కరోనావైరస్: తెలంగాణలో మరో కేసు నిర్ధరణ

మాస్కు ధరించిన బాలిక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మరో వ్యక్తికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యిందని, దాంతో రాష్ట్రంలో కోవిడ్- 19 పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజాగా కరోనా సోకినట్లు నిర్ధరణ అయిన వ్యక్తి స్కాట్‌లాండ్‌ నుంచి వచ్చారని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.

ముంబయి: సిద్ధివినాయక ఆలయం మూసివేత

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సోమవారం సాయంత్రం నుంచి ముంబయిలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలోకి భక్తులను అనుమతించబోమని ఆలయ అధికారులు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడినవారి సంఖ్య 114కు పెరిగింది. అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 32 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.

దీంతో స్కూళ్లు, కళాశాలలను మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాజేశ్ తెలిపారు. కేవలం 10, 12 తరగతుల వారికి మాత్రమే షెడ్యూలు ప్రకారం పరీక్షలు కొనసాగుతాయని, మిగతా విద్యార్థుల పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

50 మందికి మించి గుమిగూడొద్దు: దిల్లీ ప్రభుత్వం

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 50 మందికి మించి ప్రజలు గుమిగూడే అన్ని రకాల కార్యక్రమాలను (వివాహాలు మినహా) మార్చి 31 వరకు నిషేధిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

దేశ రాజధాని పరిధిలో జిమ్‌లు, స్పాలు, నైట్ క్లబ్‌లు, థియేటర్లు, వారాంతపు సంతలను మూసివేయాలని నిర్ణయించినట్లు దిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

"అన్ని షాపింగ్ మాల్స్‌ను రోజూ శుభ్రం చేయాలి. మాల్స్ ప్రవేశ ద్వారాల వద్ద, అందులోని ప్రతి దుకాణం దగ్గర అవసరమైనన్ని హ్యాండ్ శానిటైజర్లను ఉంచాలి. చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతే సందర్శకులను లోపలికి అనుమతించాలి" అని దిల్లీ ప్రభుత్వం సూచించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మధ్యాహ్న భోజనం

ఫొటో సోర్స్, ANI

కరోనావైరస్ కారణంగా కేరళలోని తిరువనంతపురంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లల ఇంటికే భోజన సామగ్రిని తీసుకెళ్లి అందిస్తున్నారు.

"కరోనావైరస్ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో మధ్యాహ్న భోజనానికి అవసరమైన సామగ్రిని పిల్లల ఇళ్లకే సరఫరా చేయమని ప్రభుత్వం సూచించింది" అని అంగన్‌వాడీ టీచర్ బేబీ గిరిజ తెలిపారు.

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 31 వరకూ అన్ని విద్యా కేంద్రాలను మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఒడిశాలోని పూరి క్షేత్రానికి వస్తున్న యాత్రికులను వెనక్కి పంపించేస్తున్నామని ఒడిశా అధికారులు తెలిపారు.

"అన్ని విద్యాసంస్థలు, జిమ్స్, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ మూసి ఉన్నాయి. అందువల్ల పర్యటకులంతా వెనక్కి వెళ్లిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదంతా కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగమే"అని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ ఎస్కే రాయ్ తెలిపారు.

విదేశీ, స్వదేశీ పర్యటకులను నగరంలోకి రావద్దని కోరుతూ వారికి నచ్చజెప్పి వెనక్కి పంపించేస్తున్నామని రాయ్ తెలిపారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీనీ మార్చి 25వరకూ వాయిదా వేశారు.

శ్రీనగర్‌లోని అన్ని పార్కులు, గార్డెన్లను తదుపరి ఆదేశాలిచ్చేవరకూ మూసి ఉంటుతున్నట్లు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ షాహిద్ చౌదరీ తెలిపారు.

కేరళలోని కొచ్చి విమానాశ్రయ ప్రాంగణంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు 79మందిపై కేసు నమోదు చేశారు.

రియాలిటీ షోలో పాల్గొన్న ఓ వ్యక్తికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్న వీరిపై అధికారులు కేసు నమోదు చేశారు. విమానాశ్రయ పరిసరాల్లో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎక్కువమంది గుమిగూడటంపై నిషేధం విధించారు.

ఒడిశాతో ఓ కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైందని రాష్ట్ర వైద్య, విద్యా శిక్షణ విభాగం డైరక్టర్ డాక్టర్ సీబీకే మొహంతి వెల్లడించారు.

"బాధితుడు ఇటలీ నుంచి దిల్లీకి వచ్చారు. ఆ తర్వాత దిల్లీ నుంచి భువనేశ్వర్‌కు రైలులో ప్రయాణించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి భువనేశ్వర్‌లో ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు" అని మొహంతి తెలిపారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొందరు మంత్రుల బృందంతో ఈరోజు సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రధాన కరోనావైరస్ పైనే చర్చించనుంది.

ఇరాన్ నుంచి వచ్చిన భారతీయులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇరాన్ నుంచి వచ్చిన భారతీయులు

ఇరాన్‌ నుంచి వచ్చిన 53 మంది

52 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు సహా 53మంది ఇరాన్‌లోని టెహ్రాన్, షిరాజ్‌ల నుంచి భారత్ తిరిగి వచ్చారని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. దీంతో మొత్తంగా నాలుగు విడతల్లో 389 మంది భారతీయులు ఇరాన్ నుంచి భారత్ చేరుకున్నారు.

53మందితో కూడిన విమానం రాజస్థాన్‌లోని జైసల్మేర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ప్రాథమిక పరీక్షల అనంతరం వారందరినీ ఆర్మీ వెల్‌నెస్ సెంటర్‌కు తరలించారు.

ఇరాన్ నుంచి వచ్చిన విమానం

ఫొటో సోర్స్, ANI

వీరంతా భారత్‌కు తిరిగిరావడానికి ఇరాన్‌లో భారత రాయబార కార్యాలయం అధికారులు, ఇరాన్ అధికారులు ఎంతో కృషి చేశారని జైశంకర్ అన్నారు.

అడ్డగీత

కరోనావైరస్: భారత్‌లో ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి?

Sorry, your browser cannot display this map