కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్‌, చికిత్స చేస్తున్న వైద్యులు

కింగ్ చార్లెస్ - 3

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సీన్ కఫ్లాన్
    • హోదా, బీబీసీ న్యూస్ రాయల్ కరస్పాండెంట్

కింగ్ చార్లెస్ - 3 క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.

ప్రొస్టేట్ గ్రంథికి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన సమయంలో క్యాన్సర్‌ ఉన్నట్లు తేలింది.

అయితే, అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని గుర్తించారు.

అది ఏ రకమైన క్యాన్సర్, శరీరంలో ఏ భాగంలో ఉంది అనే విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు.

కింగ్ చార్లెస్‌కు సోమవారం నుంచి క్యాన్సర్ చికిత్స ప్రారంభమైంది.

రాజు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?

కింగ్ చార్లెస్ - 3

కింగ్ చార్లెస్‌ ప్రస్తుతం బాగానే ఉన్నారని, వీలైనంత త్వరగా తన బాధ్యతలను తిరిగి చేపడతారని రాజకుటుంబ అధికార ప్రతినిధి తెలియజేశారు.

ప్రస్తుతానికి కొంతకాలం ఆయన అధికారిక విధులకు దూరంగా ఉంటారు, ఆయన స్థానంలో రాజకుటుంబానికి చెందిన సీనియర్ సభ్యులు ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారు.

ఆయన అనారోగ్య పరిస్థితి గురించి, ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే విషయాలపై ఎలాంటి సమాచారం వెల్లడికాలేదు.

ఆయన వయస్సు 75 ఏళ్లు. ప్రస్తుతం 'ఔట్‌డోర్ పేషంట్'గా చికిత్స పొందుతున్నారు.

ప్రభుత్వ విధులు నిర్వర్తిస్తా..

ప్రస్తుతం ఆయన అధికారిక కార్యక్రమాలను కొనసాగిస్తారు.

అధికారిక పత్రాలపై సంతకాలు చేయడం, ప్యాలస్‌లో జరిగే చిన్నచిన్న ప్రైవేట్ సమావేశాలు వంటి వాటిలో పాల్గొంటారు.

క్యాన్సర్ సమస్యపై అవగాహన పెంచడం కోసమే ఆయన తన చికిత్స గురించి బయటకు వెల్లడించారని కింగ్ చార్లెస్ ప్రతినిధి తెలియజేశారు.

ఇవి కూడా చదవండి: