కేరళలో ఎయిరిండియా విమాన ప్రమాదం: 18కి పెరిగిన మృతుల సంఖ్య

ప్రమాద స్థలంలో విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, కూలిన విమానాన్ని పరిశీలిస్తున్న పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ

కేరళలోని కోళికోడ్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ధ్రువీకరించారు.

ఈ ప్రమాదంలో గాయపడినవారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి వెల్లడించారు.

ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. పదేళ్ల కిందట మంగుళూరులో జరిగిన ప్రమాదం మాదిరిగా విమానం మంటల్లో చిక్కుకుని ఉంటే ప్రాణ నష్టం ఇంకా తీవ్రంగా ఉండేదని, అదృష్టవశాత్తు అలా జరగలేదని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఎయిర్ ఇండియా సీఎండీ, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈవో, ఫ్లైట్ సేఫ్టీ చీఫ్ తదితర ఉన్నతాధికారులు కోజికోడ్ చేరుకున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

బాధితులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందు గాను దిల్లీ, ముంబయిల నుంచి రెండు ప్రత్యేక విమానాలు కోజికోడ్ వెళ్లేందుకు ఏర్పాటు చేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు.

కేరళలో కూలిన విమానం

ప్రమాదం ఎలా జరిగింది

కేరళలోని కోళికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయి-కోళికోడ్ ఎయిరిండియా విమానం (ఐఎక్స్ - 1344) ల్యాండ్ అవుతుండగా రన్ వే నుంచి జారిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 7.45 గంటల సమయంలో జరిగింది.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది చనిపోయారని ఎయిర్ ఇండియా ప్రకటించింది.. 123 మంది గాయపడ్డారు. 15 మంది పరిస్థితి విషమంగా ఉందని ఎయిర్ ఇండియా వర్గాలు చెప్పాయి.

కేరళ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

తీవ్రంగా గాయపడిన వారిని కోళికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో, సమీప ఆస్పత్రుల్లో చేర్పించామని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. "ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు" అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఈ విమానంలో 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది సహా 191 మంది ప్రయాణికులు ఉన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలిస్తున్నామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అడిషనల్ డీజీ (మీడియా) రాజీవ్ జైన్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచాణకు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ఆదేశించారు. అయితే, విమానంలో మంటలు చెలరేగకపోవడం వల్ల ప్రమాద తీవ్రత అదుపులో ఉందని తెలుస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందనే వివరాలు ఇంకా అధికారికంగా రావలసి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దింపేశారు.

ఈ ప్రమాదం ఎంతో బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నానని, గాయపడిన వారు సత్వరమే కోలుకోవాలని కోరుకుంటున్నానని మోదీ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

ప్రమాదం గురించి కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని కూడా మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ విమాన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని హోం మంత్రి అమిత్ షా అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

ఘటనా స్థలానికి ఎన్‌డీఆర్ఎఫ్ వెంటనే చేరుకుని సహాయక చర్యలకు సహకరించాలని అమిత్ షా ఆదేశించారు.

హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియ చేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.

టేబుల్ టాప్ రన్ వే

కోళికోడ్ విమానాశ్రయం రన్ వే టేబుల్ ఉపరితలంగా ఉంటుందన్న సంగతి మరిచిపోకూడదని, ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులకు గాయాలయ్యాయని, కొందరు స్పృహ కోల్పోయారని నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) డీజీ ఎస్.ఎన్ ప్రధాన్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 9
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 9

ఎన్‌డీఆర్ఎఫ్ బృందం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)