‘జేఎన్‌యూలో దాడి చేసింది ఏబీవీపీ విద్యార్థులే’ - న్యూస్ చానెల్ స్టింగ్ ఆపరేషన్

ఫొటో సోర్స్, UGC
దిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్శిటీలో జరిగిన హింసపై ఒక న్యూస్ చానెల్ 'స్టింగ్ ఆపరేషన్'పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
జనవరి 5వ తేదీన జేఎన్‌యూలో ముసుగులు ధరించిన కొందరు దుండగులు విద్యార్థులపై దాడి చేసి, గాయపర్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆజ్‌తక్ న్యూస్ చానెల్ ఒక 'స్టింగ్ ఆపరేషన్' వీడియో టెలికాస్ట్ చేసింది.
ఈ 'స్టింగ్ ఆపరేషన్'లో ముసుగు వేసుకుని విద్యార్థులపై దాడి చేసిన దుండగులతో మాట్లాడామని, వాళ్లు జరిగిందంతా చెప్పేశారని న్యూస్ చానెల్ అంటోంది.
ఈ ముసుగువేసుకున్న దుండగుల వీడియో, ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిలో ఒక యువతి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఆ యువతి పేరు కోమల్ శర్మ అని, దిల్లీ యూనివర్శిటీలో చదువుతోందని, ఏబీవీపీతో ఈమెకు సంబంధాలు ఉన్నాయని ఆజ్‌తక్ చానెల్ అంటోంది.
దాడి జరిగిన జనవరి 5వ తేదీన కోమల్ శర్మ జేఎన్‌యూలోనే ఉన్నారని, కాబట్టి తమ వాదనకు మరింత బలం చేకూరిందని చానల్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
JNUTapes 'స్టింగ్ ఆపరేషన్' పేరిట విడుదల చేసిన తొలి దఫా వీడియోలో ఒక యువకుడు మాట్లాడుతూ.. ఈ హింసాత్మక దాడుల్లో తన ప్రమేయం ఉందని చెబుతున్నాడు.
ఇతని పేరు అక్షత్ అవస్థీ అని, ఇతను జేఎన్‌యూలో ఫ్రెంచ్ డిగ్రీ ప్రోగ్రాం మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అని చానెల్ చెబుతోంది. తాను ఏబీవీపీ సభ్యుడినని ఆ యువకుడు చెబుతున్నాడు.
వీరితో పాటు రోహిత్ షా అనే మరొక యువకుడు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు వీడియోలో అంగీకరిస్తున్నాడు.
ఈ వీడియోల్లో విద్యార్థులు చెబుతున్న విషయాల ఆధారంగా దిల్లీ పోలీసులు ఒక వాట్సాప్ గ్రూపు వివరాలు ఆరా తీశారని చానెల్ అంటోంది. ఆ గ్రూపులో దాడికి సంబంధించి చర్చలు జరిగాయి. ఈ గ్రూపులో 60 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 50 మందిని పోలీసులు గుర్తించారని చానెల్ తెలిపింది.
కాగా, వామపక్ష పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన విద్యార్థులు ఈ దాడికి ఒకరోజు ముందు.. అంటే జనవరి 4వ తేదీన విశ్వవిద్యాలయంకు చెందిన ఇంటర్నెట్ సర్వర్‌ను పెకిలించి, తీసేసిన విషయాన్ని కూడా ఈ చానెల్ తన 'స్టింగ్ ఆపరేషన్'లో బయటపెట్టింది.
ఇవి కూడా చదవండి:
- జేఎన్‌యూ విద్యార్థులతో దీపిక ఏం మాట్లాడారు?
- భారతదేశంలో విద్యార్థి ఉద్యమాల చరిత్ర ఏమిటి... వాటి ప్రభావం ఎలాంటిది?
- JNU విద్యార్థులపై హింసాత్మక దాడి వెనుక... వాట్సాప్ గ్రూప్స్ సీక్రెట్ చాటింగ్
- JNUSU అధ్యక్షురాలు ఐషీ ఘోష్: ‘ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ గూండాలే దాడి చేశారు.. నాలుగైదు రోజుల్నుంచీ హింసను ప్రోత్సహించారు’
- "జేఎన్‌యూ వీసీని వెంటనే తొలగించాలి": బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
- JNUలో దాడి జరిగినప్పుడు వీసీ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? :వైస్ చాన్స్‌లర్‌తో ఇంటర్వ్యూ
- జేఎన్‌యూలో దాడి నిందితుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్
- ఇరాన్: ఉక్రెయిన్ విమానం కూల్చివేతపై 'అబద్ధాలు' చెబుతారా అంటూ ఆగ్రహించిన ప్రజలు
- ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
- కేరళలో రెండు ఎత్తయిన భవనాలు క్షణాల్లో నేలమట్టం
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









