అయోధ్య: రామ మందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో ఏముంటుంది

ఫొటో సోర్స్, NURPHOTO
- రచయిత, అనంత్ ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరం పునాదుల్లో ఒక కాల నాళిక(టైమ్ కాప్స్యూల్)ను వేయాలని నిర్ణయించామని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు.
“భవిష్యత్తులో ఎవరైనా మందిరం చరిత్రను అధ్యయనం చేయాలనుకుంటే, వారికి రామ జన్మభూమికి సంబంధించిన వాస్తవాలు లభించేలా, దీనిపై మళ్లీ ఎలాంటి వివాదాలకు తావులేకుండా టైమ్ కాప్స్యూల్‌ను భూమి అడుగున 2 వేల అడుగుల లోతులోకి పంపించబోతున్నాం” అని చౌపాల్ చెప్పారు.
కానీ, టైమ్ కాప్స్యూల్ విషయం వదంతులేనని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఈ టైమ్ కాప్స్యూల్ గురించి ట్రస్ట్ సభ్యులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, ఈ టైమ్ కాప్స్యూల్ లోపల ఏమేం పెట్టబోతున్నారు అనే విషయంలో కూడా ఒక వివాదం ఉంది.
కొంతమందికి దీనిని ఒక విధంగా అయోధ్య వివాదానికి సంబంధించిన చరిత్రను రాసి ఉంచడమే అనుకుంటున్నారు .
మరికొంతమంది మాత్రం అసలు టైమ్ కాప్స్యూల్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. దాని ప్రాధాన్యం ఏమిటి అనేది అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
టైమ్ కాప్స్యూల్ అనేది ఒక డివైస్. ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని భవిష్యత్తుకు లేదా మరో ప్రపంచానికి అందించేందుకు అందులో నిక్షిప్తం చేస్తారు.
ఉదాహరణకు, ఎవరైనా 2020లో జరిగిన ఒక సమాచారాన్ని 3020, ఆ తరువాత ఉండే తరానికి చేర్చాలని అనుకుంటే, వారు ఇలాంటి డివైస్ ఉపయోగించవచ్చు.
అలా చేయడానికి మొదట వారు ప్రస్తుత ప్రపంచానికి సంబంధించిన సమాచారాన్ని, కొన్ని వేల ఏళ్ల తర్వాత కూడా సురక్షితంగా ఉండగలిగేలా ఏదైనా ఒక రూపంలోకి మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత 3020లో ఎవరైనా తవ్వకాలు జరిపినపుడు, ఆ టైమ్ కాప్స్యూల్ దొరికేలా దానిని ఒక ప్రత్యేక ప్రాంతంలో భూమి లోపల ఉంచాలి.
ఆ తర్వాత, వారు ఆ టైమ్ కాప్స్యూల్‌ను చూసి లేదంటే చదివి 2020లో అప్పటి ప్రపంచం ఎలా ఉండేది, అప్పుడు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించేవారు లాంటి విషయాలను తెలుసుకోగలుగుతారు.

