ఆస్ట్రేలియా: పదిహేను రోజుల్లో మూడోసారి హిందూ దేవాలయాలపై దాడి.. ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Hare Krishna Melbourne/Facebook
ఆస్ట్రేలియాలో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
సోమవారం తాజాగా మరో దేవాలయంపై దాడి జరిగింది.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా ప్రాంతంలో ఉన్న ఆలయం గోడలపై భారతదేశ వ్యతిరేక నినాదాలు రాసినట్లు స్థానిక మీడియా చెబుతోంది.
గత పదిహేను రోజుల్లో ఇది మూడో సంఘటన.
అంతకుముందు జనవరి 12, జనవరి 16 తేదీలలో హిందూ దేవాలయాలపై ద్వేషపూరిత నినాదాలు రాసిన వార్తలు వచ్చాయి.
దాడుల వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని ఆస్ట్రేలియా హైకమిషనర్ బారీ ఓఫారెల్ అన్నారు.
"భారత్ లాగే ఆస్ట్రేలియా కూడా భిన్న సంస్కృతులు కలిగిన దేశం. మెల్‌బోర్న్‌లో రెండు హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయి. వీటిపై ఆస్ట్రేలియన్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి.
భావ ప్రకటనా స్వేచ్ఛను మేం గట్టిగా సమర్థిస్తాం. కానీ, ఇందులో ద్వేషపూరిత ప్రసంగాలు, హింసకు చోటు లేదు" అని ఓఫారెల్ ట్వీట్ చేశారు.
భారత విదేశాంగ శాఖ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దీని వెనుక ఎవరి హస్తం ఉంది?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ ఘటనకు బాధ్యులు అని ఆస్ట్రేలియాలోని స్థానిక వార్తాపత్రికలలో కథనాలు వచ్చినట్టు పీటీఐ తెలిపింది.
విక్టోరియా ప్రాంతంలో "ఆలయం బాగోగులు చూస్తున్నవారు సోమవారం ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసి ఉండడం చూశారు" అని ది ఆస్ట్రేలియన్ టుడే తెలిపింది.
ఆ రాతలు చూసి ఆలయంతో సంబంధం ఉన్న వారందరూ చాలా బాధపడ్డారని, కోపంగా ఉన్నారని ఇస్కాన్ టెంపుల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ భక్త దాస్ అన్నారు.
ఈ ఘటనపై విక్టోరియా ప్రావిన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆలయం సీసీటీవీ ఫుటేజీ కూడా వారికి అందించారని భక్త దాస్ చెప్పారు.
అక్కడ నివసిస్తున్న ఐటీ కన్సల్టెంట్ శివాంశ్ పాండే తరచూ ఇదే ఆలయానికి వెళ్లి పూజలు, ప్రార్థనలు చేస్తారు. ఆలయంపై ఈ రకమైన దాడి తీవ్రంగా బాధపెట్టిందని అన్నారు.
"ఆలయాలపై దాడులు మొదలై రెండు వారాలు పైనే అయింది. ఇప్పటివరకు విక్టోరియా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. శాంతిని ప్రేమించే హిందూ సమాజానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ఎజెండాను నడుపుతున్నది ఎవరో తెలియలేదు" అని ఆయన అన్నారు.
మొదట దాడులు ఎక్కడ జరిగాయి
జనవరి 16న విక్టోరియాలోని క్యారమ్ డౌన్స్‌లో ఉన్న చారిత్రాక శివ విష్ణు ఆలయంపై దాడి జరిగింది.
ఆరోజు అక్కడ నివసిస్తున్న తమిళులు పొంగల్ పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్లినప్పుడు గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాసి ఉండడం చూశారు.
ఉషా సెంథిల్ నాథన్ చాలా కాలంగా అక్కడ నివసిస్తున్నారు. తమది తమిళ మైనారిటీ వర్గమని, మతపరమైన హింస నుంచి తప్పించుకోవడానికి శరణార్థులుగా ఆస్ట్రేలియాకు వచ్చామని చెప్పారు.
