మోనోగమీ: ఒకే భాగస్వామితో జీవితమంతా కలిసి ఉండే విషయంలో మనుషుల కంటే ముందున్న జంతువులు ఇవే

మీర్‌కాట్‌లు చాలా సామాజిక జంతువులు, ‘మాబ్స్’ లేదా ‘క్లాన్స్’ అనే పిలిచే పెద్ద సమూహాలలో జీవిస్తాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీర్‌కాట్‌లు చాలా సామాజిక జంతువులు, 'మాబ్స్' లేదా 'క్లాన్స్' అనే పిలిచే పెద్ద సమూహాలలో జీవిస్తాయి
    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, బీబీసీ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

జీవితమంతా ఒకే భాగస్వామితో కలిసి ఉండడం(మోనోగమీ) విషయంలో మనుషుల శైలి మీర్‌కేట్స్‌ను పోలి ఉంటుందని వివిధ జీవ జాతులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

మోనోగమీ విషయంలో శాస్త్రవేత్తలు రూపొందించిన ఒక పట్టిక ప్రకారం.. రొమాంటిక్ లైఫ్ విషయంలో మనుషుల పద్ధతులు, అలవాట్లు చింపాంజీలు, గొరిల్లాల కన్నా ముంగిస జాతికి చెందిన మీర్‌కేట్‌లతోనే దగ్గర పోలికలున్నాయి.

మోనోగమీ విషయంలో మనుషులు 66 శాతం స్కోర్‌తో చింపాంజీలు, గొరిల్లాల కంటే ముందున్నారు. మీర్‌కేట్‌ల మోనోగమీ శాతం మనుషుల మోనోగమీ శాతంతో దాదాపు సమానంగా ఉంది.

అయితే, ఒకే భాగస్వామితో జీవించే విషయంలో అన్నిటి కంటే మనుషులే ముందుంటారా కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయంలో అగ్రస్థానం ‘కాలిఫోర్నియా చిట్టెలుక’(కాలిఫోర్నియా మౌస్‌)కు దక్కుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాలిఫోర్నియా చిట్టెలుకలు జీవితాంతం విడదీయలేని బంధాలను ఏర్పరచుకుంటాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చింపాంజీలు ఎంతో సామాజికమైనవి, బలమైన బంధాలను ఏర్పరచుకుంటాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చింపాంజీలు ఎంతో సామాజికమైనవి, బలమైన బంధాలను ఏర్పరచుకుంటాయి

‘చాలా క్షీరదాలు వేర్వేరు భాగస్వాములతో సెక్స్ చేస్తాయి’

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మార్క్ డైబల్ మాట్లాడుతూ.. మోనోగమీ విషయంలో మనుషులకు చెప్పుకోదగ్గ స్థానమే ఉంది. కానీ, మిగిలిన క్షీరదాలలో చాలావరకు సంభోగం కోసం వేర్వేరు భాగస్వాములను ఎంచుకుంటాయి’ అని చెప్పారు.

జంతు ప్రపంచంలో, జత కట్టడం వల్ల వేటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి.

అందుకే ఇది మానవుల సహా అనేక జాతులలో స్వతంత్రంగా పరిణామం చెంది ఉండవచ్చు.

సోషల్ మోనోగమీ అని ప్రస్తావించేదానికి వివిధ ప్రయోజనాలున్నాయని చెప్తారు.

దీనివల్ల సంతానోత్పత్తి కాలంలోనైనా జంటగా కలిసి ఉంటూ తమ పిల్లలను సంరక్షించుకుంటాయి. శత్రువుల నుంచి కాపాడుకుంటాయి.

చరిత్రలో వివిధ మానవ సమూహాలను డాక్టర్ డైబల్ పరిశీలించారు.

అక్కడ సంపూర్ణ తోబుట్టువుల(ఫుల్ సిబ్లింగ్స్ - అంటే తోబుట్టువులందరికీ తల్లిదండ్రులు ఒక్కరే ఉంటారు) నిష్పత్తి, సగం తోబుట్టువుల (హాఫ్ సిబ్లింగ్స్ - తల్లి లేదా తండ్రి ఒకరై ఉంటారు) నిష్పత్తితో పోల్చుతూ లెక్కించారు.

