మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన ఏకైక కెప్టెన్

వీడియో క్యాప్షన్, మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలు ముద్దాడిన ఏకైక కెప్టెన్

మూడు ప్రధాన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీ చరిత్రలో నిలిచిపోయారు.

2007లో ఐసీసీ టీ-20 వరల్డ్‌ కప్‌, 2011లో ఐసీసీ వరల్డ్‌ కప్‌, 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని కెప్టెన్‌ ధోనీ ఆధ్వర్యంలోని జట్లు గెలుచుకున్నాయి.

భారత్ తరఫున 350 వన్డేలు ఆడిన ధోనీ, 50 కంటే ఎక్కువ సగటుతో 10,773 పరుగులు చేశారు.

వన్డే క్రికెట్‌లో ధోని 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలున్నాయి.. వికెట్ కీపర్‌గా 321 క్యాచ్‌లు తీసుకొని 123 మంది ఆటగాళ్లను స్టంప్ అవుట్‌ చేశారు.

టీ-20 క్రికెట్‌లో భారత్ తరఫున 98 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 37 పైగా సగటుతో 1617 పరుగులు చేశారు.

టెస్ట్‌ క్రికెట్‌లో 2014లోనే ధోనీ రిటైరయ్యారు. 90 టెస్టుల్లో 38కి పైగా సగటుతో 4876 పరుగులు చేసిన ధోనీ, టెస్టుల్లో 256 క్యాచ్‌లు, 38 స్టంప్‌లు చేశారు. బ్యాట్స్‌ మన్‌గా 6 సెంచరీలు, 33 అర్ధసెంచరీలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)