బడ్జెట్ 2024 : ఇన్‌కం ట్యాక్స్‌లో ఎలాంటి మార్పులు ఉండవు: నిర్మల సీతారామన్

ఫొటో సోర్స్, Rajya Sabha TV
2023-24 ఆర్థిక సంవత్సరానికి 47.66 లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మల సీతారామన్.
ఈ సందర్భంగా ఆమె సభలో మొదట మోదీ ప్రభుత్వ విజయాలు చెప్పుకొచ్చారు.
పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధి, సంక్షేమం ప్రథమ ప్రాధామ్యం కావాలన్న ప్రధాని మోదీ సూచన మేరకే బడ్జెట్ రూపొందించామన్నారు.
మోదీ నేతృత్వంలో గత పదేళ్లలో అమలు చేసిన సంస్కరణలు, విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నాయన్నారు నిర్మల సీతారామన్.
‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అనే నినాదం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిందని మంత్రి అన్నారు.
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు.
అనంతరం 2024-25 మధ్యంతర బడ్జెట్‌లోని అంశాలను చదివి వినిపించి, సభ ఆమోదం తీసుకున్నారు.
బడ్జెట్ సమర్పణ అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఫొటో సోర్స్, GOI
బడ్జెట్ హైలైట్స్ ఇవీ..
- 40 వేల రైలు బోగీలను వందేభారత్ ప్రమాణాలతో మార్పులు
- విమానాశ్రయాల అభివృద్ధి
- ‘డీప్ టెక్’ టెక్నాలజీస్ కోసం కొత్త పథకం
- దేశంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు.. ఆశా కార్యకర్తలు అందరికీ ఆయుష్మాన్ భారత్ పథకంలో హెల్త్ కవర్ వర్తింపు
- సంస్కరణల అమలు కోసం రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణాలు రూ. 75 వేల కోట్ల మేర ఇస్తాం.
- దేశంలో కొత్తగా ఐదు సమీకృత ఆక్వా పార్కుల ఏర్పాటు
- రానున్న ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం
- దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచేందుకు కమిటీ ఏర్పాటు
- రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ద్వారా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ సరఫరా.

ఫొటో సోర్స్, GOI
శాఖల వారీగా కేటాయింపులు..
రక్షణ శాఖ- రూ 6.2 లక్షల కోట్లు
వ్యవసాయం, రైతు సంక్షేమం- రూ. 1.27 లక్షల కోట్లు
రైల్వే శాఖ- రూ. 2.55 లక్షల కోట్లు
హోం శాఖ- రూ. 2.03 లక్షల కోట్లు
వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీల శాఖ- రూ. 2.13 లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి- రూ. 1.77లక్షల కోట్లు
రసాయనాలు, ఎరువుల శాఖ- రూ. 1.68 లక్షల కోట్లు
సమాచార శాఖ - రూ. 1.37 లక్షల కోట్లు
రవాణా, జాతీయ రహదారులు- రూ. 2.78 లక్షల కోట్లు
పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు..
సోలార్ విద్యుత్ గ్రిడ్- రూ. 8,500 కోట్లు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- రూ. 86,000 కోట్లు
పారిశ్రామిక ప్రోత్సాహకాలు- రూ. 6,200 కోట్లు
ఆయుష్మాన్ భారత్- రూ. 7,500 కోట్లు
సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీ: రూ. 6,903 కోట్లు
గ్రీన్ హైడ్రోజన్ మిషన్- రూ. 600 కోట్లు
ద్రవ్యలోటు ఎంతంటే
2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.8 శాతం
2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చు: రూ. 44.9 లక్షల కోట్లు
2024 ఆర్థిక సంవత్సరంలో రుణేతర రాబడి: రూ. 27.56 లక్షల కోట్లు
2024 ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి: రూ. 23.24 లక్షల కోట్లు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతం ఉండొచ్చని అంచనా.

ఫొటో సోర్స్, ANI
'దేశ ప్రజల ఆదాయం 50 శాతం మేర పెరిగింది'
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, భారత్‌లో అన్ని రంగాల్లోనూ ప్రగతి కనిపిస్తోందని, ప్రజల ఆదాయం 50 శాతం పెరిగిందని అన్నారు.
పంటబీమా ద్వారా నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి.
జీఎస్టీ అమలుతో ‘వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్’ .
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 9-14 వయసు గల బాలికలకు వ్యాక్సిన్లు.
పీఎం స్వనిధి పథకంతో 78 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సదుపాయం. వారిలో 2.8 లక్షల మందికి వరుసగా మూడోసారి రుణం మంజూరు.
ఇవి కూడా చదవండి:
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- రూ.40 లక్షల ఇన్సూరెన్స్ కోసం చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం... శ్మశానంలోని శవం తెచ్చి అల్లిన కట్టు కథ భార్య ఏడుపుతో బయటపడిందిలా
- దళితులు గుడిలోకి వచ్చారని ఆలయాన్నే బహిష్కరించి కొత్తది నిర్మిస్తున్న ఇతర కులాలు
- గురక ఎందుకు వస్తుంది? రాత్రిపూట పదేపదే నిద్ర చెడిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుందా?
- క్యాష్‌లెస్ ఎవ్రీవేర్: హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఇకపై నెట్వర్క్ హాస్పిటల్స్‌లోనే కాదు, దేశంలో ఎక్కడైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్... 48 గంటల నిబంధన గుర్తుంచుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














