బెంగళూరులో హింస: పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి.. అసలు ఏం జరిగింది?

- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
బెంగళూరులో మంగళవారం అర్థరాత్రి హింస చెలరేగింది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యాఖ్యతో ఆందోళన చేపట్టిన నిరసనకారులు విధ్వంసానికి దిగారు.
ఈశాన్య బెంగళూరులోని రెండు పోలీసు స్టేషన్ల మీద దాడి చేశారు. ఒక ఎమెల్యే ఇంటి పైనా దాడి చేశారు.
దాడులను ఆపటానికి పోలీసులు కాల్పులు జరపటంతో ముగ్గురు చనిపోయారని సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కమల్‌పంత్ తెలిపారు. పోలీసులు 110 మందిని అరెస్ట్ చేశారు.
వెంటనే రెండు పోలీస్ స్టేషన్ పరిథుల్లోనూ కర్ఫ్యూ విధించారు. బెంగళూరు నగరంలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులోకి తెచ్చామని కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఏం జరిగింది?
పులికేసినగర్ ఎంఎల్ఏ అఖండ శ్రీనివాసమూర్తి (కాంగ్రెస్) బంధువు ఒకరు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు మతవిశ్వాసాలను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ కొంతమంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
ఆ వ్యాఖ్య మీద ఫిర్యాదు చేయటానికి ఒక గుంపు పోలీస్ స్టేషన్ దగ్గరికి, మరో గుంపు ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి ప్రదర్శనగా బయలుదేరాయి.
తమ ఫిర్యాదును నమోదు చేసుకుని.. తమ మత విశ్వాసాలను దెబ్బతీసినందుకు ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలని ఒక వర్గం పట్టుపట్టింది.

ఈ ఆందోళన త్వరగా హింసాత్మకంగా మారిందని, నిరసనకారులు పోలీస్ స్టేషన్ వెలుపల ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారని చెప్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే ఇంటి దగర్గ ఉన్న మరో గుంపు.. అక్కడ వాహనాలను దగ్ధం చేసింది. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు.
నిందితుడి అరెస్ట్...
"నిన్న రాత్రి జరిగిన పోలీస్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. అర్థరాత్రి 12.30 గంటల తరువాత దాడులు సర్దుమణిగాయి" అని కమిషనర్ ఆఫ్ పోలీస్ కమల్‌పంత్ బుధవారం ఉదయం మీడియాకు తెలిపారు.

సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్య చేసిన వ్యక్తిని తాము అదుపులోకి తీసుకున్నట్లు కమిషనర్ చెప్పారు. నిందితుడు నవీన్ ఎమ్మెల్యేకు బంధువని వివరించారు.
"నమస్కారం. నేను పులికేశినగర్ ఎంఎల్ఏ అఖండ శ్రీనివాసమూర్తి. నా ముస్లిం సోదరులందరికీ చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారి కోసం గొడవపడొద్దని విజ్ఞప్తి. మనమందరం సహోదరులం. తప్పు చేసినవారిని చట్టపరంగా శిక్షించేదుకు పోరాడదాం. ఈ విషయంలో నేను మీతో పాటే ఉంటాను" అంటూ ఎంఎల్ఏ ఒక వీడియోలో చెప్పినట్టుగా తెలుస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సహించం: యడ్యూరప్ప
పోలీసులు, పాత్రికేయుల మీద దాడిని అంగీకరించబోమని.. ఇటువంటి వదంతులను, రెచ్చగొట్టటాన్ని ప్రభుత్వం సహించబోదని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురవాటానికి సాధ్యమైన అన్ని చర్యలూ చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.
"హింస, తగలబెట్టడం చట్టవిరుద్ధమైన చర్యలు. విషయం ఎలాంటిదైనా సరే చట్ట ప్రకారం విచారణ జరగాలి. పరిస్థితిని అదుపులోకి తీసుకోమని నేను పోలీసులకి చెప్పాను. ఈ సంఘటనకు బాధ్యులు ఎవరైనా సరే, వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ రెండు ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించాం. దీనికి కారణమైనవారెవరైనా సరే చట్ట ప్రకారం శిక్ష పొందేలా చేస్తాం" అని రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ఒక వీడియోలో తెలిపారు. కర్నాటకకు చెందిన అమీర్-ఈ-షరియత్ హజ్రత్ మౌలనా సంఘీర్ అహ్మెద్ కూడా ముస్లిం సోదరులు సంయమనం పాటించాలని, తప్పు చేసినవారిని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారని విజ్ఞప్తి చేసారు. "దయచేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి. ప్రభుత్వం సరైన చర్య తీసుకుంటుంది" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'కరోనా తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం.. నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం': పుతిన్
- హిరోషిమా, నగాసాకి నగరాలపై అణుబాంబు దాడికి 75 ఏళ్లు... ఆ విధ్వంసకర దృశ్యాలివీ
- అమెరికాలో నిరసనలు: సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు ఉందా?
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








