కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేశామన్న రష్యా... 'నా బిడ్డకు కూడా ఈ టీకా ఇచ్చాం' - అధ్యక్షుడు పుతిన్

పుతిన్

ఫొటో సోర్స్, Reuters

కరోనా వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేసే తొలి వ్యాక్సీన్‌ను తమ శాస్త్రవేత్తలు సిద్ధం చేశారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ ప్రకటించారు. "కరోనాను ఎదుర్కోడానికి మొదటి వ్యాక్సీన్‌ సిద్ధమైంది'' అని పుతిన్‌ తన మంత్రులకు మంగళవారం ఉదయం వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్‌తో మనుషులపై రెండు నెలలుగా పరీక్షలు జరిపామని, ఇది అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పుతిన్ తెలిపారు.

ఈ వ్యాక్సీన్‌ను రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఆమోదించింది. రష్యాలో ఈ వ్యాక్సీన్‌ను ప్రజలకు పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.

पुतिन

ఫొటో సోర్స్, Reuters

అయితే రష్యా ఈ వ్యాక్సీన్‌ను ఇంత త్వరగా ఎలా తయారు చేయగలిందని, దీని శాస్త్రీయత ఎంత అన్నదానిపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రం ఈ వ్యాక్సిన్‌ సురక్షితమైందని, దీన్ని గమాలయా ఇనిస్టిట్యూట్‌లో తయారు చేశామని, తన కుమార్తెకు కూడా ఈ టీకా ఇచ్చినట్లు అధికార టెలివిజన్‌లో ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"ఈ టీకా చాలా ప్రభావవంతమైనదని నాకు తెలుసు, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అన్ని భద్రతా ప్రమాణాలు పాటించామని నేను పునరుద్ఘాటిస్తున్నాను'' అని పుతిన్‌ వెల్లడించారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయబోతున్నామని ఆయన అన్నారు.

कोरोना वायरस

ఫొటో సోర్స్, Reuters

తుది దశలో చైనా ప్రయోగాలు

మరోవైపు చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్‌ లిమిటెడ్‌ మంగళవారం కోవిడ్ -19 వ్యాక్సిన్ చివరి దశ మానవ ప్రయోగాలను ప్రారంభించింది. ఈ టీకాను ఇండోనేషియాలోని 1620 మంది రోగులపై పరీక్షిస్తున్నారు.

ఇండోనేషియా ప్రభుత్వ యాజమాన్యంలోని బయోఫార్మా సహకారంతో ఈ టీకాను తయారు చేస్తున్నారు. ఈ ప్రయోగాల రెండో దశ వ్యాక్సిన్‌ సురక్షితమైందని, రోగులలో యాంటీబాడీలకు సంబంధించిన రెస్పాన్స్‌ను తాము గుర్తించామని సినోవాక్‌ సంస్థ వెల్లడించింది.

కరోనావాక్ అనే పేరుతో తయారవుతున్న ఈ వ్యాక్సిన్‌కు పరీక్షలు చివరి దశలో ఉన్నాయని, కరోనాపై ప్రభావవంతమైన వ్యాక్సిన్‌లలో ఇది ఒకటని ఆ సంస్థ పేర్కొంది.

వీడియో క్యాప్షన్, 'కరోనావైరస్ వ్యాక్సీన్ తయారు చేశాం. నా బిడ్డకు కూడా ఈ టీకా ఇచ్చాం' -అధ్యక్షుడు పుతిన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)