కరోనావైరస్ అన్‌లాక్ 1: ఆల‌యాలు, షాపింగ్ మాల్స్‌, రెస్టారెంట్లు ఓపెన్.. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటే..

ఈ రోజు నుంచి ఆలయాలు కూడా భక్తుల కోసం తెరచుకోనున్నాయి. భక్తులకు కరోనావైరస్ సోకకుండా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ రోజు నుంచి ఆలయాలు కూడా భక్తుల కోసం తెరచుకోనున్నాయి. భక్తులకు కరోనావైరస్ సోకకుండా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి

క‌రోనావైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న‌ల న‌డుమ భార‌త్‌లో లాక్‌డౌన్‌ను ద‌శ‌ల వారీగా స‌డలిస్తున్నారు. ఈ విష‌యంలో తెలుగు రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వాన్ని అనుస‌రిస్తున్నాయి.

జూన్ 1 నుంచి స‌డ‌లించే ఆంక్ష‌ల జాబితాను అన్‌లాక్‌-1 పేరుతో ఇప్ప‌టికే కేంద్ర హోం శాఖ విడుద‌ల చేసింది. మూడు ద‌శ‌ల్లో లాక్‌డౌన్‌ను స‌డ‌లించ‌బోతున్న‌ట్లు దీనిలో పేర్కొంది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 1

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 1

మొద‌టి ద‌శ‌లో భాగంగా జూన్ 8 అంటే సోమ‌వారం నుంచి ఆతిథ్యం, ప‌ర్య‌ట‌కంతోపాటు మ‌రికొన్ని కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిచ్చింది. కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుప‌ల ఉండే ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ వీటిలో ఉన్నాయి.

ఈ ఆదేశాల‌కు అనుగుణంగానే సోమ‌వారం నుంచి స‌డ‌లించ‌బోయే ఆంక్ష‌ల జాబితాను ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, అటు తెలంగాణ విడుద‌ల చేశాయి. స‌డ‌లింపుల న‌డుమ ప్ర‌జ‌లు పాటించాల్సిన నియ‌మ నిబంధ‌న‌ల‌నూ వెల్ల‌డించాయి.

భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

గుడిలో చేయకూడనివి ఏంటి?

జూన్ 1న కేంద్రం సూచించిన‌ట్లే తెలుగు రాష్ట్రాల్లోనూ కంటైన్‌మెంట్ జోన్‌లో లాక్‌డౌన్ ఈ నెల 30 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఇక్క‌డ ఆంక్ష‌ల‌న్నీ య‌థావిధిగా అమ‌లులో ఉంటాయి.

కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుపల తెరిచే ఆల‌యాలు, షాపింగ్ మాల్స్ విష‌యంలో అనుస‌రించాల్సిన నిబంధ‌న‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మార్గ ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. వాటి ప్ర‌కారం.. రాష్ట్రాంలో దేవాల‌యాల‌తోపాటు, ఇత‌ర ధార్మిక ప్రాంతాలు జూన్ 8 నుంచి తెర‌చుకోవ‌చ్చు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 2

అయితే దేవ‌తా విగ్ర‌హాల‌తోపాటు ప‌విత్ర గ్రంథాల‌ను తాక‌కుండా భ‌క్తులు ద‌ర్శ‌నాలు చేసుకోవాలి. తీర్థ ప్ర‌సాదాలు ఇవ్వ‌కూడ‌దు. భ‌క్తుల‌పై ప‌విత్ర జ‌లాలు చ‌ల్ల కూడ‌దు. అన్న‌దానం నిర్వ‌హణ స‌మ‌యంలో సామాజిక దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. భ‌క్తులు అన్నిచోట్లా త‌ప్ప‌కుండా భౌతిక దూరంపాటిస్తూ క్యూలో నిల‌బ‌డాలి.

ఈ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యాన్ని సోమ‌వారం (జూన్ 8) నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నామని ఆల‌య‌ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

కేరళలోని ప్ర‌ఖ్యాత‌ శబరిమల 14న‌, అనంత పద్మనాభస్వామి ఆల‌యం 9న‌, గురువాయూర్​ శ్రీకృష్ణ ఆలయం 15న తెర‌చుకోనున్నాయి.

షాపింగ్ మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లను తెరవకూడదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాపింగ్ మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లను తెరవకూడదు

సినిమా థియేట‌ర్లు ఇప్పుడే కాదు

మ‌రోవైపు కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఇతర ప్రదేశాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెర‌చుకోవ‌చ్చని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం స్ప‌ష్టంచేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్ ఇచ్చేందుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. షాపింగ్ మాల్స్ లో ఉన్న సినిమా థియేటర్లను తెరవకూడదు.

షాపింగ్ మాల్స్ లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు త‌మ కెపాసిటీలో 50 శాతం మందిని మాత్రమే లోప‌ల‌కు అనుమ‌తించాలి.

హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు మారిన ప్రతిసారీ.. టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్ చేయాలి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్స‌హించాలి. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎవ‌రూ ఉమ్మ‌కూడ‌దు.

తెలంగాణలోనూ ఇదే విధంగా ప్రార్థ‌నా మందిరాలు, షాపింగ్ మాల్స్ తెర‌చుకుంటున్నాయి.

షాపింగ్ మాల్స్‌ కూడా ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాపింగ్ మాల్స్‌ కూడా ఈరోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి

కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర, నిత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ జోన్ల లోపలికి కానీ, బయటకు కానీ వ్యక్తుల సంచారం లేకుండా ఖచ్చితమైన నియంత్రణ ఉంటుంది.

స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు, కోచింగ్ సంస్థలు మొదలైనవాటిని రెండో ద‌శ‌లో తెరుస్తారు. మూడో ద‌శ‌లో అంత‌ర్జాతీయ విమాన సేవ‌లు, మెట్రో రైలు సేవ‌లు, సినిమా హాళ్లు ఇత‌ర ప్రాంతాల‌ను తెరుస్తారు. ఈ రెండు ద‌శ‌లు ఎప్పుడు మొద‌లవుతాయో స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేదు.

మ‌రోవైపు తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ మంత‌టా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ క‌ర్ఫ్యూ కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)