ఫొటో సోర్స్, IIT kanpur
సమాచారం సురక్షితంగా ఉండాలి
టైమ్ కాప్స్యూల్ రూపం, ఆకారం, రకం గురించి స్పష్టమైన నిబంధనలు ఏవీ లేవు. అది స్థూపాకారం, చతురస్రం, దీర్ఘ చతురస్రాకారం, లేదా వేరే ఏదైనా ఆకారంలోగానీ ఉండచ్చు. ఆ టైమ్ కాప్స్యూల్ లేదా కాలనాళిక తన పనిని పూర్తి చేసేలా, లోపల ఉన్న సమాచారాన్ని ఒక పరిమిత కాలం వరకూ సురక్షితంగా ఉంచగలిగేతే చాలు.
పురాతత్వ శాస్త్రంలో టైమ్ కాప్స్యూల్ లాంటిది ఏదీ లేదని బటేశ్వర్ ఆలయాలను పునరుద్ధరించిన పురాతత్వ నిపుణులు కేకే మొహమ్మద్ చెప్పారు.
“టైమ్ కాప్స్యూల్ ఎలా ఉండాలి, అనేది దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి లేదా సంస్థను బట్టి ఉంటుంది. ఇక దాని ఆకారం విషయానికి వస్తే, స్తూపాకార లేదా గోళాకార వస్తువులు భూమిలోపల ఒత్తిడిని సమర్థంగా తట్టుకోగలుగుతాయి. కానీ, ఇప్పటివరకూ భారత్‌లో అలాంటి టైమ్ కాప్స్యూల్ ఏదీ లభించలేదు. ఇంతకు ముందొకసారి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎర్రకోట లోపల టైమ్ కాప్స్యూల్ వేయించారు” అన్నారు.
రామ మందిర పునాదుల్లో టైమ్ కాప్స్యూల్ వేయడం మంచిదేనని కేకే మొహమ్మద్ అన్నారు.
“అది మంచిదే, ఎందుకంటే అలా చేయడం వల్ల, భవిష్యత్తులో ఎలాంటి వివాదం రాజుకోకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కోర్టు తీర్పులపై ఆధారపడే జరుగుతున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
దేశంలో తొలి టైమ్ కాప్స్యూల్
భారత్‌లో టైమ్ కాప్స్యూల్ చరిత్ర అంత పురాతనమేం కాదు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 25 ఏళ్ల తర్వాత ఒక దేశంగా 25 ఏళ్లలో సాధించిన విజయాలు, సంఘర్షణలను వివరించడానికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎర్రకోటలో ఒక టైమ్ కాప్స్యూల్ వేయించారు.
ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రయాణంలో అగ్రపథంలో ఉన్నప్పుడు అలా చేశారు. అప్పుడు దేశంలో అత్యవసర స్థితి ఉంది. కానీ, ఆమె అప్పుడు ఎర్రకోటలో టైమ్ కాప్స్యూల్ వేయించారు.
కానీ, ఆ టైమ్ కాప్స్యూల్‌లో ఉంచిన సమాచారం గురించి కొన్నిరోజుల్లోనే వివాదం మొదలైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇందిర తర్వాత అధికారంలోకి వచ్చిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆ టైమ్ కాప్స్యూల్‌ను తవ్వి బయటకు తీయించింది.
కానీ ఆనాటి ఆ టైమ్ కాప్స్యూల్‌లో ఏముంది, అనే విషయంలో ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది.
ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2010, మార్చి 6న ఐఐటీ కాన్పూర్‌లో ఒక టైమ్ కాప్స్యూల్‌ను భూమి లోపల పాతిపెట్టారు.
ఆ టైమ్ కాప్స్యూల్లో కాన్పూర్ ఐఐటీ మ్యాప్, ఇన్‌స్టిట్యూట్ ముద్ర, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ లోగోలు లాంటివి ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా మందిర్‌లో టైమ్ కాప్స్యూల్ వేశారు.
ఇప్పుడు, ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామమందిరం పునాదుల్లో భూమిలో 2వేల అడుగుల లోతులోకి టైమ్ కాప్స్యూల్ వేస్తే, టైమ్ కాప్స్యూల్ వేయించిన రెండో ప్రధాని అవుతారు మోదీ.
ఇక, ప్రపంచవ్యాప్తంగా టైమ్ కాప్స్యూల్ విషయానికి వస్తే, అంతరిక్ష ప్రోబ్ వాయేజర్ 1, 2లో మానవ సంస్కృతి గురించి సమాచారాన్ని పంచుకున్నారు.

ఫొటో సోర్స్, SPACE FRONTIERS
ఎన్నో వివాదాలు
టైమ్ కాప్స్యూల్ తరచూ వివాదాలకు కారణమవడం మనకు కనిపిస్తుంది. రామమందిరం విషయంలో కూడా అదే జరుగుతోంది.
ఈ వార్తలు బయటకు రాగానే, ఈ టైమ్ కాప్స్యూల్‌లో ఏం పెట్టడం బాగుంటుంది అనే విషయంలో సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు సంధించడం మొదలైంది.
రామ మందిరం టైమ్ కాప్స్యూల్‌కు సంబంధించిన తాజా వివాదం ఏంటంటే, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ టైమ్ కాప్స్యూల్ వార్తలు కేవలం వదంతులేనని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ట్రస్ట్ సభ్యుల మధ్య నడుస్తున్న ఈ వివాదం మధ్య, అసలు అయోధ్య రామమందిర పునాదుల్లో నిజంగానే కాప్స్యూల్ వేయబోతున్నారా, లేదా అనే ప్రశ్న కూడా వస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: రామమందిర భూమి పూజకు సన్నాహాలు.. మరి, మసీదుకు కేటాయించిన స్థలంలో ఏం జరుగుతోంది
- ఆక్స్ఫర్డ్ వ్యాక్సీన్ తయారీ బృందానికి నేతృత్వం వహిస్తున్న సారా గిల్బెర్ట్ ఎవరు
- ‘నాన్న పుర్రెను, ఎముకలను సూట్‌కేసుల్లో పెట్టుకుని వచ్చా’: ఉత్తర కొరియాలో యుద్ధ ఖైదీ కుమార్తె
- ఉత్తర కొరియా: సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన వ్యక్తే కరోనాను వెంట తెచ్చాడా?
- సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్
- చైనా విద్యార్థులు తమను తామే కిడ్నాప్ చేసుకుంటున్నారు.. పోలీసులు అసలు కథ బయటపెట్టారు
- సోనూ సూద్ ట్రాక్టర్ ఇచ్చిన రైతు నాగేశ్వరరావు రాజకీయ నాయకుడు ఎలా అయ్యారు?
- తల్లుల నుంచి పసిబిడ్డలకు కరోనావైరస్ సోకే అవకాశం తక్కువే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








