విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది

ఫొటో సోర్స్, Getty Images
శాన్ ఫ్రాన్సిస్కో నుంచి అట్లాంటా వెళుతున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళను తేలు కుట్టింది.
గురువారం ఉదయం విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కాలుపై ఏదో కుట్టినట్లు అనిపించిందని ఆ మహిళ చెప్పారు.
అప్పుడు ఆమె టాయిలెట్‌కు వెళ్లి చూస్తే... ప్యాంట్ నుంచి తేలు కింద పడింది.
ఆస్పత్రికి తరలించేముందు ప్రయాణికురాలికి ప్రథమ చికిత్స చేశామని విమాన సిబ్బంది బీబీసీకి చెప్పారు. ఆమె పేరును విమాన సిబ్బంది బయటపెట్టలేదు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉందో కూడా వెల్లడించలేదు.
''శాన్ ప్రాన్సిస్కో నుంచి అట్లాంటా వెళుతున్న ఫ్లైట్ 1554లో ఒక ప్రయాణికురాలికి తేలు కుట్టినట్లు మా దృష్టికి వచ్చింది. మా సిబ్బంది వెంటనే స్పందించి ఎయిర్ పోర్ట్‌లో ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం అందించారు'' అని విమానయాన సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ''స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి ఆమెను తరలించారు'' అని వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో తేలు ఉన్న ఫొటోను తొలిగా టీఎంజెడ్ అనే న్యూస్ వెబ్‌సైట్ ప్రచురించింది.
ప్రయాణికుల విమానంలో తేలు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.
ఈ ఏడాది మొదట్లో, ఇండోనేషియాలోని లయన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో తేలు బయట పడింది. లగేజీ ర్యాక్‌లోంచి బయటకు వస్తున్న తేలును వీడియో తీశారు.
2017లోనూ ఇదే తరహా సంఘటన జరిగింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో తనను తేలు కట్టిందని కెనడా ప్రయాణికుడొకరు చెప్పారు.
''నేను టెక్సాస్ నుంచి కెనెడాలోని కాల్గ్రే వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్నాను. లంచ్ సమయంలో భోజనం చేస్తుండగా పై నుంచి నా తలపై తేలు పడింది'' అని రిచర్డ్ బెల్ చెప్పారు.
ఈ ఘటన తర్వాత విమానయాన సంస్థ నష్టపరిహారం కింద ఆయనకు టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చివేసింది.
2017లో ఇలాగే మరో ఘటన జరిగింది. పారిస్ నుంచి గ్లాస్గో వెళుతున్న ఈజీ జెట్ ఫ్లయిట్‌లో ఒక ప్రయాణికుడు తేలును గుర్తించారు. దీంతో ఆ విమానం చాలా ఆలస్యంగా బయలుదేరింది.
ఇవి కూడా చదవండి:
- కాక్‌పిట్‌లో ప్రయాణికురాలి ఫొటో తీసిన పైలట్... విమానం నడపకుండా జీవితకాల నిషేధం
- ''ఉరిశిక్ష అమలు చేయటానికి తలారి కావలెను...''
- ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్: ఫోన్ కూడా లేని ఇంటి నుంచి గూగుల్ బాస్‌గా ఎదిగిన చెన్నై కుర్రాడు
- శ్రీజ డెయిరీ: ‘పూర్తిగా మహిళలతో నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల సంస్థ’
- మా అమ్మకు వరుడు కావలెను
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- అసలైన సూపర్ మ్యాన్, థోర్, వండర్ ఉమన్ ఎవరు.. ఆ సూపర్ హీరోలు ఎక్కడుండేవారు
- అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








