భూత వైద్యం: వైద్యులకు దెయ్యాలపై చదువు చెప్పనున్న బనారస్ హిందూ యూనివర్శిటీ

ఫొటో సోర్స్, Getty Images
దెయ్యాలను చూశామని చెప్పేవారికి, దెయ్యం పట్టినట్లు ప్రవర్తించే వారికి చికిత్స ఎలా చెయ్యాలనే అంశంపై ప్రముఖ బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ) వైద్యులకు ఒక సర్టిఫికెట్ కోర్సును మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది.
ఆరు నెలల ఈ సర్టిఫికెట్ కోర్సు 2020 జనవరి నుంచి వారణాసిలోని బీహెచ్‌యూలో ప్రారంభం కానుంది.
కొంతమంది ఒక్కోసారి మానసిక రుగ్మతలను కూడా అతీంద్రీయ సంఘటనలుగా భావిస్తుంటారని, అలాంటి రుగ్మతలతో బాధపడేవారిని లక్ష్యంగా చేసుకుంటామని యూనివర్శిటీ యాజమాన్యం చెబుతోంది.
హిందూ జీవనశైలిలో భాగమైన ప్రాచీన వైద్య, ఉపశమన పద్ధతి.. ఆయుర్వేదం అధ్యాపకులే ఈ కొత్త కోర్సును కూడా బోధించనున్నారు.
యూనివర్శిటీలో ప్రత్యేకంగా భూత వైద్యం విభాగాన్ని నెలకొల్పినట్లు బీహెచ్‌యూ అధికారి ఒకరు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు అధికారికంగా తెలిపారు.
''భూత వైద్యం ప్రధానంగా మానసిక రుగ్మతలు, నిర్దిష్టమైన కారణాల తెలియని వ్యాధులు, మానసిక పరిస్థితులకు సంబంధించిన వ్యాధులకు సంబంధించినది'' అని యూనివర్శిటీలోని ఆయుర్వేదం అధ్యాపకుల అధిపతి యామినీ భూషణ్ త్రిపాఠి చెప్పారు.
''దెయ్యాలకు సంబంధించిన రోగాలను నయం చేసే ఆయుర్వేద పద్ధతులపై'' డాక్టర్లకు చదువుచెప్పే కోర్సును అందిస్తున్న మొదటి యూనివర్శిటీ దేశంలో తమదేనని కూడా ఆమె వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆయుర్వేద వైద్యంలో మూలికలతో చేసిన మందులు, ఆహార నియమాలు, మర్దనలు, శ్వాస నియంత్రణ పద్ధతుల మొదలైనవి భాగంగా ఉంటాయి.
మానసిక ఆరోగ్యం, నాడీశాస్త్ర జాతీయ సంస్థ (నిమ్‌హాన్స్) 2016లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం దాదాపు 14 శాతం మంది భారతీయులు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2017లో భారతీయుల్లో 20 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక దశలో నిరాశ, నిస్పృహలతో బాధపడే అవకాశం ఉంది.
భారతదేశ జనాభా 130 కోట్లు కాగా.. దేశంలో మానసిక వైద్య నిపుణులు 4 వేల మంది మాత్రమే ఉన్నారు. మానసిక ఆరోగ్యంపై సమాజంలో చాలా తక్కువ అవగాహన ఉంది.

- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- చూసి తీరాల్సిందే: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కాకి ఇదేనేమో
- ఇంతకూ మనం పది శాతం మెదడునే వాడుతున్నామా?
- బ్రిటన్ను భయపెట్టిన మేజిక్ మహారాజు
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- "నేను చేతబడి చేస్తున్నానని మా అమ్మ అనుమానించింది"

ఫొటో సోర్స్, Getty Images
మానసిక రుగ్మతలకు చాలా తక్కువ మంది మాత్రమే వైద్య నిపుణులను సంప్రదిస్తుంటారు. అలా వైద్యులను సంప్రదించడంపై సామాజికంగా చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేదరికం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మానసిక రుగ్మతలను మంత్రగాళ్లు/మంత్రగత్తెలు నయం చేస్తుంటారని ప్రజలు భావిస్తుంటారు.
అయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీహెచ్‌యూలో భూత వైద్యం కోర్సును ప్రవేశపెడుతున్నారన్న వార్త తెలుసుకున్న కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మానసిక సమస్యలను పరిష్కరించేందుకు మేలైన పద్ధతులు ఉండగా ఈ కోర్సు ఏంటని నిలదీస్తున్నారు.
కాగా, ఈ కోర్సును కొంతమంది సమర్థిస్తున్నారు. కానీ, పేరు మార్చాలని సూచిస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కొంతమంది మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను ప్రశ్నిస్తూ, ఈ కోర్సు ప్రకటనను ఎగతాళి చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్ of X ముగిసింది, 6
ఇవి కూడా చదవండి:
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- ఒకప్పటి 'దెయ్యాల ఊరు'.. ఇప్పుడు పర్యాటకులకు 'స్వర్గధామం'
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- 'దెయ్యాలను 12 ట్రక్కుల్లో మూడు రోజుల పాటు మరో చోటుకు తరలించాం'
- దెయ్యాన్ని చూపిస్తే రూ.20 లక్షలు.. చర్చికి సవాల్!
- సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న ‘సైతాను’ రేపిన వివాదం
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- మరణ శిక్షల్లో భారతదేశ రికార్డు ఏమిటి? - రియాలిటీ చెక్
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- ‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- బార్కోడ్: బీచ్‌లోని ఇసుకలో పుట్టిన ఆలోచన... ప్రపంచ వాణిజ్య రూపురేఖలను ఎలా మార్చేసింది?
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)