సనా గంగూలీ ‘The End of India’పై చర్చ.. ‘ఆ పోస్ట్ వాస్తవం కాదు’ - సౌరవ్ గంగూలీ

కూతురు సనా గంగూలీతో సౌరవ్ గంగూలీ

ఫొటో సోర్స్, Sourav Ganguly/SanaGangulyOfficialFans

ఫొటో క్యాప్షన్, కూతురు సనా గంగూలీతో సౌరవ్ గంగూలీ

భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ (18 ఏళ్లు) పేరిట ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పౌరసత్వ సవరణ చట్టం, దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పోస్టుపై చర్చ జరుగుతోంది.

కుష్వంత్ సింగ్ రాసిన, 2003లో ప్రచురితమైన 'The End of India' (భారతదేశానికి ముగింపు) పుస్తకం నుంచి కొంత భాగాన్ని తీసుకుని సనా గంగూలీ సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్)లో పోస్ట్ చేశారని, అది తన మనసు గెల్చుకుందని అపర్ణ అనే యూజర్ ట్వీట్ చేశారు.

‘ఈ 18 ఏళ్ల యువతి పరిణితి అద్భుతం’ అని అపర్ణ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను సౌరవ్ గంగూలీకి ట్యాగ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ ట్వీట్‌ను వేలాది మంది లైక్, రీట్వీట్ చేశారు. మూడు వేల మందికి పైగా దీనిపై కామెంట్లు చేశారు.

‘‘ప్రతి నియంతృత్వ పాలనకూ కొన్ని వర్గాలు, గ్రూపులు కావాలి.. వాటిని దోషిగా చూపించి తాను అభివృద్ధి చెందేందుకు. ఇదంతా ఒకటి లేదా రెండు గ్రూపులతోనే మొదలవుతుంది. కానీ, అది అక్కడితో ఆగదు. ద్వేషంపై నిర్మించిన ఒక ఉద్యమం.. నిరంతరం భయాన్ని, కలహాలను పెంచి పోషించడం ద్వారానే అది కొనసాగుతుంది. మనం ముస్లింలు, క్రిస్టియన్లం కాదు కాబట్టి భద్రంగా ఉన్నామని ఈరోజు భవించే వాళ్లంతా మూర్ఖుల స్వర్గం (ఫూల్స్ ప్యారడైజ్)లో జీవిస్తున్నట్లే.’’

‘‘వామపక్ష చరిత్రకారులను, ‘పాశ్చాత్య ప్రభావంలోని’ యువతను సంఘ్ ఇప్పటికే లక్ష్యంగా చేసుకుంది. రేపు అది తన ద్వేషాన్ని స్కర్ట్‌లు వేసుకున్న మహిళలు, మాంసం తినే ప్రజలు, మద్యం సేవించేవాళ్లు, విదేశీ సినిమాలు చూసేవాళ్లు, ప్రతి ఏటా ఆలయాలను సందర్శించనివారు, పళ్లపొడి బదులు టూత్‌పేస్ట్ వాడేవాళ్లు, వైదిక్‌లకు బదులు అలోపతీ వైద్యుల వద్దకు వెళ్లేవాళ్లు, ‘జై శ్రీరామ్...’ అని నినదించకుండా ముద్దులతో, కరచాలనంతో శుభాకాంక్షలు తెలిపే వారిపై చూపించొచ్చు. ఎవ్వరూ సురక్షితంగా లేరు. భారతదేశాన్ని సజీవంగా ఉంచాలని కోరుకుంటే దీన్ని మనం తెలుసుకోవాలి’’ అని ఆ పోస్టులో సనా గంగూలీ పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘దాదా తన కూతుర్ని బాగా పెంచాడు’ అంటూ ప్రసన్ కుమార్ అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

స్టార్ కిడ్ సనా గంగూలీ తమ హృదయాలు గెల్చుకుందని, ఆమెకు శుభాశీస్సులు అంటూ సెక్యులర్ ఇండియన్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

‘ధైర్యసాహసాల గల తండ్రికి ధైర్యసాహసాలు కలిగిన కూతురు. ‘మెజార్టీ ఉందని అల్పసంతోషులు కావొద్దు, రేపు మీ వంతు’ అని చెప్పేందుకే కుష్వంత్ సింగ్ పుస్తకం నుంచి ఆమె ఈ పోస్ట్ షేర్ చేసింది’ అంటూ విక్రమ్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

కాగా, ఈ పోస్ట్ వాస్తవం కాదని సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

‘ఈ వివాదాలన్నింటిలోకి సనాను లాగొద్దు. ఈ పోస్టు వాస్తవం కాదు. రాజకీయాల గురించి తెలుసుకునేందుకు ఆమె చాలా చిన్నది’ అని గంగూలీ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

మరోవైపు.. జామియా మిలియా యూనివర్శిటీ విద్యార్థులకు మద్దతుగా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు.

‘రాజకీయ నిందారోపణలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. కానీ, నేను, నా దేశం మాత్రం జామియా మిలియా విద్యార్థుల పట్ల ఆందోళనగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)