స్పెయిన్‌లో ‘సైతాను’ విగ్రహ వివాదం: 'నవ్వుతూ, సెల్ఫీ తీసుకున్నట్లుంటే కుదరదు'

ఫొటో సోర్స్, City of Segovia
స్పెయిన్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న సైతాను శిల్పం చూడటానికి చాలా స్నేహపూర్వకంగా ఉందంటూ వివాదం రేగింది.
కంచుతో తయారైన ఈ శిల్పాన్ని స్పెయిన్‌లోని సెగోవియా నగరంలోని ఓ వ్యక్తి గౌరవార్థం 'ప్రముఖ కాలువపైకి ఎక్కిన దెయ్యం' విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
కానీ, స్థానికులు మాత్రం ఈ భూతం నవ్వుతూ, సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా ఉందని, చూడటానికి చాలా స్నేహపూర్వకంగా ఉన్నట్లుందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ శిల్పం క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా ఉందో లేదో పరిశీలించేవరకూ దీని ఏర్పాటును తాత్కాలికంగా ఆపేయాలని జడ్జి ఆదేశించారు.
దీని ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ నగరంలోని దాదాపు 5400 మంది (అక్కడి జనాభాలో 10శాతం పైగా) ఓ పిటిషన్‌పై సంతకాలు చేశారు.
ఫోన్ పట్టుకుని నవ్వుతూ ఉన్నట్లున్న ఈ శిల్పం దెయ్యాలను ఎక్కువ చేసి చూపుతున్నట్లు ఉందని, ఇది క్యాథలిక్కులకు అభ్యంతరకరంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ శిల్పం చాలా కోపంగా, అసహ్యంగా ఉంటూనే ఎలాంటి హానీ చేయదనిపించే విధంగా ఉండాలని వారంటున్నారు.

ఫొటో సోర్స్, City of Segovia
శిల్పాన్ని రూపొందించిన కళాకారుడు జోస్ ఆంటోనియో అబెల్లా ఈ అభ్యంతరాలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
"ఓ గొప్ప వ్యక్తిని గుర్తుచేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని ఎందుకింత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ నగరం అంటే చాలా ఇష్టం. మూడు దశాబ్దాలు ఇక్కడే నివసించాను. దానికి కృతజ్ఞతగా సెగోవియాలో ఈ శిల్పాన్ని ఏర్పాటుచేయాలనుకున్నా. ఈ శిల్పాన్ని రూపొందించడానికి నేను డబ్బు తీసుకోలేదు. డబ్బుల కోసం నేను దీన్ని చేయట్లేదు, నేను నివసించిన నగరానికి నేనిచ్చే నివాళి ఇది. నా భావాలను అర్థం చేసుకోండి." అని జోస్ విజ్ఞప్తి చేశారు.
ఈ విగ్రహంపై వివాదం అసంబద్ధంగా ఉండని నగర్ కౌన్సిలర్ క్లాడియా డి శాంటోస్ వ్యాఖ్యానించారు. అనుకున్నవిధంగా విగ్రహం ఏర్పాటు జరిగేందుకు ప్రయత్నిస్తానని ఆమె 'ఎల్ పైస్' పత్రికతో తెలిపారు.
ఇవి కూడా చదవండి.
- ఆరు నెలలకోసారి దేశం మారే ఐరోపా దీవి కథ ఇది
- సహారా ఎడారి వెంట ప్రహరీ కట్టండి.. స్పెయిన్కు డోనల్డ్ ట్రంప్ సలహా
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- దెయ్యాన్ని చూపిస్తే రూ.20 లక్షలు.. చర్చికి సవాల్!
- కుంభ మేళా: 'కుంభ్' సంప్రదాయం ఎప్పుడు మొదలైంది... ఈ మేళా చరిత్ర ఏమిటి?
- మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల త్యాగాలు ఎందుకు వృథా అయ్యాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








