సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ధోనీ బయోపిక్ హీరో మృతి

ఫొటో సోర్స్, Getty Images
ధోనీ జీవితచరిత్రలో టైటిల్ రోల్ చేసిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆయన చనిపోయినట్లు ముంబయి పోలీసులు ధ్రువీకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.సూసైడ్ నోట్ వంటిదేమీ దొరకలేదని ముంబయి పోలీసుల అధికార ప్రతినిధి డీసీపీ ప్రణయ్ అశోక్ చెప్పారు.
కాగా సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన ఇంట్లో పనిచేసేవారు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టీవీ నటుడిగా మొదలైన ప్రస్థానం
సుశాంత్ సింగ్ బిహార్‌లోని పట్నాలో 1986 జనవరి 21న జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు.
కిస్ దేశ్ మే హై మేరా దిల్ అనే టీవీ సీరియల్‌తో అతని నటనా జీవితం ప్రారంభమైంది.జీటీవీలో 2009-11లో వచ్చిన పవిత్ర రిష్తా సీరియల్‌తో మంచి పేరు సంపాదించిన ఆయన 2013లో వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

ఫొటో సోర్స్, AFP
మొదటి సినిమాకే ఫిలింఫేర్ అవార్డు
2013లో వచ్చిన కైపోచేతో సుశాంత్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అందులో తన నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.తర్వాత సుశాంత్ శుద్ధ్ దేశీ రొమాన్స్, డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షీ లాంటి సినిమాలు చేశారు.
అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ పీకేలోనూ సుశాంత్‌ది కీలక పాత్ర ఉంది.

ఫొటో సోర్స్, SPICE PR
ధోనీ జీవిత కథతో సౌత్‌లోనూ..
భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ జీవితకథతో వచ్చిన ‘‘ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు.కేదార్‌నాథ్, చిచోరే లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
జర్నలిస్ట్ మధు పాల్ వివరాల ప్రకారం బాంద్రా పోలీస్ స్టేషన్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నౌకరు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు.టీవీ నటుడుగా కెరియర్ ప్రారంభించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల కొన్నేళ్లుగా వెండితెరపై తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇదే..
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
సుశాంత్ నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ చందామామా దూర్ కే రిలీజ్ కావాల్సి ఉంది. బడ్జెట్ కొరతతో ఆ చిత్రాన్ని ప్రస్తుతానికి ఆపేశారు.పది రోజుల క్రితం అతడు ఇన్‌స్టాగ్రాంలో తన తల్లి ఫొటోతో పాటూ తన ఫొటోను పోస్ట్ చేశాడు.
''మసకబారిన గతం కన్నీరుగా జారి ఆవిరవుతోంది. అనంతమైన కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి.
ఆ రెండింటి మధ్యా బతుకుతున్నా' అని సుశాంత్ ఆ పోస్టులో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
లవ్‌లైఫ్‌లో ఒడుదొడుకులు
సుశాంత్ ఇంజనీరింగ్ చేశాక హీరో కావాలనే కలలు నిజం చేసుకోడానికి యాక్టింగ్ వైపు మళ్లాడు.మొదట్లో అతడు డ్యాన్సర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 'కిస్ దేశ్ మే హై మేరా దిల్' పేరుతో వచ్చిన సీరియల్‌తో అతడికి యాక్టింగ్ కెరీర్లో మొదటి బ్రేక్ వచ్చింది.
ఆ తర్వాత 'పవిత్ర రిస్తా' సీరియల్ సుశాంత్‌ను ఇంటింటికీ పరిచయం చేసింది.యాక్టింగ్ కెరీర్ విజయవంతం అయ్యాక సుశాంత్ 'జర నచ్ కే దిఖా', 'ఝలక్ దిఖలాజా' డాన్స్ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నాడు.ఆ తర్వాత సుశాంత్ సినిమాల్లోకి వచ్చాడు. తొలి సినిమా 'కైపోచే'లో అతడికి ప్రశంసలు దక్కడంతో సుశాంత్ కెరియర్ గ్రాఫ్ పైపైకి వెళ్లింది. వరస హిట్స్ అందుకున్నాడు. కెరియర్ పరంగా విజయం దక్కినా సుశాంత్ 'లవ్ లైఫ్' అంత సంతృప్తికరంగా లేదు. టీవీ సీరియల్ 'పవిత్ర రిష్తా'లో సహ నటి అంకితా లోఖండేతో అతడు సహజీవనం చేశాడు. తర్వాత ఇద్దరూ విడిపోయారని వార్తలు వచ్చాయి. సుశాంత్ సినీరంగంలో విజయవంతం కావడంతో ఇద్దరి మధ్యా మనస్ఫర్థలు వచ్చాయని భావించారు. ఇటీవల సుశాంత్ దగ్గర గతంలో మేనేజర్‌గా పనిచేసిన చుంకీ దిశా సలియన్ కూడా ఒక భవనం మీద నుంచి పడిపోవడం వల్ల చనిపోయారు.
మొదట ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు. కానీ తర్వాత దిశ ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Twitter
ఆత్మహత్యలు వద్దని చెప్పిన హీరోయే చివరకు..
సుశాంత్ కేవలం హీరోగానే కాదు, టీవీ ఆర్టిస్ట్ గా, డ్యాన్సర్‌గా, దాతగానూ పేరు తెచ్చుకున్నారు. చదువుకునే రోజుల్లో జీనియస్ అని పేరు తెచ్చుకున్న ఆయన జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఫిజిక్స్‌లో విజేతగా నిలిచారు.
గతంలో తాను నటించిన చిచ్చోరే సినిమాలో ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని సందేశం ఇచ్చే హీరో పాత్ర పోషించిన సుశాంత్ ఇప్పుడు తానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇవి కూడా చదవండి:
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









