కాంగ్రెస్ పార్టీ అధినేతలుగా గాంధీలే కొనసాగుతారా? సోనియా, రాహుల్‌ నాయకత్వంపై సీనియర్ల మాటేమిటి?

సోనియా, రాహుల్

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం సమావేశమవుతున్న నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గాంధీ కుటుంబీకులా లేక బయటనుంచీ ఎవరైనా ఆ బాధ్యతను స్వీకరించబోతున్నారా అంటూ నెటిజన్లు చర్చిస్తున్నారు.

మళ్లీ సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీకే ఈ బాధ్యత అప్పగించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఏడాది పదవీ కాలం ముగిసింది. ఇంక ఇప్పుడు పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షులను ఎన్నుకోవలసిన అవసరం ఉందని సభ్యులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 23 మంది కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో పైనుంచి కిందవరకూ అనేక మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో సూచించినట్లు తెలుస్తోంది.

సమావేశానికి ముందు రోజు ఆదివారం నాడు సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఈ వార్తలను ఖండించారు.

ఆదివారం, సోషల్ మీడియాలో అనేకమంది కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీని అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరారు. ఒకవేళ ఆ పదవికి రాహుల్ గాంధీ పేరును సూచించినట్లయితే ఆయనకూ ఇదే విధంగా మద్దతిస్తామని తెలిపారు.

సోనియా, రాహుల్

ఫొటో సోర్స్, THE INDIA TODAY GROUP

సోనియా గాంధీకి మద్దతు

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమలనాథ్ ట్వీట్ చేస్తూ "సోనియా నేతృత్వంపై ఎలాంటి ఆక్షేపణా లేదు.. ఆమె మళ్లీ పార్టీ సారథ్యం చేపట్టి పార్టీని మరింత బలోపేతం చెయ్యాలి" అని పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేస్తూ "23 మంది సీనియర్ నాయకులు పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌కి లేఖ రాసిన మాట నిజమైతే అది నమ్మశక్యంగా లేదు. అది దురదృష్టకరమని భావిస్తున్నాను, ఇందుకోసం సోషల్ మీడియా వరకూ వెళ్లనవసరం లేదు" అని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను సోనియా అనేకసార్లు సమర్థవంతంగా నిర్వహించారు. అయితే, అధ్యక్ష పదవిని విడిచిపెట్టాలని ఆమె నిర్ణయించుకున్నట్లయితే రాహుల్ గాంధీ ముందుకు వచ్చి ఆ బాధ్యతలు స్వీకరించాలి" అన్నారు గెహ్లాట్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్.. పార్టీకి అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుతూ సోనియా గాంధీకి రాసిన లేఖలో "మీ సారథ్యంపై మాకు పూర్తి నమ్మకముంది. కాంగ్రెస్ పార్టీ మీ చేతుల్లో లేదా రాహుల్ గాంధీ చేతుల్లో సురక్షితంగా ఉంటుందని మాకు భరోసా ఉంది" అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

కర్నాటక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ట్వీట్ చేస్తూ "కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ మొత్తం సోనియా గాంధీ వెంట ఉంది. సోనియా పార్టీని సమర్థవంతంగా నడిపిస్తూ ఎన్నోసార్లు కష్టాల్లో కాపాడారు. ఎలాంటి చర్చ అయినా పార్టీ ఫోరంలో జరగాలి తప్ప సోషల్ మీడియాలో కాదు" అని అభిప్రాయపడ్డారు.

గాంధీ కుటుంబంపై కాంగ్రెస్ నేతల విశ్వాసం

యూత్ కాంగ్రెస్, సచిన్ పైలట్, అసోం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి బాలాసాహెబ్ తోరత్, పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు అమరీందర్ సింగ్, రాహుల్ గాంధీకి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పడంపై మద్దతు తెలిపారు.

సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవినుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లయితే రాహుల్ గాంధీకి ఆ బాధ్యతలు అప్పగించాలని యూత్ కాంగ్రెస్ కోరింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ట్వీట్ చేస్తూ "శ్రీమతి గాంధీ, రాహుల్ గారు ప్రజల మంచి కోసం, పార్టీ లక్ష్యాల కోసం త్యాగం చేయడం అంటే ఏమిటో నిరూపించారు. మనమంతా కలిసున్నప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. రాహుల్ గారు పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించడం చూడాలని చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు" అని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

అసోం కాంగ్రెస్ ప్రెసిడెంట్ రిపున్ బోరా సోనియాకు లేఖ రాస్తూ పార్టీ సారథ్యం రాహుల్ గాంధీకి అప్పగించవలసిందిగా కోరారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

మహారాష్ట్ర మంత్రి బాలాసాహెబ్ తోరత్ "రాహుల్ జీ పార్టీ బాధ్యతలు స్వీకరించాలి. ఆయన పూర్తి బాధ్యతలు స్వీకరించేవరకూ సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షులుగా కొనసాగాలి" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

పంజాబ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ "సోనియా గాంధీ తను కోరుకుంటున్నంత కాలం పార్టీ బాధ్యతలు కొనసాగించాలి. రాహుల్ గాంధీ పూర్తి బాధ్యతలు స్వీకరించడానికి తయారుగా ఉన్నప్పుడు ఆయనకు అప్పగించాలి" అన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ "రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నా లేకపోయినా ఆయనకు పార్టీ కార్యకర్తల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది" అని తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా 100 కన్నా తక్కువ స్థానాలను సొంతం చేసుకుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ భారీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవినుంచీ తప్పుకున్నారు. తరువాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పగ్గాలు చేపట్టారు.

తాత్కాలిక అధ్యక్ష పదవీకాలం ఏడాది మాత్రమే. పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. గాంధీ పరివారంనుంచి ఎవరైనా ఆ బాధ్యతలు స్వీకరిస్తారా లేక బయటవారికి అప్పగిస్తారా అనేది సోమవారం జరగబోయే కార్యసమితి వీడియో కాంఫరెన్స్ తరువాత తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)