చేతన్ కుమార్: హిందుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు అరెస్టైన నటుడు

ఫొటో సోర్స్, CHETAN KUMAR VIA TWITTER
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
హిందుత్వ భావజాలం మీద చేసిన ట్వీట్‌కు గాను కన్నడ నటుడు చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
భారతదేశంలో హిందుత్వ జాతీయవాదులు ప్రచారం చేస్తున్న హిందుత్వవాదాన్ని‘‘అబద్ధాల మీద నిర్మించారు’’ అని చేతన్ కుమార్ ట్వీట్ చేశారు.
దీనికి నిరసనగా హిందుత్వ గ్రూపులకు చెందిన వారు ఫిర్యాదు చేయగా ఆయనను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు.
‘‘మతవిశ్వాసాలను దెబ్బతీసేందుకు కుట్ర’’, ‘‘విద్వేషాలు రెచ్చగొట్టడం’’ వంటి ఆరోపణలు చేతన్ కుమార్ మీద నమోదు చేశారు.
‘‘నిజాల తోటి హిందుత్వాన్ని ఓడించగలం’’ అని కూడా చేతన్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం కోర్టు ఆయనను రెండు వారాల పాటు జ్యూడిషియల్ కస్టడీకి పంపింది.
ఏడాదిలోపు చేతన్ కుమార్ ఇలా అరెస్టు కావడం రెండోసారి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
2022 ఫిబ్రవరిలో కర్నాటక హిజాబ్ కేసును విచారిస్తున్న జడ్జి మీద చేసిన ట్వీట్‌కు ఆయనను అరెస్టు చేశారు.
అమెరికా పౌరసత్వం ఉన్న చేతన్ కుమార్, కర్నాటకలో కులవ్యతిరేక ఉద్యమాలు నడిపారు.
గతంలో కాంతారా సినిమాలో చూపించిన భూతకోల ఆరాధనా పద్ధతి ‘‘హిందూ మతంలో భాగం కాదు’’ అని అనడంతో చేతన్ కుమార్ మీద కేసు నమోదు చేశారు.
ఎన్ని కేసులు నమోదవుతున్నా ఆయన మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.
‘‘ఒకరి అభిప్రాయాలతో విబేధించొచ్చు. కానీ అరెస్టు చేయడం సరికాదు’’ అని కన్నడ సినిమా ప్రొడ్యూసర్ అగ్ని శ్రీధర్ అన్నారు.
‘‘అంబేడ్కర్: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వాలకు బ్రాహ్మణ భావజాలం వ్యతిరేకం. బ్రాహ్మణ భావజాలాన్ని పెకిలించాలి.
పెరియార్: మనం అందరం ఒకేరకంగా పుడుతున్నాం. కానీ బ్రాహ్మణులు అధికులని, మిగతా వాళ్లు తక్కువవాళ్లని, అంటరాని వారని చెప్పడం అర్థంలేనిది.’’ అని గతంలో చేతన్ కుమార్ ట్వీట్ చేశారు.
నాడు బ్రాహ్మిణ్ డెవల్మెంట్ బోర్డ్ చేసిన ఫిర్యాదుతో చేతన్ కుమార్ మీద సెక్షన్ 295ఏ కింద కేసు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
చేతన్ కుమార్ ఎవరు?
అమెరికాలో పెరిగిన చేతన్ కుమార్ 2005లో భారత్‌కు వచ్చారు.
ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ మీద భారత్‌లోని నాటకాల మీద ఆయన పరిశోధనలు చేశారు.
2007లో కేఎం చైతన్య దర్శకత్వం వహించిన ‘‘ఆ దినగలు’’ సినిమాతో హీరోగా మారారు.
1980లలో బెంగళూరులో అండర్ వరల్డ్ డాన్‌గా ఉన్న శ్రీధర్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఆ సినిమాను తీశారు.
ఆ సినిమా హిట్ కావడంతో చేతన్ కుమార్‌కు మంచి గుర్తింపు వచ్చింది. నాటి నుంచి 10 సినిమాల్లో ఆయన నటించారు.
అయితే, నటుడుగా కంటే కూడా సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారునిగా ఆయనకు ఎక్కువ గుర్తింపు వచ్చింది.
దళిత రైతులు, ఆదివాసీల హక్కులు, సంక్షేమం కోసం చాలా సంస్థలతో కలిసి చేతన్ కుమార్ పని చేస్తున్నారు.
ఆయన ‘కావాలనే’ నటన మీద కాకుండా రాజకీయాల మీద దృష్టిపెట్టినట్లు చేతన్ కుమార్ స్నేహితుల్లో ఒకరు తెలిపారు. కానీ వారు తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.
‘‘చికాగోలో పెరిగేటప్పుడు జాతి వివక్షను ఎదుర్కొన్నాను. అలాగే భారత్‌లో ఉన్న కుల వ్యవస్థ వల్ల నేను లాభపడ్డాను’’ అని డెక్కన్ హెరాల్డ్ న్యూస్ పేపర్‌కు రాసిన వ్యాసంలో ఆయన చెప్పుకున్నారు.
అమెరికా నుంచి ‘‘భారత్‌కు వచ్చినప్పుడు ‘‘సమాజంలోని సామాజిక, కుల అంతరాలను చూసినట్లు’’ చేతన్ కుమార్ చెప్పారు. అందువల్లే తాను కుల వ్యతిరేక పోరాటాల్లో భాగమైనట్లు చెప్పుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- కత్తిపీటతో హత్య చేసేందుకు మా నాన్నే ప్రయత్నించారు – కులం, గౌరవం, ప్రేమ కథ
- ‘రంగమార్తాండ' రివ్యూ: గుండె లోతుల్లోని ఉద్వేగాన్ని బయటకు లాక్కొచ్చే సినిమా
- అదానీ గ్రూప్ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు ఏడాదిగా ఎందుకు నిరసనలు చేస్తున్నారు?
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
- వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














