విజయవాడ: బుడమేరు బీభత్సానికి ఏడాది, అప్పుడు - ఇప్పుడు 11 ఫోటోలలో..
కథనం
రచయిత, లక్కోజు శ్రీనివాస్, సాయికృష్ణ
హోదా, బీబీసీ కోసం
2024...ఆగస్ట్ 30, 31 తేదీల్లో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో బుడమేరు వరద నీరు సగానికి పైగా బెజవాడను ముంచేసింది. అజిత్ సింగ్ నగర్, రామకృష్ణాపురం, అరుణోదయనగర్, డాబాకొట్టు సెంటర్, నందమూరినగర్, నున్న ప్రాంతాలను ముంచెత్తింది. విజయవాడ వన్‌టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నంలోనూ వరద నీరు మొదటి అంతస్తుల వరకూ చేరింది.
అలాంటి భయానకమైన పరిస్థితికి కారణమైన బుడమేరు వరదలు వచ్చి ఈ నెల 30 వ తేదీకి ఏడాది అవుతుంది.
వరదలకు ఎక్కువగా ప్రభావితమైన అజిగ్ సింగ్ నగర్, డాబాకొట్టు సెంటర్, అరుణోదయ నగర్, ప్రకాశం బరాజ్‌ల వద్ద అప్పటి వరద ఉధృతి, ప్రస్తుత పరిస్థితిని 2025 ఆగస్ట్ 20న బీబీసీ కెమెరా క్లిక్‌మనిపించింది.
ఫొటో క్యాప్షన్, అజిత్ సింగ్ నగర్ ఫ్లై ఓవర్ దిగువన ఉన్న వీధి పూర్తిగా మునిగిపోవడంతో, పీకల్లోతు నీటిలో బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ సాయం కోసం అర్థిస్తున్న బాధితులు. 2025 ఆగస్ట్ 20న తీసిన ఫోటోలో నాలుగడుగులకుపైగా ఎత్తున్న ఆలయం గోడ స్పష్టంగా కనిపిస్తోంది.
ఫొటో క్యాప్షన్, సెప్టెబర్ 2, 2024న వరద నీటితో పూర్తిగా మునిగిపోయి కనిపించిన అజిత్ సింగ్ నగర్ రైతు బజార్, ఇప్పుడు ఇలా ఉంది.
ఫొటో క్యాప్షన్, సెప్టెబర్ 2, 2024: బుడమేరు పొంగడంతో అరుణోదయ కాలనీకి రాకపోకలు బంద్ అయ్యాయి. తాళ్ల సాయంతో ఆహారం, నీరు అందించారు. 2025 ఆగస్ట్ 20న ఇలా..
ఫొటో క్యాప్షన్, 2024 సెప్టెంబర్ 1, 2 తేదీల్లో డాబాకొట్టు సెంటర్‌లో వరద అలాగే ఉంది.
ఫొటో క్యాప్షన్, సెప్టెబర్ 2, 2024న అజిత్ సింగ్ నగర్ నుంచి అరుణోదయ కాలనీకి వెళ్లే మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్. వరద నీటికి ట్రాక్‌కి ఇరువైపులా ఉన్న రోడ్లు నీటమునిగాయి.
ఫొటో క్యాప్షన్, రైతు బజారు సమీపంలో వరద బాధితులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో తరలించారు.
ఫొటో క్యాప్షన్, ప్రకాశం బరాజ్‌ను బోట్లు ఢీకొట్టడం వల్ల రెండు కౌంటర్ వెయిట్ బాక్సులు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వాటిని తొలగించి.. కొత్తవి ఏర్పాటు చేశారు.
ఫొటో క్యాప్షన్, ప్రకాశం బరాజ్ నుంచి కృష్ణా నది వరద ఉధృతి..
ఫొటో క్యాప్షన్, కృష్ణా నదిపై ఉన్న రైలు వంతెనను దాదాపు తాకుతున్నట్లు కనిపిస్తున్న నీటి ప్రవాహం
ఫొటో క్యాప్షన్, వినాయక చవితికి ఇంకా మూడు రోజులే ఉండటంతో, ఆ వరదలో కూడా వినాయక విగ్రహాలను పందిళ్ల వద్దకు తీసుకుని వెళ్తున్న దృశ్యాలు అజిత్ సింగ్ నగర్‌లో గతేడాది కనిపించాయి.
ఫొటో క్యాప్షన్, డాబాకొట్టు సెంటర్‌లో స్వచ్ఛంద సంస్థలు పంపిణీ చేస్తున్న వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాల కోసం వరద బాధితులు ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చారు. కొందరికి ఏమి దొరక్క ఖాళీ చేతులతో ఇళ్లకు వెళ్లారు.