కరోనా వైరస్: మిగతా దేశాలు చైనా దారిలో ఎందుకు నడవలేకపోతున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాబ్లో ఉచోవా
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ వ్యాపించకుండా అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి జనవరిలో చైనా ఒక ప్రకటన చేసినప్పుడు, అలాంటి చర్యలను ప్రజాస్వామ్య దేశాల్లో అమలు చేయడం చాలా కష్టం అని నిపుణులు సంకేతాలు ఇచ్చారు.
హుబే ప్రాంతం మొత్తాన్నీ, అక్కడి 5.6 కోట్ల మందిని క్వారంటైన్(ఎవరినీ కలవనీకుండా విడిగా దూరంగా ఉంచడం) చేయడం, వైరస్‌కు గురైన వారికి చికిత్స అందించడం కోసం కేవలం 10 రోజుల్లో తాత్కాలిక ఆస్పత్రి నిర్మించడం లాంటివి ఈ చర్యల్లో ఉన్నాయి.
ఆ తర్వాత చైనాలో ఈ వైరస్ నియంత్రణలోకి వస్తున్నట్లు కనిపించింది. కానీ మిగతా ప్రపంచమంతటా ఈ మహమ్మారి రెండు వారాల్లో వ్యాపించింది.
కరోనావైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ ఎడానామ్, దీనిని ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు తక్షణం చర్యలు తీవ్రం చేయాలని కోరారు.
ఇప్పటివరకూ, కరోనావైరస్‌తో యుద్ధంలో ప్రజాస్వామ్య దేశాలు చైనా నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాయి?

ఫొటో సోర్స్, AFP
చైనా ప్రమాదం నుంచి బయటపడిందా?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మార్చి 10న కరోనావైరస్ మొదట బయటపడిన ప్రాంతంలో పర్యటించారు. ఆ దేశం జాతీయ అత్యయక పరిస్థితి నుంచి బయటపడింది అనడానికి అది ఒక సంకేతం.
అధికారిక గణాంకాల ప్రకారం అక్కడ కరోనావైరస్‌కు గురైన వారి సంఖ్య తగ్గుతోంది. ఆ గణాంకాలు కూడా కొన్ని డజన్లకు వచ్చింది.
న్యూయార్క్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్‌లో గ్లోబల్ హెల్త్ సీనియర్ ఫెలో యాంజాంగ్ ఖ్వాన్ బీబీసీతో చైనా చేపట్టిన చర్యలను ప్రపంచంలోని మిగతా దేశాలు అమలు చేయడం కష్టం అన్నారు.
"ప్రజాస్వామ్యమైనా, ప్రజాస్వామ్యేతర దేశాలైనా ఏదైనా సమాజంలో సమగ్రంగా జోక్యం చేసుకోగలిగేంత ప్రభావం చూపించలేదు. అది ఏ కోణంలోనూ మంచిది కాదు. ఇది చాలా నిరాశాజనకం. కొన్ని ప్రజాస్వామ్య దేశాధినేతలు చైనా విధానాలను తమ దేశంలో అమలు చేయాలనే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వారికి అలా చేయగలిగే బలం, అధికారాలు లేవు" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
ఇళ్లలోనే ఉండాలనే సలహా
అయితే, మిలాన్‌లోని విటా శాల్యూట్ సేన్ రఫాయెలేలో మైక్రోబయాలజీ, వైరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ రాబర్ట్ బురియానీ "కరోనావైరస్‌తో పోరాడడానికి నియంతృత్వంతో వ్యవహరించడం అవసరం. ఇప్పటివరకూ యూరప్‌లో ఇటలీ మాత్రమే ఈ ఖండంలోనే అత్యంత కఠినంగా లాక్‌డౌన్ అమలుచేసిన దేశం అయ్యింది" అన్నారు.
ఇటలీ తమ దేశంలోని మొత్తం ఆరు కోట్ల జనాభాను లాక్‌డౌన్ చేసింది. దేశంలో ఆహారం, ఫార్మసీ మినహా అన్నిరకాల దుకాణాలు మూసివేశారు. ఒక చోట జనం గుమిగూడడాన్ని నిషేధించారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
పర్యటనల్లో ఉన్న ప్రతి వ్యక్తీ దాని ఉద్దేశం చెప్పే ఒక పత్రాన్ని వెంట తీసుకుని వెళ్లడాన్ని అక్కడ తప్పనిసరి చేశారు. స్కూళ్లు, యూనివర్సిటీలు కూడా మూసేశారు.
డాక్టర్ రాబర్ట్ తన ట్విటర్‌లో "ఆలింగనం చేసుకోవడం, కిస్ చేయడం, స్నేహితులతో డిన్నర్ చేయడం, కాన్సెర్ట్స్, సాయంత్రం థియేటర్లకు వెళ్లడం సహా ఈ వైరస్ జనాల నుంచి అన్నిటినీ లాగేసుకుంది. ఈ యుద్ధంలో గెలిచిన రోజు చాలా అందంగా ఉంటుంది. అదంతా వేగానికి సంబంధించిన విషయం" అన్నారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
చైనా నుంచి పాఠం
ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్ బ్రూస్ అల్వార్డ్ "దేశంలో ఈ వైరస్‌ను ఎదుర్కునే విధానాల్లో తాము ప్రజాస్వామ్య దేశమా, లేక నియంతృత్వ దేశమా అని ఏవీ చూసుకోవడం" లేదు అన్నారు.
ఈయన హుబే పర్యటనకు వెళ్లిన ఒక ఫ్యాక్ట్-ఫైండింగ్ టీమ్‌కు నేతృత్వం వహించారు. చైనా అనుభవం నుంచి ప్రపంచం ఇప్పటివరకూ సరైన పాఠం నేర్చుకోలేకపోయిందని అన్నారు.
"ఇదంతా వేగం మీదనే ఆధారపడి ఉంటుందని మనం చైనా నుంచి నేర్చుకున్నాం. కేసులను చాలా వేగంగా గుర్తించడం, వారిని విడిగా ఉంచడం, వారిని సంప్రదించిన వారందరినీ వెతికి వారిని కూడా ఒంటరిగా ఉంచడం లాంటివి చేయడం వల్ల మనం ఈ వైరస్‌ను అదుపులో ఉంచవచ్చు" అని అల్వార్డ్ బీబీసీతో అన్నారు.
"మనం ఎలాంటి వ్యాధికి గురయ్యాం, ఇది ఎంత తీవ్రంగా ఉంది అనేది, వారు ప్రజలకు తెలిసేలా చెప్పగలిగారు. తీసుకున్న చర్యలు ప్రభావం చూపేలా, ప్రభుత్వానికి సహకరించేలా వారు ముందుకు వచ్చేలా చేశారు".

ఫొటో సోర్స్, AFP
వ్యాప్తికి కళ్లెంఎలా వేయాలి?
ఈ ముప్పు నుంచి తప్పించుకోడానికి చైనీయులందరూ కలిసి ఒక్కటై స్వచ్ఛందంగా చేసిన ప్రయత్నాలు కూడా చాలా ప్రభావం చూపించాయని డాక్టర్ అల్వార్డ్ చెబుతున్నారు.
"ప్రజలకు ప్రభుత్వం గురించి భయం లేదు. వారికి వైరస్ అంటే భయం ఉంది. దాన్నుంచి తప్పించుకోడానికి కలిసి పనిచేయాలని వారికి అనిపించింది. ప్రభుత్వం వారికి ఒక దిశను నిర్దేశించే పనిచేసింది. కానీ నిజం చెప్పాలంటే, అది అందరూ కలిసిమెలిసి చేసిన ఒక ప్రయత్నం" అన్నారు.
దక్షిణ కొరియా అధికారికంగా లాక్‌డౌన్ చేయకుండానే వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కునే ప్రయత్నం చేస్తున్నారు. చైనా, ఇటలీ, ఇరాన్ తర్వాత అత్యధిక కరోనా కేసులు బయటపడింది దక్షిణ కొరియాలోనే. ప్రభుత్వం కొన్ని వేల మందిని రహదారులపైనే ఆపేసి పరీక్షలు చేస్తోంది.
