గాజాపై ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్ సైన్యం, 200మందికి పైగా పాలస్తీనియన్ల మృతి

ఇజ్రాయెల్ పాలస్తీన

ఫొటో సోర్స్, Amir Cohen/ REUTERs

ఫొటో క్యాప్షన్, శనివారం భారీ ఎత్తున రాకెట్లతో హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది.
    • రచయిత, రఫీ బెర్గ్, డేవిడ్ గ్రిటెన్, యోలాండే క్నెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

హమాస్‌ (పాలస్తీనా మిలిటెంట్ సంస్థ) మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపించారు. డజన్ల కొద్దీ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. ఇదే సమయంలో తాము కూడా యుద్దంలోకి దిగామని, వేల కొద్ది సైన్యం రంగంలోకి దిగిందని ఇజ్రాయెల్ ప్రకటించింది.

గాజా నుంచి రాకెట్ల బ్యారేజీలను ప్రయోగిస్తూ హమాస్ మిలిటెంట్లు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సరిహద్దు కంచెను దాటారు.

హమాస్ దాడులతో ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 100 మంది మరణించారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా 900 మందికి పైగా పౌరులు గాయపడినట్లు తెలిపింది.

అనేక మంది ఇజ్రాయెల్‌ పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకున్నట్లు అనధికారిక నివేదికలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే " ఈ దాడులకు హమాస్ మూల్యం చెల్లిస్తుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.

ఇదే క్రమంలో గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన డజన్ల కొద్దీ ఫైటర్ జెట్‌లు వైమానిక దాడులు చేస్తున్నాయన్నారు.

దాడుల కోసం పదివేల మంది రిజర్వ్‌లు అందుబాటులోకి వచ్చాయని నెతన్యాహు ప్రకటించారు.

అయితే గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 198 మంది పాలస్తీనియన్లు మరణించారని, 1,000 మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా అధికారులు తెలిపారు

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, AHMAD GHARABLI/AFP VIA GETTY IMAGES

ఇజ్రాయెల్‌ మీద జరిగిన దాడిపై భారత్ స్పందించింది.

ఇజ్రాయెల్‌పై దాడుల వార్తతో తీవ్ర దిగ్భ్రాంతి చెందానని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటనలో తెలిపారు.

బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు, ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలబడతామని ఆయన ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

పండుగ రోజే దాడి..

యూదుల సబ్బాత్, సిమ్చాట్ తోరా పండుగ రోజే (శనివారం తెల్లవారుజామున) హమాస్ రాకెట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి.

అనంతరం మిలిటెంట్లు దేశంలోకి చొరబడ్డారని సైరన్లు మోగించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పౌరులను అలర్ట్ చేసింది.

అంతేకాదు దక్షిణ, మధ్య ప్రాంతాలకు చెందిన ఇజ్రాయెల్ పౌరులను గాజా సరిహద్దులో గల ఆశ్రయాలలో ఉండాలని సూచించింది.

భారీగా ఆయుధాలు, నల్లటి దుస్తులు ధరించిన పాలస్తీనియన్ మిలిటెంట్ల బృందం పికప్ ట్రక్కులో స్డెరోట్ సిటీ చుట్టూ తిరుగుతున్నట్లు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫుటేజీలో కనిపించింది.

వీడియోల్లో ఆ మిలిటెంట్లు గాజా నుంచి 1.6 కి.మీ దూరంలో ఉన్న అక్కడి పట్టణ వీధుల్లో ఇజ్రాయెల్ దళాలపై కాల్పులు జరుపుతున్నట్లు కనిపించింది.

హమాస్ మిలిటెంట్లు దాడులు చేస్తూ అనేక మంది ఇజ్రాయెలీలను బంధించి, గాజాలోకి తీసుకెళ్లారని పాలస్తీనా మీడియా చెబుతోంది.

