కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు

ఫొటో సోర్స్, Reuters
ధోనీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు గెలవలేని ట్రోఫీ లేదనే చెప్పాలి.
వరల్డ్ కప్, ఛాంపియన్ టోఫీలను భారత్‌కు ధోనీ తెచ్చిపెట్టారు.
టీ-20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ లీగ్‌లలోనూ భారత్‌ను మెరిపించారు.
టెస్టు మ్యాచ్‌లలోనూ భారత్‌కు నంబర్ స్థానం దక్కేలా చేశారు ధోనీ.
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించిన ధోనీ తన ప్రస్థానంలో తీసుకున్న పది అసాధారణ నిర్ణయాలివీ.
1- జోగీందర్‌ను హీరో చేశారు
2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లోని చివర్ ఓవర్‌లో జోగీందర్ శర్మను బౌలింగ్ చేసేందుకు ధోనీ అనుమతించకపోయుంటే.. అసలు వరల్ట్ ఛాంపియన్ టీమ్‌లో జోగీందర్ ఉన్నాడనే సంగతి కూడా ఎవరికీ గుర్తుండేది కాదు.
ఆనాడు చివరి ఓవర్‌లో పాకిస్తాన్ 13 రన్లు తీయాల్సి ఉంది. కానీ ఒక వికెట్ మాత్రమే మిగిలుంది. క్రీజులో మిస్బావుల్ హక్ ఉన్నాడు.
అయితే, హర్బజన్ సింగ్‌కు బదులు జోగీందర్ శర్మను ధోనీ బౌలింగ్‌కు పంపి కీలక నిర్ణయం తీసుకున్నాడు. మూడో బంతికే మిస్బావుల్ హక్ వికెట్ పడింది. దీంతో ధోనీ చరిత్రలో ఈ నిర్ణయం మైలురాయిలా నిలిచిపోయింది.
2- బాల్ అవుట్‌లో బల్లే బల్లే
2007లో వరల్డ్ టీ20 లీగ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ టై అయ్యింది.
మ్యాచ్ ఫలితాన్ని బాల్ అవుట్‌తో నిర్ణయించాల్సి వచ్చింది. బాల్ అవుట్‌లో బౌలర్ ఒకే బాల్‌లో వికెట్ తీసుకోవాలి.
పాకిస్తాన్ టీమ్ రెగ్యులర్ బౌలర్లను ఎంపిక చేసింది. కానీ ధోనీ హర్బజన్ సింగ్ లాంటి రెగ్యులర్ బౌలర్లతోపాటు వీరేంద్ర సెహ్వాగ్, రాబిన్ ఉతప్ప లాంటి బౌలర్లను రంగంలోకి దించారు. దీంతో మ్యాచ్‌ను భారత్ గెలుచుకుంది.
3- ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్
2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో కులశేఖర బౌలింగ్‌లో ధోనీ కొట్టిన సిక్స్‌ను ఎవరు మరచిపోలగలరు?
భారత్‌కు 28ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ తీసుకొచ్చిన ధోనీ.. ఫైనల్‌లో 91 రన్లు కొట్టారు. ఆ మ్యాచ్‌లో ధోనీ సరిగ్గా బ్యాటింగ్ చేయకపోయుంటే విమర్శకుల చేతికి చిక్కేవాడు.
ఎందుకంటే ఫైనల్‌కు ముందు ధోనీ బ్యాటింగ్ సరిగా లేదు. కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైనల్‌లో ధోనీ.. ఫామ్‌లో ఉన్న యువరాజ్‌కు బదులుగా ఐదో నంబరు బ్యాట్స్‌మన్‌గా దిగారు.
దీనికి కారణం ఏంటంటే.. క్రిజ్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంబీర్ ఉన్నారు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ప్లే చేద్దామని ధోనీ భావించారు.
మరో కారణం ఏమిటంటే.. శ్రీలంక స్పిన్నర్లపై తేలిగ్గా రన్స్ తీయొచ్చని ఆయన భావించారు. చివరకు ధోనీ అనుకున్నదే జరిగింది.
4. యువరాజ్‌ను బౌలర్‌గా
యువరాజ్ సింగ్.. బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. అయితే 2011 వరల్డ్ కప్‌లో ఆయన్ను ధోనీ రెగ్యులర్ బౌలర్‌గా వాడారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో ఈ వ్యూహం ఫలించింది.
యువరాజ్ తొమ్మిది మ్యాచ్‌లలో 75 ఓవర్లు వేసి 15 వికెట్లు తీశారు. ఫైనల్, సెమీ ఫైనల్, క్వాటర్ ఫైనల్‌లలో రెండేసి వికెట్లు తీశారు.
5- రైనా-అశ్విన్‌ల ప్యాకేజీ
2011 ప్రపంచ కప్‌లో ధోనీ.. సురేశ్ రైనా, అశ్విన్‌ల సత్తాను మొదట్నుంచీ పైకి కనిపించ నివ్వలేదు. నాకౌట్ రౌండ్‌లో వీరిని ప్యాకేజీలా దించి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు.
2011 వరల్డ్ కప్‌లో అశ్విన్ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడారు. వీటిలో ఒకటి ఆస్ట్రేలియాపై క్వార్టర్ ఫైనల్. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌తో మొదటి ఓవర్ వేయించారు.
రెండు వికెట్లు తీసుకున్న అశ్విన్ ఆస్ట్రేలియా రిథమ్‌ను దెబ్బతీశారు. రైనా కూడా ఆస్ట్రేలియాపై 34 రన్స్ కొట్టి విజయంలో కీలకంగా మారారు.
పాకిస్తాన్‌పై కూడా సెమీ ఫైనల్‌లో రైనా 36 రన్లు కొట్టారు.

