మాస్కో మ్యూజిక్ హాల్‌లో దాడి, 115 మంది మృతి.. యుక్రెయిన్, అమెరికా ఏమన్నాయి?

రష్యాలో దాడి

ఫొటో సోర్స్, Getty Images

రష్యా రాజధాని మాస్కో పరిసర ప్రాంతంలోని ఒక కన్సర్ట్ హాల్‌లో కొందరు సాయుధులు జరిపిన దాడిలో 115 మంది చనిపోయారని రష్యా భద్రతా సంస్థలు చెప్పాయి.

మరో వందల మంది గాయపడ్డారని తెలిపాయి. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నారు.

క్రాస్నోగోర్స్క్ నగరం శివార్లలోని క్రోకస్ సిటీ హాల్‌ అనే కన్సర్ట్ హాల్‌లో రాక్ సంగీత ప్రదర్శన ప్రారంభం కావడానికి ముందు ఈ ఘటన జరిగింది.

దీనిని ఉగ్రవాద దాడిగా రష్యా విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది.

ఈ దాడిలో తమ ప్రమేయం లేదని యుక్రెయిన్ చెప్పింది.

టెలిగ్రామ్ మెసేంజింగ్ యాప్‌‌లో రష్యన్‌ ఇన్వెస్టిగేషన్ కమిటీ, "మృతుల సంఖ్య 115కి చేరింది. ఎమర్జెన్సీ బృందాలు శిథిలాల కింద మరిన్ని మృతదేహాలను గుర్తించాయి" అని తెలిపింది.

రష్యా

ఫొటో సోర్స్, MAXIM SHIPENKOV/EPA-EFE/REX/SHUTTERSTOCK

కన్సర్ట్ హాల్‌ వద్ద ఉన్నవారిని తప్పుదోవ పట్టించేలా ‘కామఫ్లాజ్’ దుస్తులు ధరించి వచ్చిన నలుగురు గన్‌మెన్ విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

రష్యన్ రాక్ గ్రూప్ ‘పిక్నిక్’ ఇచ్చే సంగీత ప్రదర్శన కోసం ఆరు వేల మందికి పైగా ప్రేక్షకులు కన్సర్ట్ హాల్‌కు వచ్చారు.

కార్యక్రమ వేదికపైకి బ్యాండ్ చేరుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఈ దాడి జరిగింది.

దాడిలో భవనం పైకప్పులో కొంత భాగం కూలిపోయింది. భవనంలో అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

దాడికి పాల్పడినవారిని పట్టుకొనేందుకు ఘటనా స్థలంలో రష్యా నేషనల్ గార్డ్ ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.

రష్యా ఉన్నతాధికారులు కూడా క్రాస్నోగోర్స్క్ నగరానికి వెళ్లారు.

రష్యాలో దాడి

ఫొటో సోర్స్, REUTERS/MAXIM SHEMETOV

ఈ దాడి తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ చెప్పినట్లు ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన కనిపించింది. ఇది ధృవీకృతం కాలేదు.

రష్యాపై ఇస్లామిక్ స్టేట్ దాడి చేయాలనుకొందనే నిఘా సమాచారం అమెరికా అధికారులకు అందిందని వారిని ఉటంకిస్తూ అమెరికాలో బీబీసీ పార్ట్‌నర్ సర్వీస్ అయిన సీబీఎస్ తెలిపింది.

జనసమ్మర్దంగల ప్రదేశాలకు వెళ్లొద్దని రష్యాలోని తమ పౌరులను అమెరికా రాయబార కార్యాలయం రెండు వారాల క్రితం హెచ్చరించింది.

మాస్కోలో జనసమ్మర్ద ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారనే సమాచారం తమకు ఉందని తెలిపింది.

ఇప్పుడు దాడి జరిగిన కన్సర్ట్ హాల్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లొద్దని శుక్రవారం సాయంత్రం ఎంబసీ మరోసారి హెచ్చరించింది.

రష్యాలో దాడి

ఫొటో సోర్స్, CONTRIBUTOR/GETTY IMAGES

రష్యాలో కన్సర్ట్ హాల్‌లో దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది హేయమైన ఉగ్రవాద దాడి అని ఆయన చెప్పారు.

రష్యా ప్రభుత్వానికి భారత్ సంఘీభావం తెలుపుతోందని మోదీ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

వీడియో క్యాప్షన్, బాంబు దాడులు జరుగుతున్నా ఆమె అక్కడే ఉండాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)