సాలెపురుగులను నిద్రలో తింటారా ఎవరైనా?

సాలెపురుగులు
    • రచయిత, హెలెన్ బర్చెల్
    • హోదా, బీబీసీ న్యూస్, హర్ట్‌ఫోర్డ్‌షైర్

ఎప్పుడైనా ఎవరైనా నిద్రలో అనుకోకుండా సాలెపురుగును మింగగలరా?

హర్ట్‌ఫోర్డ్‌షైర్‌ పోస్టల్ వర్కర్ క్రిస్ కౌస్లీ ఇటీవల తాను అలా చేసినట్లు చెబుతున్నారు.

గత నెలలో ఒక రోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో క్రిస్ కౌస్లీ ఆస్పత్రిలో చేర్చారు.

శ్వాస తీసుకోలేకపోతుండటంతో ఆయన 999కి కాల్ చేశారు.

గొంతు లోపల కొండ నాలుకపై సాలెపురుగు కరిచినట్లు ఆయనకు అనిపిస్తుందని తన అంబులెన్స్ పారామెడిక్‌కు చెప్పారు.

ఈయన గొంతు వాచిపోయింది. ఆయన శ్వాస తీసుకోవడంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది.

తాను చనిపోతానేమోనని అనిపిస్తుందని కౌస్లీ అన్నారు.

కౌస్లీ శ్వాస ఇబ్బందికి అసలు కారణమేంటన్నది తాము కచ్చితంగా చెప్పలేకపోతున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

క్రిస్ కౌస్లీ

ఫొటో సోర్స్, CHRIS COWSLEY

ఎనిమిది కాళ్లతో వాటిని అవి రక్షించుకోగలవు

సహజ కీటక నిరోధకులు లాగా సాలెపురుగులు కాకుండా మరే జీవి పనిచేయదని బ్రిటీష్ ఆరక్నాలాజికల్ సొసైటీ తెలిపింది.

‘‘అవి వేటాడే జీవులు. అవి ఎక్కువగా వేటాడే జీవులు కీటకాలు. ఈ కీటకాల్లో చాలా వరకు చాలా వరకు మన పంటలను తింటాయి.’’ అని ఈ వెబ్‌సైట్ తెలిపింది.

కీటకాలకు సహజ శత్రువులు లాగా జీవావరణంపై అపారమైన ప్రభావాన్ని సాలెపురుగులు చూపుతున్నాయని 2017లో స్విట్జర్లాండ్‌లో యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ చేపట్టిన అధ్యయనంలో తెలిసింది.

‘’45 వేలకు పైగా జాతులతో, ఒక్కో చదరపు మీటరుకి 1000 వరకు జనాభా సాంద్రతతో, సాలెపురుగులు ప్రపంచంలోనే అపారమైన జాతి సమృద్ధితో, విస్తృతమైన వేటాడే సమూహాల్లో ఒకటిగా ఉన్నాయి’’ అని రిపోర్ట్‌లు తెలిపాయి.

ప్రపంచవ్యాప్తంగా సాలెపురుగుల జనాభా ప్రతి ఏడాది 400 నుంచి 800 మిలియన్ టన్నుల కీటకాలను ఏరిపారేస్తున్నాయని గణాంకాలున్నాయి. వీటి బరువు సుమారు 25 మిలియన్ టన్నులుంటుంది.

అయితే, కౌస్లీ శ్వాస సమస్యకు సాలెపురుగునే కారణమనే దానికి సాలెపురుగుల నిపుణులు కూడా నమ్మలేకపోతున్నారు.

నిద్రలో ప్రతి ఏడాది ఎనిమిది సాలెపురుగులను తింటారనే ఒక అపోహ ఉందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన జువాలజీ డిపార్ట్‌మెంట్ డాక్టర్ మ్యాట్ విల్కిన్సన్ చెప్పారు.

‘‘ఇది అపోహ మాత్రమే. కానీ చాలామంది దీన్ని వాస్తవంగా అంగీకరిస్తున్నారు.’’

నిద్రలో సాలెపురుగు మింగుతున్నారన్న ఈ స్టోరీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో అస్పష్టంగా ఉందని విల్కిన్సన్ తెలిపారు.

సాలెపురుగు

ఫొటో సోర్స్, Getty Images

కౌస్లీకి ఏర్పడిన ఈ పరిస్థితికి కారణం సాలెపురుగు కుట్టడమే అనే దానిపై విల్కిన్సన్, ఇతరులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

‘‘బ్రిటన్‌లో చాలా తక్కువ స్పైడర్లు మాత్రమే కుడతాయి. ఇవి పెద్దగా ఉంటాయి. ఒకవేళ ఇది కనుక మీ గొంతులో ఉంటే, మీరు మేల్కొనే వారు’’ అని విల్కిన్సన్ అన్నారు.

చాలా మంది లేచినప్పుడు, తమ ముఖంపై సాలెపురుగులు ఉంటాయని నిపుణులు కూడా అంగీకరించారు.

సాలెపురుగు కుట్టడం వల్లనే కౌస్లీకి శ్వాసతీసుకోవడం సమస్యకు కారణమై ఉండొచ్చని వైద్య సిబ్బంది చెప్పినట్లు విల్కిన్సన్‌ విన్నారు.

కానీ, దీనిపై ఆయన సాక్ష్యాధారాలను అడుగుతున్నారు.

‘‘సాక్ష్యాధారాలను చూపించండి. స్పైడర్ అవశేషాలు ఎక్కడున్నాయి. అది మిమ్మల్ని ఎక్కడ కుట్టింది’’ అని అడిగారు.

సాలెపురుగు ఇది చేసిందని తాను ఊహించుకోనన్నారు.

సాలెపురుగులు

ఫొటో సోర్స్, PA Media

నిద్రపోయేటప్పుడు ఏడాదికి ఎనిమిది సాలెపురుగులు మింగుతారనేది అపోహగా బ్రిటీష్ ఆరక్నాలాజికల్ సొసైటీ సెక్రటరీ డాక్టర్ జియోఫ్ ఆక్స్‌ఫర్డ్ కూడా అన్నారు.

‘‘ఎవరైనా నిద్రపోతుంటే, వేడి గాలిని లోపలికి వెళ్తూ, బయటికి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎందుకు సాలెపురుగులు ముక్కులోకి వెళ్తాయి? అవి అలా చేయవు’’ అని చెప్పారు.

బ్రిటన్‌లో సాలెపురుగులు కుట్టడం అసాధారణమైనప్పటికీ, కొన్నింటి కాటు వల్ల అనారోగ్యం పాలవ్వడం, చెమటలు పట్టడం లేదా మైకంతో బాధపడటం జరుగుతుంటాయని ఎన్‌హెచ్ఎస్ చెప్పింది.

అరుదైన కేసుల్లో తీవ్ర అలెర్జిక్ రియాక్షన్లు వస్తుంటాయని తెలిపింది.

సాలెపురుగు కుట్టిన తర్వాత ఎవరికైనా ప్రమాదకరమైన లేదా ఆందోళనకరమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలని ఎన్‌హెచ్‌ఎస్ ప్రతిపాదించింది.

కౌస్లీ విషయానికి వస్తే, ప్రమాదవశాత్తు ఆయన నోట్లోకి వెళ్లిన సాలెపురుగు అతని ఆరోగ్యాన్ని మరింత ప్రమాదకరంగా మార్చింది.

ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కౌస్లీ చేసిన మొదటి పని, క్రిమికీటక సంహారణ మందులను కొన్నారు. ఇక మునుపు ఇలా జరగకూడదని తాను వీటిని కొన్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)