6- నెహ్రతో టార్గెట్
2011 ప్రపంచ వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ల్లో ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అంత ప్రభావం చూపలేకపోయారు. అయినా, పాకిస్తాన్‌పై సెమీ ఫైనల్‌లో ఆయనకు ధోనీ అవకాశం ఇచ్చారు.
అది కూడా ఆస్ట్రేలియాపై బాగా ఆడిన అశ్విన్‌కు బదులు నెహ్రాను దించారు.
పది ఓవర్లలో 33 రన్లతో రెండు వికెట్లు తీసిన నెహ్రా.. ఫైనల్‌లో చోటు సంపాదించుకున్నారు.

ఫొటో సోర్స్, pti
7- యువతపై భరోసా
ఆస్ట్రేలియాలో 2008లో జరిగిన ట్రై సిరీస్ కోసం జట్టులో యువకులను ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించారు.
ఆస్ట్రేలియాలోని పెద్ద పెద్ద గ్రౌండ్‌లలో యువ ఆటగాళ్లు అయితే రన్లను అడ్డుకోగలరని ధోనీ అభిప్రాయపడ్డారు.
ధోనీని చాలా మంది విమర్శించారు. అయితే ఆస్ట్రేలియాలో ట్రై సిరీస్ ట్రోఫీ గెలుచుకోవడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించింది.
యువ క్రెకటర్లు అయిన గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్‌ల పాత్ర ఈ గెలుపులో కీలకంగా మారింది.
8- ఇషాంత్‌తో గెలుపు
2013లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో వర్షం పడటంతో ఫైనల్ మ్యాచ్‌ను 20 ఓవర్లకు తగ్గించారు. భారత్‌పై విజయం సాధించడానికి ఇంగ్లండ్ 130 రన్లు కొట్టాల్సి ఉంది.
మోర్గన్, బోపారా మంచి బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను విజయంవైపు నడిపించారు.
చివరి మూడు ఓవర్లలో 28 రన్లు మాత్రమే భారత్ కొట్టాల్సి ఉంది. ఆ సమయంలో అందరికంటే ఎక్కువ రన్లు ఇచ్చిన ఇశాంత్ శర్మకు ధోనీ బౌలింగ్ ఇచ్చారు.
ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఒకే ఓవర్‌లో బోపారా, మోర్గన్‌ల వికెట్లను ఇషాంత్ తీసుకున్నారు. దీంతో ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి.
9- రోహిత్ లక్ మారింది
మిడిల్ ఆర్డర్‌లో ఆడే రోహిత్ శర్మ.. తన ప్రతిభకు తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయేవారు.
వన్ డే మ్యాచ్‌లలో రోహిత్‌ను ఓపెనర్‌గా ధోనీ ప్రమోట్ చేశారు. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు.

ఫొటో సోర్స్, PTI
10- ప్రతి బెట్టూ హిట్టే
భారత క్రికెట్ టీమ్‌తోపాటు ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా ధోనీ సక్సెస్ ఫుల్ టీమ్‌గా నడిపించారు. ఒక ప్లేయర్‌ను కొత్తగా తీసుకొద్దామని టీమ్ ప్రమోటర్ ఎన్ శ్రీనివాసన్ భావించినప్పటికీ.. అతడితో కాంట్రాక్ట్ కుదర్చుకోవడానికి ధోనీ ఒప్పుకోలేదు. ఈ విషయం ఇటీవలే బయటకు వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ‘అచ్రేకర్ సర్‌తో నా అద్భుత ప్రయాణం అలా మొదలైంది’ - సచిన్ తెండూల్కర్
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- ధోనీలా హెలికాప్టర్ షాట్ ట్రై చేసి చేయి విరగ్గొట్టుకున్నాను: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
- సచిన్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ‘‘నేను ఎందుకు రిటైర్ అయ్యానంటే..’’
- సచిన్‌ను అందరికన్నా ఎక్కువ భయపెట్టిన క్రికెటర్ ఆయనే
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కిట్ కొనడానికి కష్టపడ్డ మిథాలీ.. ఇప్పుడు పారితోషికంలో టాప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












