భారత్ లాక్‌డౌన్: కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం, ఏప్రిల్ 20 నుంచి అనుమతించే పనులు ఇవే

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఆ మార్గదర్శకాలలో కొన్ని ముఖ్యమైన అంశాలివి...
- ప్రజల రాకపోకలపై మే 3 వరకూ నిషేధం కొనసాగుతుంది. రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, బస్సులు సహా అన్ని రకాల రవాణా సదుపాయాలు మూసి ఉంటాయి. ట్యాక్సీలు, ఆటోలు కూడా నడవవు.
- నిత్యావసరాలు, అగ్నిమాపక, శాంతిభద్రతలు, అత్యవసర సేవలు అందించే వాహనాలు మాత్రమే తిరుగుతాయి. సరుకుల రవాణాకు, సహాయ కార్యక్రమాలకు రైల్వే, ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల వంటివాటి సేవలు కొనసాగుతాయి.
- ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, ల్యాబ్‌లు, క్లినిక్‌లు, వైద్య సామగ్రి దుకాణాలు, నర్సింగ్ హోంలు, అంబులెన్స్‌ల వంటివన్నీ నడుస్తాయి.
- ఏప్రిల్ 20 తర్వాత వ్యవసాయ, పశుసంవర్థక కార్యకలాపాలకు, ప్రభుత్వ మార్కెట్లు, కొనుగోళ్ల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
- ఉపాధి హామీ పథకం పనులకు అనుమతి ఉంటుంది. అయితే, అందరూ సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
- ఏప్రిల్ 20 తర్వాత ఫార్మాసూటికల్ పరిశోధన కార్యకలాపాలు, ఔషధాలు, వైద్య పరికరాల తయారీకి అనుమతి ఉంటుంది.
- సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, క్రీడా సముదాయాలు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3 వరకూ మూసే ఉంటాయి.
- రేషన్ దుకాణాలు, ఆహారం, నిత్యావసర సరకులు, పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, పశువుల దాణా, ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందులు అమ్మే దుకాణాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది.
- ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల్లో 50 శాతం లోపు సిబ్బందితో కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
- స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు... ఇలా అన్ని రకాల విద్య, శిక్షణ, పరిశోధన, కోచింగ్ సంస్థలు మూసే ఉంటాయి.
- మత ప్రార్థన స్థలాలకు, ఆలయాలకు సాధారణ ప్రజలకు అనుమతి ఉండదు. మతపరమైన సభలు, ర్యాలీలు నిర్వహించకూడదు.
- అన్ని రకాల సామాజిక, క్రీడ, విద్య, సాంస్కృతిక సభలు, కార్యక్రమాలు, సమావేశాలపై నిషేధం అమల్లో ఉంటుంది.
- అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనడానికి వీల్లేదు.
- బహిరంగ ప్రదేశాల్లో, కార్యాలయాల్లో తప్పకుండా మాస్క్ ధరించాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి కోవిడ్-19 వ్యాప్తి ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్లను గుర్తిస్తారు. ఈ ప్రాంతాల్లో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతాయి.
- కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి. సామాజిక దూరాన్ని పాటించేందుకు వీలుగా ఉద్యోగుల షిఫ్టులను మార్చుకోవాలి.
- కార్యాలయాలకు వచ్చే, పోయే మార్గాల్లో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి.
**అవసరమైన చర్యలన్నీ తీసుకున్న తర్వాత ఏప్రిల్ 20 నుంచి దశలవారీగా ఈ మార్గదర్శకాలు అమలవుతాయని ప్రభుత్వం తెలిపింది.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104






