ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ వివాదంలో నాగబాబు దురుసు వ్యాఖ్యల మీద దుమారం

నాగబాబు

ఫొటో సోర్స్, janasena party/Facebook

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.

ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బు తమకు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి వాళ్ల ముఖాన కొట్టేవాళ్లమని అనడం వివాదానికి దారి తీసింది.

వాళ్లు ఊరికే ఫ్లైట్ టికెట్స్ కే రూ. 80 కోట్లు పెడుతున్నారని ఆయన కామెంట్ చేశారు.

భరద్వాజ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నటులు, దర్శకులు ప్రతిస్పందిస్తున్నారు.

ఈ విషయంలో నటుడు నాగబాబు ఘాటుగా స్పందించడంతో వివాదం మరింత ముదిరింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

పోస్ట్ of YouTube ముగిసింది

భరద్వాజ ఎక్కడ మాట్లాడారంటే..

మార్చి 6న రవీంద్రభారతిలోని పైడిరాజు ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఫిల్మ్ మేకర్ రాజేష్ టచ్ రివర్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ల ప్రదర్శన జరిగింది.

ఆ సందర్భంలో వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం అనే అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్ లో తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు. అప్పుడు చేసిన కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాపై గతంలోనూ సోషల్ మీడియాలో కొన్ని వివాదాలు రేగాయి. ఇంతకుముందు కొందరు వ్యక్తులు ఈ సినిమాను ‘గే’ సినిమాగా వ్యాఖ్యానించటంపై తీవ్ర చర్చ సాగింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఈ నెల 12న (భారత కాలమానం ప్రకారం 13వ తేదీ ఉదయం) అమెరికాలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

ఈ నేపథ్యంలో.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం రూ. 80 కోట్ల ఖర్చు చేశారన్న వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

భరద్వాజ కామెంట్లపై నటుడు నాగబాబు పరుష పదజాలంతో స్పందించారు. ‘‘నీ........... ఖర్చుపెట్టాడా 80 కోట్లు RRR ఆస్కార్ కోసం’’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఇది ‘వై.సి.పి. వారి భాషలో సమాధానం’ అని కూడా వ్యాఖ్యానిస్తూ రాజకీయాలను కూడా జోడించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

ఈ విషయంలో అటు తమ్మారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టగా.. మరికొందరు నాగబాబు వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.

‘రాజకీయాలలో ఉంటూ ఒక పార్టీకి ప్రతినిధివి అయ్యి ఉండి ఓర్పు సహనం ఉండాలి అని..? నీకు దమ్ము లేదు ఎవరు అన్నారో వాళ్లని డైరెక్ట్గా అనటానికి..’’ అంటూ ఓ నెటిజన్ స్పందించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

దర్శకుడు రాఘవేంద్రరావు స్పందన..

పాపులారిటీ కోసం కొందరు కామెంట్లు చేస్తుంటారని, సంఘంలో పలుకుబడి ఉన్న వారు ఇలా మాట్లాడటం ఏంటని మరో నెటిజన్ తమ్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు.

ఈ విషయంపై దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఫేస్ బుక్, ట్విట్టర్‌లో స్పందించారు.

‘‘తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతే కానీ 80కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? అంటూ స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 4

దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆర్ఆర్ఆర్ సినిమాకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. మరికొందరు భరద్వాజకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు.

‘‘పాపం భరద్వాజులు గారు చల్లగా అటెన్షన్ తీసుకుని జారుకుందాం అనుకున్నారు కానీ తెలుగు జాతిని గర్వపడేలా చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ, రాజమౌళి గారి మీద రాయి వేసి జారుకుందాం అని చూస్తే తెలుగు వారు తెలుగు ప్రముఖులు గమ్ముగా ఉంటారని భావించినట్లు ఉన్నారు’’ అని ఓ నెటిజన్ స్పందించాంరు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 5

‘‘ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ నౌ ఎ డేస్’’ అంటూ మరో నెటిజన్ స్పందించారు.

ఇదే విషయంపై యాంకర్ శ్యామల స్పందించారు.

‘‘80 కోట్లు.. 8 సినిమాలు..

ఇదే వ్యక్తి తెలుగు సినిమా బాగు గురించి పెద్దపెద్ద పాఠాలు చెప్తాడు.. కానీ తెలుగు దర్శకుడికి, నటులకు వస్తున్న గౌరవాన్ని చూసి మాత్రం ఓర్వలేడు..

ఏం లోకమో ఎందో..?’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 6

రాజమౌళిని చూసి నాకెందుకు జెలసీ? - తమ్మారెడ్డి

ఈ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తానేమీ తప్పు చేయలేదని చెప్పారు. ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదన్నారు.

‘‘రాజమౌళిని చూసి జెలసీ ఫీల్ అవుతున్నానని కొందరు అంటున్నారు. కానీ ఆయన్ను చూసి నేనేందుకు జెలసీ ఎందుకు ఫీల్ అవుతాను. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్లు నన్ను చాలా అంటున్నారు. ఈ రోజుకు సంయమనం పాటించి మాట్లాడుతుంటే ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. నా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు. సంస్కారం నేర్పించాడు. నీతిగా బతకడం నేర్పించాడు. నిజం చెప్పడం నేర్పించాడు. మీకు నేర్పించాడా..?’’ అని నాగబాబు, రాఘవేంద్రరావును ఉద్దేశించి అన్నారు.

‘‘నిన్నగాక మొన్న రాజమౌళి గొప్పవాడు అన్నప్పుడు మీకు తెలియలేదా.. అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అక్కడ మూడు గంటలపాటు డిస్కషన్ జరిగిందని, కేవలం ఒక ముక్క కట్ చేసి సోషల్ మీడియాలో పెడితే దానిపై విమర్శలు చేయడం తగదన్నారు. మూడు గంటలు చిన్న సినిమా కోసం కూర్చుని మాట్లాడగలరా?’’ అని ప్రశ్నించారు.

‘‘మీ ఇష్టం. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడుకోండి. ఆకాశాన్ని చూసి ఉమ్మెయ్యాలనుకుంటే మీ ముఖంపైనే పడుతుంది. నాకు ఏం పడదు. నాకేమీ అవ్వదు. నాకు ఇండస్ట్రీ అన్నం పెట్టింది. మీ గురించి మాట్లాడినా.. ఇండస్ట్రీ గురించి బ్యాడ్‌గా మాట్లాడినట్లు అవుతుంది. మీకు ఆ సంస్కారం లేదేమో..? నాకు ఉంది’’ అని భరద్వాజ అన్నారు.

ఇండస్ట్రీ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానన్నారు. ‘‘నా గౌరవం కాపాడుకుంటూ బతుకుంటాను. మీ లాగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వైపు ఉండి అవార్డులు తీసుకోలేదు. స్థలాలు తీసుకోలేదు’’ అని భరద్వాజ అన్నారు.

ఏం జరిగిందో తెలియకుండా ట్వీట్లు చేసుకుంటూ.. నా పేరు చెప్పుకొని సెలబ్రిటీలు అవ్వాలని చూస్తున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)