ఈ దేశంలో దానికోసం మొబైల్ ఫోన్, శాటిలైట్ టెక్నాలజీ ఉపయోగిస్తూన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఈ ప్రయత్నాలను ఈ వైరస్ ప్రమాదానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఒక యుద్ధంగా వర్ణించారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
దేశ ఆర్థిక వ్యవస్థ
దక్షిణ కొరియా జనాభా సుమారు ఐదు కోట్లు. ఇటలీలో కూడా దాదాపు ఇంతే జనాభా ఉంటారు. కానీ దక్షిణ కొరియాలో 30 వేల కంటే తక్కువ మందిని క్వారంటైన్ చేశారు. దానితోపాటు అక్కడ ప్రతిరోజూ బయటపడుతున్న కరోనా కేసులు కూడా తగ్గాయి.
మార్చి 13న దక్షిణ కొరియాలో 110 కరోనా కేసులు బయటపడ్డాయి. గత రెండు వారాలకు పైగా ఆ వైరస్‌కు గురైన రోజువారీ కేసుల్లో ఇది అత్యల్ప స్థాయి. అక్కడ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వైరస్‌కు గురయ్యేవారికంటే, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.
దక్షిణ కొరియా చేపడుతున్న ఈ చర్యలు వైరస్‌ను అడ్డుకోడానికి మాత్రమే పరిమితం కావడం లేదు.. దానితోపాటూ దేశ ఆర్థికవ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని ఖ్వాంగ్ అన్నారు.
"దక్షిణ కొరియా కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి దూకుడుగా ప్రయత్నిస్తోంది. దానితోపాటూ ఆ ప్రయత్నాలతో సమాజం, ఆర్థికవ్యవస్థకు జరిగే నష్టాన్ని కూడా సంతులనం చేయడంలో చాలా అప్రమత్తంగా ఉంది. చైనా చేపట్టిన కొన్ని కఠిన విధానాల వల్ల వేరే రకం సమస్యలు వస్తున్నాయి" అని ఖ్వాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి?
"ఉదాహరణకు వుహాన్‌లో కట్టుదిట్టమైన ఆరోగ్య చర్యల వల్ల నగరంలో మరణాలు తగ్గాయి. మిగతా దేశాలు అలా చేయాలనుకోవు. ప్రతి దగ్గరా చైనా మోడల్‌ను అమలు చేయాలంటే సాధ్యం కాదు. ఏదైనా ఒక వ్యాధిని కంట్రోల్ చేయడానికి చైనా చేసింది గోల్డ్ స్టాండర్ట్(ప్రమాణం) ఏం కాదు" అని ఆయన అన్నారు.
కరోనావైరస్ పరీక్షల కొరతను అధిగమించడంలో అధ్యక్షుడు ట్రంప్ విఫలం అయ్యారని సీనియర్ డెమాక్రట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
"అమెరికన్లకు ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత కల్పించేలా అధ్యక్షుడు ట్రంప్ కరోనావైరస్ వ్యాపించకుండా అడ్డుకునే యుద్ధంపై దృష్టి పెట్టడం మంచిది" అని హౌస్ స్పీకర్ నాన్సీ పలోసీ, సెనేట్ మైనారిటీ లీడర్ చక్ షుమర్ ఒక ప్రకటనలో అన్నారు.
మధ్యప్రాచ్యం, ఆసియా పరిస్థితి ఏమిటి?
"అమెరికా పరిస్థితి కూడా మిగతా యూరప్‌లాగే ఉంది. వైరస్‌ను సరిహద్దులు ఆపలేవు. ఇరాన్ కోమ్ ప్రాంతాన్ని మిగతా ప్రాంతానికి పూర్తిగా దూరంగా ఉంచడాన్ని నిందిస్తున్నారు" అని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం పబ్లిక్ హెల్త్ నిపుణులు లారెన్స్ గోస్టిన్ అన్నారు.