ఖలిస్తాన్ మద్దతుదారులు ఇంత నిర్భయంగా ఆలయాల గోడలపై ద్వేషపూరిత నినాదాలు రాయడాన్ని అంగీకరించలేనని అన్నారు.
మెల్‌బోర్న్ హిందూ సంఘం సభ్యుడు సచిన్ మహతే మాట్లాడుతూ, "ఈ ఖలిస్తానీ మద్దతుదారులకు అంత ధైర్యం ఉంటే విక్టోరియాలో శాంతిని ప్రేమించే హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకునే బదులు, నేరుగా విక్టోరియా పార్లమెంటుకు వెళ్లి ఈ నినాదాలు రాయాల్సింది" అన్నారు.
అంతకుముందు జనవరి 12న మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ ఆలయంలో భారత వ్యతిరేక నినాదాలు రాశారు.
దీనిపై ఆలయ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఆలయ ప్రాంగణంలో భారత వ్యతిరేక నినాదాలు రాయడం తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
భారత విదేశాంగ శాఖ ఏం చెబుతోంది?
ఈ విషయంపై భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మాట్లాడుతోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం మీడియా సమావేశంలో తెలిపింది.
"ఇటీవల ఆస్ట్రేలియాలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆస్ట్రేలియా నాయకులు, కమ్యూనిటీ నాయకులు, మత సంస్థలు కూడా దీన్ని బహిరంగంగా ఖండించారు.
మెల్‌బోర్న్‌లోని మా కాన్సులేట్ జనరల్ ఈ విషయమై స్థానిక పోలీసులతో మాట్లాడారు. నేరస్థులపై సత్వర విచారణ, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మేం అభ్యర్థించాం. ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కూడా మాట్లాడాం" అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు.
ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుంటామని విక్టోరియా ప్రభుత్వ యంత్రాంగం కూడా హామీ ఇచ్చింది.
విక్టోరియా యాక్టింగ్ ప్రీమియర్ జసింతా అలెన్ ఆస్ట్రేలియా టుడేతో మాట్లాడుతూ, విక్టోరియాలో నివసించే ప్రజలందరికీ జాత్యహంకారం, ద్వేషం, విమర్శలకు తావు లేకుండా, తమ విశ్వాసాలను అనుసరిస్తూ శాంతియుతంగా జీవించే హక్కు ఉందని అన్నారు.
ఇస్కాన్ ఆలయంపై సోమవారం దాడి జరగడానికి కేవలం రెండు రోజుల ముందు, విక్టోరియాలోని బహుళ-సాంస్కృతిక కమీషన్ వివిధ మతాల నాయకులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
ఆ తరువాత, ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ సమాజంపై ద్వేషం వెదజల్లడాన్ని ఖండిస్తూ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
విక్టోరియా లిబరల్ పార్టీ ఎంపీ బ్రాడ్ బాటిన్ మాట్లాడుతూ "ఇది చాలా అసహ్యంగా ఉంది. ఇలాంటి ఘటనలు జరగడానికి మనం అనుమతించకూడదు" అని అన్నారు.
ఆస్ట్రేలియా ఎంపీ జోష్ బర్న్స్ ఈ ఘటనలను ఖండిస్తూ, "ఆల్బర్ట్ పార్క్‌లోని హరే కృష్ణ ఆలయంపై దాడి వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వగీర్: ‘శత్రువుల కంటపడకుండా సముద్రంలో కదిలే జలాంతర్గామి’
- నాగోబా జాతర: కొత్త కోడళ్లను నాగేంద్రునికి పరిచయం చేసే ఈ జాతర ఎలా జరుగుతుందంటే...
- హుస్సేన్ సాగర్ తీరాన... హైదరాబాద్‌లో మరో ఐకాన్
- మల్లికా సారాభాయ్: బీజేపీతో విభేదాల వల్లే ఆమె నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదా?
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














