైన్యాధిపతి ఖమర్ జావెద్ బజ్వా కాళ్లు వణికిపోయాయని ఓ పాక్ ఎంపీ తెలిపారు.
ఫిబ్రవరి 2019లో భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను విడిచిపెట్టినప్పటి పరిస్థితులపై పాకిస్తాన్ పార్లమెంటు నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) నాయకుడు అయాజ్ సాదిఖ్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
''ఆ రోజు రాత్రి పీపీపీ, పీఎంఎల్-ఎన్ సహా పార్లమెంటరీ పార్టీ నాయకులతో మహమ్మద్ ఖురేషీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అభినందన్‌ను విడిచిపెట్టకపోతే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు పాక్‌పై భారత్ దాడి చేస్తుందని చెప్పారు'' అని వివరించారు.
''ఆ సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ రాలేదు. అయితే, గదిలోకి వచ్చేటప్పుడు సైన్యాధిపతి జనరల్ బజ్వా పరిస్థితి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన కాళ్లు వణికాయి. ఒళ్లంతా చెమటలు పట్టి కనిపించాయి. ఆ తర్వాత అభినందన్‌ను వదిలిపెట్టేద్దామని ఖురేషీ అన్నారు. లేకపోతే తొమ్మిది గంటలకు భారత్ దాడి చేస్తుందని చెప్పారు''అని సాదిఖ్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అన్ని విపక్షాలు నిర్ణయించినట్లు సాదిఖ్ చెప్పారని దునియా న్యూస్ వివరించింది.
2019 ఫిబ్రవరి 27న భారత్-పాక్ మధ్య ఘర్షణల నడుమ భారత్ గగన తలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-19ను అభినందన్ కూల్చివేశారు. అయితే, ఈ క్రమంలో అభినందన్ ప్రయాణించిన విమానం పాక్ భూభాగంలోకి వెళ్లి పేలిపోయింది. ఆయన పాక్ అధికారుల చేతులకు చిక్కారు.
2019 మార్చి 1న అటారి-వాఘా సరిహద్దుల్లో ఆయన్ను భారత్‌కు పాక్ అప్పగించింది. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభినందన్‌ను వీర్ చక్ర పతకంతో భారత్ సత్కరించింది.
ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ప్రపంచంలో అత్యంత అరుదైన కోతుల్ని కాపాడిన ఒక చిన్న ఐడియా
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- కరోనావైరస్: ప్రధాని మోదీ భారత్‌లో కోవిడ్ పరిస్థితిపై చెప్పిందంతా నిజమేనా? - BBC FactCheck
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