గాజాలో పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ సైనిక వాహనాలను నడుపుతున్న ఫుటేజీలను పాలస్తీనా మీడియా పోస్టు చేస్తోంది. ఈ వీడియోలను బీబీసీ ధ్రువీకరించలేదు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, MOHAMMED SABER/EPA-EFE/REX/SHUTTERSTOCK

దూసుకొచ్చిన వేల కొద్ది రాకెట్లు

రాకెట్ దాడులు శనివారం ఉదయం ఇజ్రాయెల్ అంతటా కొనసాగాయి.

ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైపు 2,500 కంటే ఎక్కువ రాకెట్లను ప్రయోగించారని అక్కడి మీడియా చెబుతోంది.

దాడులు వెంటవెంటనే జరగడంతో ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య స్పష్టంగా తెలియడం లేదు. ఇప్పటివరకైతే 100 మంది మరణించారని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది.

తమ వారిని రక్షించడానికి వెళ్లిన తమ నాయకుడు ఓఫిర్ లీబ్‌స్టెయిన్ మిలిటెంట్ల కాల్పుల్లో మరణించినట్లు షార్ హనెగేవ్ ప్రాంతీయ కౌన్సిల్ ప్రకటించింది.

ఆష్కెలాన్‌లోని బార్జిలాయ్ ఆస్పత్రి వర్గాలు తమ వద్ద 68 మంది చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి మీడియాతో వెల్లడించింది.

అలాగే, బీర్షేవాలోని సరోకా ఆస్పత్రిలో 80 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

నెతన్యాహు

ఫొటో సోర్స్, Getty Images

'ఇది రెచ్చగొట్టడం కాదు, యుద్ధమే': నెతన్యాహు

"ఇజ్రాయెల్ పౌరులారా! ఇది ఆపరేషనో, రౌండ్స్ కొట్టడమో కాదు, ఇది యుద్ధమే. మనం యుద్ధంలో ఉన్నాం" అని ప్రధాన మంత్రి నెతన్యాహు ఒక ప్రకటనలో తెలిపారు.

"ఈ ఉదయం ఇజ్రాయెల్, దేశ పౌరులపై హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించింది" అని ఆయన అన్నారు.

"భద్రతా దళాల అధిపతులతో మాట్లాడా. చొరబడిన మిలిటెంట్లను ఏరిపారేయమని ఆదేశించా. ఆపరేషన్ జరుగుతోంది. అదే సమయంలో రిజర్వ్ బలగాలు సమీకరించి, శత్రువు ఎన్నడూ ఎరగని బలంతో ప్రతీకార యుద్ధానికి దిగాలని ఆదేశించాను" అని నెతన్యాహు తెలిపారు.

మరోవైపు ప్రతీచోట పాలస్తీనియన్లు పోరాడాలని, ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు సీనియర్ హమాస్ మిలటరీ కమాండర్ మహమ్మద్ డీఫ్ మీడియాలో తమ పౌరులకు పిలుపునిచ్చారు.

"భూమిపై చివరి ఆక్రమణను అంతం చేయడానికి ఇది ఒక అద్భుతమైన రోజు" అని ఆయన ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

భారత పౌరులకు ఎంబసీ సూచనలు

ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. దీంతో ఇండియన్ ఎంబసీ వారికి పలు సూచనలు జారీ చేసింది.

"ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు అక్కడి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక పరిపాలనా విభాగం అందించే మార్గదర్శకాలు అనుసరించాలి. భారత పౌరులు ఎటువంటి కారణం లేకుండా బయటకు వెళ్లవద్దు. సురక్షిత ప్రాంతాలకు సమీపంలో ఉండాలి'' అని టెల్ అవీవ్‌ సిటీలో ఉన్న భారత రాయబార కార్యాలయం కోరింది.

ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ వెబ్‌సైట్‌‌ను అనుసరించాలని సూచించింది. ఎమర్జెన్సీ నంబర్లు కూడా జారీ చేసింది.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్ మీద పాలస్తీనా మెరుపుదాడి, వేల రాకెట్లతో దాడి

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)