లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

ఫొటో సోర్స్, ANI
ప్రతిపక్షాల నిరసనల మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదు, బిల్లులోని ప్రతి అంశానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం' అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడంతోనే ఇప్పుడు ఈ బిల్లు అవసరమైందని పేర్కొన్నారు.
బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో సభలో గందరగోళం ఏర్పడింది. అధిర్ రంజన్ చౌదరీతో పాటు కొందరు ప్రతిపక్ష నేతలు బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతకు ముందు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నోటీస్ ఇచ్చారు. దీంతో బిల్లు ప్రవేశపెట్టడానికి ఓటింగ్ తప్పనిసరి అయ్యింది.
బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు అనుకూలంగా 293 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 82 మంది ఎంపీలు ఓటు వేశారు. దీంతో బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
బిల్లు ప్రవేశపెట్టడాని కంటే ముందు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ సభలో మాట్లాడుతూ, ఈ బిల్లు మన సమాజాన్ని మరింత వెనక్కి నెట్టేస్తుందని అన్నారు.
ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ బిల్లు పెడుతున్నట్లు ఉందని విమర్శించారు. తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గందరగోళం
అంతకుముందు, బిల్లుపై అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లు ఏ చట్టాన్నీ ఉల్లంఘించడం లేదని, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాదని అన్నారు.
సహేతుక కారణాలు ఉంటే పార్లమెంట్ చట్టాలు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అడ్డురాదని చెప్పారు.
1971లో బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన వారందరికీ ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించిందని కానీ, అదే సమయంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వారికి ఎందుకు పౌరసత్వం ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ సవరణ బిల్లు అంటే…?
మోదీ తొలి ప్రభుత్వ హయాంలోనే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర (హిందూ, సిక్కు, పార్సీ, జైనులు, తదితర మతాల) వలసదారులకు కొన్ని షరతుల ప్రకారం భారత పౌరసత్వం ఇవ్వాలని అందులో ప్రతిపాదించారు.
అప్పుడు లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. అయితే, రాజ్యసభ ఆమోదం పొందకముందే ఎన్నికలు వచ్చాయి.
రెండు సభల ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోదం వరకూ వెళ్లలేకపోయింది కాబట్టి ఈ బిల్లు వీగిపోయింది. అందుకే, మోదీ ప్రభుత్వం దీన్ని మరోసారి లోక్ సభలో ప్రవేశపెట్టింది.
ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బిల్లుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.
అక్కడి నాయకులు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇదివరకే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశారు. బయటి దేశాలవారికి, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులకు పౌరసత్వం ఇస్తే, తమ ప్రాంతాల్లో జనాభా స్వరూపం మారిపోతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ ఎన్కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









