ట్విట్టర్ లోగో: బుల్లి పిట్ట స్థానంలో కుక్కపిల్ల ఎందుకొచ్చింది?

ట్విటర్ లోగో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ మరో అకస్మాత్తు నిర్ణయంతో వార్తల్లో నిలిచారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ‘ట్విట్టర్’ లోగోను ఆయన ఉన్నపళంగా మార్చేశారు.

నీలి రంగులో ఉండే బుల్లి పిట్ట (బ్లూ బర్డ్) స్థానంలో కుక్కపిల్ల మీమ్‌ని ట్విట్టర్ కొత్త లోగోగా నిర్ణయించారు.

సోమవారం నుంచే ట్విట్టర్ హోమ్ పేజీలో ఈ కొత్త లోగో కనిపిస్తోంది. ఐకానిక్ బ్లూ బర్డ్ స్థానంలో ‘‘డాజ్’’ అని పిలిచే కుక్కపిల్ల మీమ్ ప్రత్యక్షమైంది.

ట్విట్టర్ లోగో మార్పు విషయాన్ని ఎలాన్ మస్క్ ఒక సరదా మీమ్‌ను ట్వీట్ చేయడం ద్వారా వెల్లడించారు.

ఆ ట్వీట్‌లో కారులో కూర్చున్న డాజ్ కుక్కపిల్ల, తన డ్రైవింగ్ లైసెన్స్‌ను పరిశీలిస్తోన్న పోలీస్ ఆఫీసర్‌తో... లైసెన్స్‌ కార్డ్ మీద ఉన్న ఫొటో (బ్లూ బర్డ్) తన పాత ఫొటో అని చెబుతున్నట్లుగా ఆ మీమ్ ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

మంగళవారం ఆయన ఒక స్క్రీన్ షాట్‌ను ట్వీట్ చేస్తూ, ‘‘మీకు ప్రామిస్ చేసినట్లుగానే లోగోను మార్చాం’’ అన్నట్లుగా ఒక వ్యాఖ్యను జోడించారు.

ట్విట్టర్‌కు చెందిన ఒక యూజర్‌తో చేసిన చాట్‌ను ఆయన స్క్రీన్ షాట్ తీసి పంచుకున్నారు.

‘‘ట్విట్టర్ సైట్‌ను కొనుగోలు చేసి బ్లూబర్డ్ స్థానంలో దాని లోగోగా ‘‘డాజ్’’ మీమ్‌ను పెట్టాలని’’ చైర్మన్ అనే ట్విట్టర్ యూజర్ ఒకరు మస్క్‌ను కోరారు. దానికి ఆయన నవ్వుతూ బదులిచ్చారు.

తాజాగా అదే చాట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ మీకు హామీ ఇచ్చినట్లుగానే జరిగిందని వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

డాజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

‘‘డాజ్’’ అంటే ఏంటీ?

‘డాజ్‌కాయిన్’ ఒక రకమైన క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీని బిల్లీ మార్కస్, జాక్సన్ పాల్మర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సృష్టించారు.

‘‘బిట్ కాయిన్’’ వంటి క్రిప్టో కరెన్సీలను ఎగతాళి చేస్తూ ఆ ‘‘పేమెంట్ సిస్టమ్’’ ను ఒక జోక్‌గా పరిగణిస్తూ వారు ఈ క్రిప్టో కరెన్సీని 2013లో రూపొందించారు.

ఈ క్రిప్టో కరెన్సీ మీద ‘‘షిబా ఇను’’ బ్రీడ్‌కు చెందిన కుక్కపిల్ల మీమ్‌ను లోగోగా ఏర్పాటు చేశారు. ఈ మీమ్‌ను ‘‘డాజ్‌’’ అని పిలుస్తారు.

ట్విటర్ బ్లూ బర్డ్

ఫొటో సోర్స్, Getty Images

వెబ్ వర్షన్‌లోనే మార్పు

ట్విట్టర్ లోగోగా మొదటి నుంచి ‘‘బ్లూ బర్డ్’’ మాత్రమే ఉంది. సోమవారం నుంచి ట్విట్టర్ వెబ్ వర్షన్‌ హోం పేజీలో ఈ బ్లూ బర్డ్ స్థానంలో ‘డాజ్’ ఎమోజీ కనిపిస్తోంది.

