ఇజ్రాయెల్ వైమానిక దాడులతో దద్దరిల్లిన గాజా

గాజాపై వైమానిక దాడులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాపై వైమానిక దాడులు

గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

గాజా స్ట్రిప్ నుంచి మంటలు పుట్టించే బెలూన్లు తమ భూభాగంలోకి రావడంతో తాము ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది.

బుధవారం తెల్లవారుజామున పేలుళ్లతో గాజా దద్దరిల్లింది.

మా యుద్ధ విమానాలు ఖాన్ యూనస్, గాజా నగరంలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) వెల్లడించింది.

"హమాస్ ప్రాంగణాల్లో తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. గాజా స్ట్రిప్ నుంచి కొనసాగుతున్న తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోడానికి, మళ్లీ యుద్ధం ప్రారంభించడంతోపాటు, అన్నిరకాల పరిస్థితులనూ ఎదుర్కోడానికి ఐడీఎఫ్ సిద్ధంగా ఉంది" అని తాము జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇజ్రాయెల్ దాడుల వల్ల ఏదైనా ప్రాణనష్టం జరిగిందా, లేదా అనేది ఇప్పటివరకూ స్పష్టంగా తెలీలేదు.

ఇజ్రాయెల్‌లో ఇటీవల కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య హింసాత్మక ఘర్షణలు జరగడం ఇదే తొలిసారి.

మేలో రెండు పక్షాల మధ్య 11 రోజుల వరకూ భీకర యుద్ధం జరిగింది. తర్వాత మే 21న కాల్పుల విరమణ జరిగింది.

అంతకు ముందు మంగళవారం యూదు జాతీయవాదులు ఇజ్రాయెల్ అధీనంలోని తూర్పు జెరూసలెంలో ఒక ఊరేగింపు నిర్వహించారు. తర్వాత గాజాలో పాలన సాగిస్తున్న మిలిటెంట్ గ్రూప్‌ హమాస్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

మంటలు పుట్టించే బెలూన్లు వదులుతున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు(ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంటలు పుట్టించే బెలూన్లు వదులుతున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు(జూన్ 15న ఫొటో)

మంగళవారం గాజా వైపు నుంచి మంటలు పుట్టించే చాలా బెలూన్లను పంపించారని, దానివల్ల చాలా ప్రాంతాల్లో మంటలు చెలరేగాయని ఇజ్రాయెల్ చెప్పింది.

ఇజ్రాయెల్ ఫైర్ సర్వీస్ వివరాల ప్రకారం దక్షిణ ఇజ్రాయెల్లోని కనీసం 20 ప్రాంతాల్లో పొలాల్లో మంటలు చెలరేగాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గాజాలోని బీబీసీ ప్రతినిధి రష్దీ అబూ అలఫ్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. తమ ప్రాంతమంతా పైన ఇజ్రాయెల్ డ్రోన్లు తిరుగుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు.

మా హక్కుల రక్షణ కోసం, మా మొత్తం భూభాగం నుంచి ఆక్రమణదారులను బయటకు తరిమికొట్టేవరకూ పాలస్తీనా ప్రతిఘటన కొనసాగుతుంది" అని ట్విటర్‌లో హమాస్ ప్రతినిధి ఒకరు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)