ఇరాన్‌లోని కోమ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌కు కేంద్రంగా ఉంది. ప్రభుత్వం మెడికల్ చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి ప్రజలు అక్కడికి వెళ్లకుండా ఉండాలని కోరింది. మిగతా దేశాలు లాక్‌డౌన్ చేశాయి. స్కూళ్లు మూసివేశాయి. సౌదీ అరేబియా కాతిఫ్ ప్రాంతాన్ని మూసివేసింది. కాతిఫ్‌లో సౌదీ అరేబియాలో అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.
జపాన్ ఏప్రిల్ వరకూ దేశంలో స్కూళ్లను మూసేసింది. మధ్యప్రాచ్యం, ఆసియాలో కూడా ఇలాగే చేస్తున్నారు. యునెస్కో లెక్కల ప్రకారం 29 దేశాల్లో స్కూళ్లు మూసేయడం వల్ల 33 కోట్ల మందికి పైగా పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం పడింది. దీనితోపాటూ సుమారు 5 కోట్ల మంది యూనివర్సిటీ విద్యార్థుల చదువులు ప్రభావితం అయ్యాయి.
అయితే మిగతా యూరప్ దేశాలు ఇటలీలాగే కఠిన చర్యలు అమలు చేయాలని చూస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఇటలీలో పర్యటించే వారు 14 రోజుల వరకూ మిగతావారికి దూరంగా ఉండాలని చెబుతోంది.

ఫొటో సోర్స్, Reuters
కేంద్రీయ సమన్వయం
ఇంగ్లండ్ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మిగతావారికి దూరంగా ఉంచడం కోసం ఒక చట్టం పాస్ చేసింది. కానీ స్కూళ్లు మూసేయాలనే నిర్ణయం మంచిది కాదని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.
"పెద్ద స్థాయిలో ప్రజలు ఒక చోట గుమిగూడడాన్ని అడ్డుకోవడం ఒక ప్రభావవంతమైన చర్య అయితే, ప్రభుత్వం ఆ చర్యలు ఎప్పుడో తీసుకుని ఉండేది. మా మోడల్‌లో అది ఫిట్ కాదు. మేం చాలా జాగ్రత్తగా సైన్స్ మీద ఆధారపడ్డాం" అని ఇంగ్లండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జెనీ హారిస్ బీబీసీతో అన్నారు.
కరోనావైరస్ కేసులు పెరుగుతాయని బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అయితే డాక్టర్ హారిస్ మాత్రం తాము దానిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బ్రిటన్, ఇటలీ ఆరోగ్య విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి చెప్పారు.
"ఇటలీలో వారి ఆరోగ్య సేవలు ప్రాంతీయం. వారు వ్యవస్థీకృతంగా పనిచేయడానికి చాలా సమయం పడుతుంది. మా దగ్గర సింగిల్ కమాండ్ అండ్ కంట్రోల్ మెకానిజం ఉంది. అది ప్రభుత్వం నుంచి ప్రారంభమై, దేశంలోని మొత్తం ఆరోగ్య సేవల వరకూ చేరుతుంది" అన్నారు.
డబ్ల్యుహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్స్ "ఈ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. ఆయా ప్రభుత్వాలు తమ దేశం, వ్యవస్థ అవసరాలను బట్టి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయించుకోవాలి" అన్నారు.
Sorry, your browser cannot display this map


- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 4
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి.. ఆ తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్‌పై నిషేధం
- కరోనావైరస్: దిల్లీలో ఓ మహిళ మృతి.. భారత్‌లో రెండుకు చేరిన మరణాల సంఖ్య; కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, థియేటర్లు బంద్
- యస్ బ్యాంకులో చిక్కుకుపోయిన ‘దేవుడి’ డబ్బులు... రూ.545 కోట్లు వెనక్కి వస్తాయా?
- భారత్‌లో తొలి కరోనా మరణం.. కర్నాటక వృద్ధుడి మృతి
- కరోనావైరస్: కేంద్ర మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు.. దిల్లీలో సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు బంద్
- కరోనావైరస్‌కు హోమియోపతి మందు ఉందా-ఆయుష్ ప్రకటనతో అయోమయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