ఇదే తరహాలో 30 కంటే ఎక్కువగా సోషల్ మోనోగమీ ఉన్న జీవులు, ఇతర క్షీరదాల కోసం కూడా డేటా సంకలనం చేశారు.

ఫుల్ సిబ్లింగ్స్‌తో మానవులకు మోనోగమీ రేటింగ్ 66 శాతం ఉంది. ఇందులో మీర్‌కేట్‌ల (60 శాతం) కంటే ముందున్నారు. కానీ బీవర్లు (ఒక రకం ఎలుక – 73 శాతం) కన్నా మనుషుల మోనోగమీ రేట్ తక్కువగా ఉంది.

అయితే, పరిణామ క్రమంలో పూర్వం మన బంధువులైన మౌంటైన్ గొరిల్లాలు 6 శాతం రేటింగ్‌తో ఉండగా, చింపాంజీలు కేవలం 4 శాతం (డాల్ఫిన్లతో సమానంగా) రేటింగ్‌తో ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి.

చివరి స్థానంలో మాత్రం స్కాట్లాండ్‌కు చెందిన సోయే గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ ఆడ గొర్రెలు అనేక మగ గొర్రెలతో జత కడతాయి. వీటిలో సంపూర్ణ తోబుట్టువులు 0.6 శాతం మాత్రమే.

ఇక 100 శాతం సంపూర్ణ తోబుట్టువులతో కాలిఫోర్నియా ఎలుక అగ్రస్థానంలో నిలిచింది.

జత కట్టడంలో అత్యంత విచ్చలవిడిగా ఉండే సోయే గొర్రెలు

ఫొటో సోర్స్, Getty Images

మానవ సమాజం పూర్తిగా భిన్నం...

మీర్‌కేట్‌లు, బీవర్లతో సమానమైన ర్యాంకు ఇవ్వడమంటే, వాటితో మానవ సమాజాలు సమానమని కాదు, మానవ సమాజం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

''మానవులలో మనం చూసే సంపూర్ణ తోబుట్టువుల రేటింగ్‌లు మీర్‌కేట్‌లు లేదా బీవర్ల వంటి జాతులకు చాలా సామీప్యం ఉన్నప్పటికీ, మానవులలో మనం చూసే సామాజిక వ్యవస్థ చాలా భిన్నమైంది'' అని డాక్టర్ డైబల్ బీబీసీ న్యూస్‌తో అన్నారు.

''ఈ జాతులలో చాలావరకూ కాలనీల వంటి సమూహాలలో నివసిస్తాయి లేదా బహుశా ఒంటరి జంటలుగా కలిసి తిరుగుతాయి. మానవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. మనం మల్టీ-మేల్, మల్టీ-ఫిమేల్ సమూహాలుగా పిలిచేవాటిలో నివసిస్తాం. వాటిలోపల ఈ ఏకభార్యత్వం లేదా జత కట్టిన, యూనిట్లు ఉంటాయి'' అని ఆయన వివరించారు.

ఈ అధ్యయనంతో సంబంధం లేని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ కిట్ ఓపీ మాట్లాడుతూ.. మానవులలో మోనగమీ ఎలా మొదలైందనే చిక్కుముడిలో ఇది మరొక భాగమని అన్నారు.

''కాలంతో పాటు, వివిధ ప్రాంతాలలో కూడా మానవులు ఏకభాగస్వామ్యత్వంలో ఉన్నారని ఈ అధ్యయనంతో చాలా స్పష్టమైన అవగాహన కలుగుతుందని భావిస్తున్నా'' అని చెప్పారు.

''మానవ సమాజం చింపాంజీలు, బొనోబోలకు చాలా దగ్గరగా ఉంటుంది. కానీ సంభోగం విషయానికొచ్చేసరికి మనం వేరే విధానాన్ని అనుసరిస్తున్నాం'' అని డాక్టర్ కిట్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)