కోరమండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్, గూడ్స్‌ గార్డు ప్రాణాలతో ఎలా బయటపడ్డారు, ప్రమాదంపై ఏం చెప్పారు?

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది మరణించినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా ధ్రువీకరించారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

మరోవైపు ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలపై రైల్వే శాఖ విచారణ కొనసాగుతోంది. గూడ్సు రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోమోటివ్ డ్రైవర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన గూడ్సు రైలు గార్డు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన గూడ్సు గార్డు క్యాబిన్‌లో లేరు.

గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రైలుని ముందుకు నడిపామని కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోమోటివ్ డ్రైవర్ చెప్పినట్లు రైల్వే ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యురాలు జయ వర్మ సిన్హా తెలిపారు.

ప్రమాదం గురించి కోరమండల్ లోకోమోటివ్ డ్రైవర్‌, ఐరన్‌ లోడుతో లూప్ లైన్‌లో ఉన్న గూడ్సు రైలు గార్డుతో తాను మాట్లాడినట్లు ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు.

కోరమండల్ డ్రైవర్ ఏమన్నారు?

''కోరమండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌తో మాట్లాడాం. ఆయన ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారు. ప్రమాదానికి ముందు తాను గ్రీన్ సిగ్నల్ చూశానని ఆయన నాకు చెప్పారు'' అని జయ సిన్హా చెప్పారు. డాష్‌బోర్డులో కూడా ఆ సమయంలో గ్రీన్ సిగ్నల్ ఉన్నట్లు విచారణలో గుర్తించామని ఆమె వెల్లడించారు.

''ఐరన్ లోడుతో ఉన్న గూడ్సు రైలు గార్డుతో కూడా నేను మాట్లాడాను. ఆయన ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని అందరికీ తెలిసిందే. రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో గార్డు బ్రేక్ వ్యాన్ ధ్వంసమైంది.

ఒకవేళ గార్డులో అందులో ఉండి ఉంటే ఆయన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండేది. దుర్ఘటన సమయంలో గూడ్సు రైలును ఆయన బయటి నిల్చుని పరిశీలిస్తున్నారు.'' అని ఆమె చెప్పారు.

ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే తమకు సమాచారం అందిందని జయ వర్మ సిన్హా తెలిపారు.

రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫస్ట్ ఏసీ బోగీ వెనక ఉన్న రెండు జనరల్ బోగీల నుంచి పెద్దగా అరుపులు వినిపించాయని, ఏదో జరిగిందని అనుకున్నట్లు యశ్వంత్‌పూర్ - హవ్‌డా ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ టీటీ తనతో చెప్పారని ఆమె అన్నారు.

''హవ్‌డా వెళ్తున్న యశ్వంత్‌పూర్ - హవ్‌డా ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ టీటీతో నేను మాట్లాడాను. వెనక నుంచి పెద్దగా అరుపులు వినిపించాయని ఆయన చెప్పారు. అక్కడ ఏదో జరిగిందని అనుకున్నారు. ఏ1 బోగీ వెనక రెండు జనరల్ బోగీలతో పాటు గార్డు క్యాబిన్ ఉన్నాయి.'' అని జయ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

''ఏ1 బోగీ వెనక ఉన్న రెండు జనరల్ బోగీలు రైలు నుంచి విడిపోయి ట్రాక్‌పై పడిపోయాయి. అప్పటికి ఏ1 కోచ్ ముందుకు వెళ్లిపోయింది.'' అని అన్నారు.

రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ?

బాలాసోర్ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ విచారణ జరుపుతోంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పుల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణ అనంతరం రైల్వే శాఖ తెలిపింది.

అయితే, ఈ ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే బోర్డు సిఫార్సు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

''సహాయక చర్యలు పూర్తయ్యాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ట్రాక్ పనులు పూర్తయ్యాయి. వైరింగ్ పనులు కొనసాగుతున్నాయి. గాయాలపాలైన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.'' అని రైల్వే మంత్రి మీడియా సమావేశంలో వెల్లడించినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

''ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు, ప్రమాదం ఎలా జరిగింది? అందుకు గత కారణాలేంటి? అనే దిశగా విచారణ జరుగుతోంది. ఈ ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే బోర్డు సిఫార్సు చేసింది'' అని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పుల వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు.

''ఇది వేరే సమస్య. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌, పాయింట్ మెషీన్‌‌కి సంబంధించిన విషయం. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో సమస్య వచ్చింది. దాని వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఎవరి వల్ల ఇది జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలు విచారణ అనంతరం తెలుస్తాయి'' అని రైల్వే మంత్రి తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఒడిశా రైలు ప్రమాదం: దుర్ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఏం చేశారంటే....

ఇవి కూడా చదవండి: