ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే లవ్ స్టోరీ’ అని రసూల్ పూకుట్టి ఎందుకన్నారు... కీరవాణి ఏమని బదులిచ్చారు

ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, Facebook/RRR

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చుట్టూ మళ్లీ దుమారం రేగుతోంది.

ప్రముఖ సౌండ్ ఇంజినీర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి... ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మీద చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదమైంది. దానికి బదులుగా కీరవాణి చేసినట్లుగా చెబుతున్న ట్వీట్ మరింత వివాదంగా మారింది.

'నిన్న రాత్రి ఆర్ఆర్‌ఆర్ చెత్తను 30 నిమిషాలు చూశాను' అంటూ హిందీ నటుడు, రచయిత మునీశ్ భరద్వాజ్ జులై 3న ట్వీట్ చేశారు. దానికి బదులిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా 'గే లవ్ స్టోరీ' అంటూ రసూల్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దీన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తప్పు పట్టారు. ఆస్కార్ వంటి అవార్డులు సాధించిన ఒక వ్యక్తి ఇలా దిగజారి మాట్లాడటం తనను ఎంతో నిరాశపర్చిందని ఆయన అన్నారు.

'మీరు అన్నట్టు ఆర్ఆర్ఆర్ సినిమా గే లవ్ స్టోరీ అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అదే అయినా అందులో తప్పేముంది? మీ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారు? మీలాంటి వారు ఇంతలా దిగజారడం పట్ల చాలా నిరాశ చెందాను' అని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆర్ఆర్ఆర్ సినిమా పోస్టర్

ఫొటో సోర్స్, Facebook/RRR

అయితే అది తన అభిప్రాయం కాదని ప్రజలు అనుకుంటున్న దాన్ని కోట్ చేశానంటూ శోభు యార్లగడ్డకు రసూల్ వివరణ ఇచ్చారు. ‘‘ఒకవేళ అది గే లవ్ స్టోరీ అయినా అది తప్పు కాదు. జనాలు అనుకుంటున్న దాన్ని మాత్రమే నేను కోట్ చేశా. అంతేకానీ ఇందులో దిగజారడమనేది ఏమీ లేదు. శోభు, దీన్ని మీరు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని అవమానించాలని అనుకోలేదు’’ అని రసూల్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికా వంటి పశ్చిమ దేశాల్లో రిలీజైన తరువాత ఇది గే రొమాంటిక్ స్టోరీ అంటూ కొందరు విదేశీయులు, భారతీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

తాజాగా రసూల్ పూకుట్టి చేసిన ట్వీట్‌పై ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. అసభ్య పదజాలంతో రసూల్‌ను దూషిస్తూ ఆయన ట్వీట్ చేశారని, ఆ తరువాత దాన్ని డిలీట్ చేసినట్లుగా న్యూస్18 తెలుగు, ఈటీవీ భారత్ వంటి న్యూస్ వెబ్‌సైట్స్ రిపోర్ట్ చేశాయి.

ఇదే ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కీరవాణి డిలీట్ చేసినట్లుగా చెబుతున్న ఈ ట్వీట్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కీరవాణి చేసిన ట్వీట్, అందులో ఆయన వాడిన పదజాలం మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

'కీరవాణి సర్, ఇంత దిగజారి మాట్లాడతారని అనుకోలేదు. దేవుని దయ వల్ల మీరు ట్వీట్ డిలీట్ చేశారు. ఇతరులను విమర్శించే హక్కు మీకు ఉంది. కానీ శోభు మాదిరిగా సరైన భాషలో మాట్లాడాలి.' అని @Random01021451 అనే ట్విటర్ హ్యాండ్లర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

'రసూల్ పూకుట్టి ఈర్ష్యతో చీప్‌గా మాట్లాడారు. కానీ కీరవాణిది థర్ట్ రేట్ స్పందన. ఇద్దరు తమ స్థాయి కంటే కిందకు దిగజారారు.' అంటూ @ArjunVcOnline అనే యూజర్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

అయితే మరికొందరు కీరవాణి ట్వీట్‌ను సమర్థించారు. 'మీరు చేసిన పనిని పదేపదే తక్కువ చేసి మాట్లాడుతుంటే ఎప్పుడో ఒకసారి సహనం కోల్పోవడం సహజమే. అది కీరవాణి విషయంలో నిన్న జరిగింది.' అంటూ @KumarNitheshu అనే యూజర్ చెప్పుకొచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

జూన్ నెల ప్రారంభంలో ‘ఆర్‌ఆర్ఆర్ గే లవ్ స్టోరీ’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. కొందరు ట్విటర్ యూజర్లు దీన్ని 'గే రొమాన్స్'గా చూస్తున్నామంటూ పోస్టులు పెట్టారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య రొమాన్స్‌ను తాము ఎంతో ఎంజాయ్ చేశామంటూ కొందరు పాశ్చాత్య దేశాల ప్రేక్షకులు ట్వీట్లు చేశారు.

అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా విజయంపై అక్కసుతోనే ఇలా వ్యతిరేక కామెంట్లు కొందరు చేస్తున్నారంటూ రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి అభిమానులు అప్పుడు స్పందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)