అయితే, మొబైల్ యాప్‌లో మాత్రం ట్విట్టర్ లోగో మారలేదు. ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి కూడా మొబైల్ యాప్‌లో ‘‘బ్లూ బర్డ్’’ లోగోనే ఉంది.

డాజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీ

ఫొటో సోర్స్, CHRIS GRAYTHEN/GETTY IMAGES

‘‘డాజ్ కాయిన్’’ క్రిప్టో కరెన్సీ విలువలో పెరుగుదల

‘‘డాజ్’’ మీమ్‌ను ట్విట్టర్ లోగోగా మార్చగానే దానితో సంబంధం ఉన్న ‘‘డాజ్ కాయిన్’’ క్రిప్టోకరెన్సీ విలువ అమాంతం పెరిగింది.

డాజ్ కాయిన్ విలువ 20 శాతం కంటే ఎక్కువగా పెరిగినట్లు బిజినెస్ టుడే పత్రిక పేర్కొంది.

ఎలాన్ మస్క్ గతంలో కూడా ‘‘డాజ్’’ మీమ్‌పై తనకున్న ఇష్టాన్ని ట్వీట్ల ద్వారా వెల్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో డాజ్ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, ‘‘ట్విట్టర్ కొత్త సీఈవో అద్భుతం’’ అనే వ్యాఖ్యను జోడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

అక్టోబర్‌లో మస్క్ చేతికి వచ్చిన ట్విట్టర్‌

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి, బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు కొనుగోలు చేశారు.

గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని మస్క్ ప్రకటించారు.

అయితే, ఆ తర్వాత కొన్ని కారణాలను చూపిస్తూ ఈ డీల్ నుంచి తప్పుకునేందుకు మస్క్ ప్రయత్నించారు.

దీనిపై ట్విట్టర్ న్యాయ పోరాటం చేసింది. చివరకు గత ఏడాది అక్టోబర్ నెలలో ట్విటర్ టేకోవర్ పూర్తి అయింది. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ పూర్తిగా సొంతం చేసుకున్నారు.

మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ఉద్యోగాల కోతలు, తొలగింపులు, పెను మార్పులు

ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి మస్క్ తన మార్క్‌ను చూపిస్తున్నారు. సంస్థలో అనేక మార్పుచేర్పుల్ని చేశారు.

ట్విటర్ నుంచి సీఈవో సహా పలువురు ఉన్నతోద్యోగులను మస్క్ తొలగించారు. టేకోవర్ చేసిన వెంటనే ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్-పాలసీ-ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా పలువిభాగాల హెడ్‌లను తొలగించారు.

ఆ తర్వాత ట్విటర్ ఉద్యోగులకు ఆయన మెయిల్ చేస్తూ ‘‘ ఉద్యోగులు అందరూ అధిక తీవ్రతతో ఎక్కువ గంటల పాటు పనిచేయాల్సిన అవసరం ఉంది. అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే ఉద్యోగంలో కొనసాగేందుకు అర్హతా ప్రమాణంగా మారుతుంది ’’ అని పేర్కొన్నారు.

ట్విట్టర్

ఫొటో సోర్స్, Getty Images

ట్విట్టర్‌లో వెరిఫైడ్ అకౌంట్ (బ్లూటిక్) కోసం డబ్బు చెల్లించాలని ప్రకటించారు. స్పామ్, స్కామ్‌ల నుంచి ట్విటర్‌ను కాపాడటం కోసమే ఈ విధానాన్ని తెచ్చినట్లు చెప్పారు.

భారత్‌లో కూడా పెయిడ్ బ్లూటిక్ సర్వీసులను ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల టిక్‌లను ట్విటర్ లాంచ్ చేసింది.

దీనిలో బూడిద రంగు టిక్‌లను ప్రభుత్వ సంస్థలకు, బ్లూ టిక్‌లను వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు బంగారు వర్ణపు టిక్‌లను ఆఫర్ చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సేవల కోసం నెలకు 8 డాలర్లను, 11 డాలర్లను చెల్లించేలా రెండు రకాల ప్లాన్లను తీసుకొచ్చింది ట్విటర్.

ట్వీట్లను ఎడిట్ చేసుకునే సౌకర్యంతో పాటు కొన్ని ప్రత్యేక రకమైన సేవలను కూడా ట్విటర్ అందిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)