విజయవాడ: ప్రకాశం బరాజ్‌ను ఢీకొట్టిన బోట్లు.. ధ్వంసమైన కాంక్రీట్ దిమ్మె, వాహనాల రాకపోకలు నిలిపివేత

కృష్ణానదిలో వరద ఉద్ధృతికి పైప్రాంతం నుంచి బోట్లు కొట్టుకొచ్చాయి.
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇసుక ర్యాంపుల వద్ద ఉండే బోట్లు ప్రవాహ ఉద్ధృతిలో
కొట్టుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇవి విజయవాడ ప్రకాశం బరాజ్ గేట్ల వద్ద అడ్డంగా చిక్కుకుపోయాయి.
ప్రవాహ తీవ్రతకు గేట్లకు రెండు వైపులా ఉన్న కాంక్రీట్ దిమ్మెలను, గేట్ల పైనున్న కాంక్రీట్ బీమ్‌లను ఇవి ఢీకొంటున్నాయి.
ఇప్పటికే నాలుగు బోట్లు ఇలా కొట్టుకొచ్చి బరాజ్ గేట్లకు అడ్డంగా నిలిచిపోయాయి.


విరిగిన కాంక్రీట్ బీమ్
దృఢమైన ఈ బోట్లు నీటిలో తేలుతూ అదేపనిగా కాంక్రీట్ దిమ్మెలను ఢీకొడుతుండటంతో ఇప్పటికే ఒక కాంక్రీట్ బీమ్ దెబ్బతిన్నట్లు ‘బీబీసీ’ కోసం ప్రకాశం బరాజ్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్న లక్కోజు శ్రీనివాస్ తెలిపారు.
ఇది 68వ పిల్లర్ వద్ద జరిగినట్లు శ్రీనివాస్ తెలిపారు.
ఈ కారణంగా బరాజ్‌పై వాహనాల రాకపోకలను కూడా పోలీసులు నిలిపివేశారు.

70 ఏళ్ల ప్రకాశం బరాజ్
ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత 1954లో కృష్ణా నదిపై ప్రకాశం బరాజ్ నిర్మాణం మొదలైంది. 1957 నాటికి దీని నిర్మాణం పూర్తయింది.
అప్పట్లో దీనికి రూ. 2.78 కోట్లతో నిర్మించినట్లు ‘కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్’ పేర్కొంది.
ఈ బరాజ్‌కు టంగుటూరి ప్రకాశం పేరు పెట్టడంతో ప్రకాశం బరాజ్‌గా స్థిరపడిపోయింది.
ఈ బరాజ్ పొడవు 1232.92 మీటర్లు ( సుమారు 1.2 కిలోమీటర్లు).
బరాజ్‌కు మొత్తం 70 గేట్లు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Telugu Desam Party
పంజాబ్ నుంచి 122 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
కుండపోత వర్షాలకు అతలాకుతలమైన ఏపీ, తెలంగాణలో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ నుంచి అదనపు బలగాలు వచ్చాయి.
ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు రాష్ట్రాల్లో సహాయ చర్యల్లోనిమగ్నమయ్యాయి.
వీరికి అదనంగా మరో 14 బృందాలను రెండు రాష్ట్రాలకు పంపించారు.
ఎన్డీఆర్ఎఫ్‌కు చెందిన సుమారు 100 మంది ఆర్మీ విమానంలో పంజాబ్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది.
కృష్ణానది, బుడమేరు పొంగడంతో విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి.
తెలంగాణలోనూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పరిధిలో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు పొంగడంతో చాలా ప్రాంతాలు నీట్లో మునిగాయి.
వరదల కారణంగా రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు వరద సహాయ చర్యలు ముమ్మరం చేశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














