144 సెక్షన్‌ను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను నియంత్రించేందుకు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బెంగళూరు సహా కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. వందల సంఖ్యలో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయని భావించినప్పుడు, నలుగురి కన్నా ఎక్కువ మంది ఒక్క చోట చేరుకుండా ఆంక్షలు విధించే అధికారాన్ని 144 సెక్షన్ ప్రభుత్వాలకు, స్థానిక పోలీసులకు కల్పిస్తోంది. ఆ ఆంక్షలను మీరితే క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు.
అయితే, నిరసనలను అణిచివేసేందుకు ఈ చట్టం దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు ఉన్నాయి.
వాక్ స్వాతంత్ర్యం, సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కులతో 144 సెక్షన్‌ను కలిపి చూసినప్పుడు అనేక సమస్యలు కనిపిస్తాయని రాజ్యాంగ నిపుణుడు గౌతమ్ భాటియా అంటున్నారు.

ఫొటో సోర్స్, Reuters
శాంతి భద్రతల నిర్వహణ కోసం కొన్ని సహేతుకమైన ఆంక్షలను విధించే అవకాశం ప్రభుత్వానికి రాజ్యాంగం ఇస్తోంది.
అయితే, ఏది సహేతుకమన్న అంశంపై ఇదివరకే కోర్టుల్లో వాదోపవాదాలు నడిచాయి. హింసను గానీ, అశాంతిని గానీ ప్రేరేపించే పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు విధించవచ్చని కోర్టులు నిర్దేశించాయి.
''ప్రభుత్వం ఆంక్షలు విధించకముందే, శాంతికి విఘాతం కలిగే ముప్పు చాలా స్పష్టంగా ఉందని చూపించాల్సి ఉంటుంది'' అని భాటియా అన్నారు.
''ఉదాహరణకు ఓ చోట కొంత మంది సమావేశమవుతున్నారనుకుందాం. విధ్వంసానికి పాల్పడాలని పిలుపునిస్తూ అందులో ప్రసంగాలు ఉండబోతున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వం ఆ సమావేశం జరగకుండా అడ్డుకోవచ్చు. కానీ, ఏదైనా సమావేశం హింసాత్మకంగా ఎప్పుడైనా మారొచ్చన్న భయంతో ఆంక్షలు విధించకూడదు. అలాంటప్పుడు అసలు హక్కులు ఉండి ఏ లాభం?'' అని భాటియా ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Reuters
గురువారం బెంగళూరులో 144 సెక్షన్ అమలైంది. అక్కడ ఇటీవలి నిరసనల్లో హింసేమీ చోటుచోసుకోలేదు. 144 సెక్షన్‌ను విధించేందుకు అవసరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడలేదని కొందరు వాదిస్తున్నారు.
''ఇది అధికార దుర్వినియోగం. ప్రాథమిక హక్కులను కాలరాయడమే. కోర్టుల్లో దీన్ని సవాలు చేయొచ్చు'' అని భాటియా అన్నారు.
144 సెక్షన్ అత్యవసర పరిస్థితుల్లో విధించేందుకు ఉద్దేశించిన చట్టమని, అది విధించేందుకు అవసరమైన పరిస్థితులు లేకున్నా తరచూ దీన్ని ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయని తక్షశిలా ఇన్‌స్టిట్యూషన్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ రీసెర్చ్ ఓ పరిశోధనా పత్రంలో అభిప్రాయపడ్డాయి.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును నిరాకరించడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన అవినాశ్ కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి"- పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- 'హైదరాబాద్ ఎన్కౌంటర్' బూటకం, పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీం కోర్టులో నిందితుల కుటుంబ సభ్యుల పిటిషన్
- YouTube: ఎనిమిదేళ్ల ఈ అబ్బాయి ఏడాదిలో రూ. 184 కోట్లు సంపాదించాడు
- సనా గంగూలీ ‘The End of India’పై చర్చ.. ‘ఆ పోస్ట్ వాస్తవం కాదు’ - సౌరవ్ గంగూలీ
- ‘నా శరీరం కోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు’ :దిల్లీలో ఆఫ్రికా యువతులతో సెక్స్ కుంభకోణంపై బీబీసీ పరిశోధన
- ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- 'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- పౌరసత్వ సవరణ చట్టాన్ని తిరస్కరించే అధికారం రాష్ట్రాలకు ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









