సూర్యకుమార్, రాహుల్ ద్రవిడ్‌లు ఇలా మాట్లాడుకోవడం ఇంతకు ముందు చూసి ఉండరు.. అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, ANI
సూర్యకుమార్ యాదవ్ ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడని భారత టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నారు.
రాజ్‌కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ 51 బంతుల్లో 112 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆడిన షాట్లు కేవలం అభిమానులనే కాదు క్రికెట్ ప్లేయర్లను, నిపుణులను కూడా బాగా ఆకట్టుకున్నాయి.
‘‘అతను ఎలాంటి షాట్లు ఆడతాడంటే, ఒకవేళ అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను గనుక బౌలర్‌ను అయితే నా గుండె పగిలిపోయేది’’ అని హార్దిక్ పాండ్యా అన్నాడు.
ఈ కొత్త సంవత్సరంలో భారత్ నుంచి సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అతని బ్యాటింగ్ తీరును విశ్లేషిస్తూ క్రికెట్ కమెంటేటర్ హర్షా భోగ్లే, ‘‘ కనీసం కలలో కూడా ఇలా ఆడే క్రికెటర్లు చాలా తక్కువ మంది ఉంటారు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో అతని బ్యాట్ నుంచి వచ్చిన ఒక షాట్‌పై విపరీతంగా ప్రశంసలు వస్తున్నాయి. అప్పుడు దిల్షాన్ మధుశంక అతనికి బౌలింగ్ వేశాడు.
ఈ ఓవర్ రెండో బంతిని షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా సూర్యకుమార్ సిక్సర్‌గా కొట్టాడు.
దిల్షాన్ వేసిన ఈ బంతిని ఫ్లిక్ షాట్‌గా మలిచే క్రమంలో సూర్యకుమార్ కింద పడ్డాడు. అయినప్పటికీ, అతను విజయవంతంగా ఆ బంతిని బౌండరీ లైన్ బయటకు పంపిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. ఇలాంటి షాట్లు సూర్యకుమార్ యాదవ్ ‘ట్రేడ్ మార్క్’ షాట్లుగా మారిపోతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మైదానం నలుదిశలా ఆడుతూ తనదైన షాట్లతో పరుగులు రాబడుతోన్న సూర్యకుమార్ యాదవ్‌ను అభిమానులు ముద్దుగా ‘స్కై’, ‘మిస్టర్ 360 డిగ్రీ’ అనే పేర్లతో పిలుచుకుంటున్నారు.
అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు మూడు సెంచరీలు నమోదు చేశాడు.
సూర్యకుమార్ గణాంకాల గురించి క్రికెట్ స్టాటిటిక్స్ ట్రాకర్ రజనీశ్ గుప్తా ట్వీట్ చేశారు.
‘‘టి20 క్రికెట్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసి, 40 కంటే ఎక్కువ సరాసరితో పాటు 175కు పైగా స్ట్రయిక్ రేట్ కలిగి ఉన్న ఒకే ఒక్క క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్’’ అని రజనీశ్ గుప్తా తెలిపారు.
శ్రీలంకతో చివరి టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్‌తో భారత్ సులభంగా గెలిచింది. ఈ విజయంతో భారత్ 2-1తో సిరీస్‌ను అందుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో ఆసక్తికర సంభాషణ
ఈ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ట్విటర్ ట్రెండ్స్‌లో టాప్ స్థానంలో నిలిచాడు. మ్యాచ్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సూర్యకుమార్ సంభాషణ గురించి ఎక్కువగా ట్విటర్‌లో చర్చ జరిగింది.
ఈ సంభాషణను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కేవలం ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.
బీసీసీఐ టీవీకి చెందిన ఈ వీడియోలో రాహుల్ ద్రవిడ్, సూర్యకుమార్ యాదవ్ చాలా సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.
ఈ వీడియోలో ద్రవిడ్, సూర్యకుమార్ యాదవ్‌ను పొగడటమే కాకుండా టెక్నికల్‌గా ఎంతో పటిష్టంగా భావించే తన బ్యాటింగ్ శైలిపై తనే ఛలోక్తులు వేసుకున్నాడు.
ఈ వీడియోతో పాటు మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ చూస్తూ ఒక వీడియోకు రిప్లై ఇస్తున్నట్లుగా కనిపించే మరో వీడియోను కూడా అభిమానులు బాగా షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లి పెట్టిన స్టోరీకి సూర్యకుమార్ యాదవ్ బదులు ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో సూర్యకుమార్ యాదవ్ చాలా సరదాగా మాట్లాడుతూ కనిపిస్తున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, ANI
సూర్యకుమార్ యాదవ్, ద్రవిడ్‌లు ఏం మాట్లాడుకున్నారు?
ద్రవిడ్ ఈ వీడియోలో సరదాగా తన బ్యాటింగ్ స్టయిల్‌ను సూర్యకుమార్ యాదవ్ శైలితో పోల్చుతూ మాట్లాడారు.
‘‘ఇప్పుడు ఇక్కడ నాతో ఉన్న ఈ వ్యక్తి కచ్చితంగా తన చిన్నతనంలో నా బ్యాటింగ్ శైలిని, నేను ఆడటాన్ని చూసి ఉండడు’’ అని సూర్యకుమార్‌ను ఉద్దేశిస్తూ ద్రవిడ్ నవ్వుతూ అన్నారు.
ఈ మాట వింటూనే పగలబడి నవ్విన సూర్యకుమార్ యాదవ్.. ‘‘అలా ఏం లేదు. కావాల్సినంతంగా మీ ఆట చూస్తూనే పెరిగాను’’ అని అన్నాడు.
తన క్లాసికల్ బ్యాటింగ్ స్టయిల్ గురించి ద్రవిడ్ గురించి మాట్లాడుతూ, ‘‘హా, అయితే నువ్వు నా ఆట చూడలేదు. నువ్వు నా ఆట చూడలేదని నాకు కచ్చితంగా తెలుసు’’ అని అన్నారు.
తర్వాత సూర్యకుమార్ మాట్లాడుతూ , ‘‘గత ఏడాది నా పెర్ఫార్మెన్స్ ఆనందాన్ని ఇచ్చింది. మళ్లీ అలాగే ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. బ్యాటింగ్‌కు వెళ్లిన ప్రతీసారి ఆటను వీలైనంతగా ఆస్వాదిస్తుంటా. ఆట ద్వారా నన్ను నేను ఎక్స్‌ప్రెస్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటా’’ అని చెప్పాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఫిట్‌నెస్ రహస్యం
ఈ సంభాషణలో భాగంగా సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్, డైట్ గురించి ద్రవిడ్ ప్రశ్నించాడు. రెండేళ్ల క్రితం బెంగళూరులో సూర్యకుమార్ హాజరైన ‘యోయో ఫిట్‌నెస్ టెస్ట్’ గురించి ద్రవిడ్ గుర్తు చేశాడు.
దీనికి బదులిస్తూ సూర్యకుమార్ ఇలా అన్నాడు.
‘‘నా నాన్న ఇంజనీర్. మా కుటుంబంలో ఎవరూ క్రీడల వైపు వెళ్లిన దాఖలాలు లేదు. అందుకే నాలో ఆట పట్ల ఉన్న ఇష్టాన్ని మా వాళ్లకు చూపెట్టడం కోసం రకరకాలుగా ప్రయత్నించేవాడిని. నా కోసం మానాన్న చాలా త్యాగం చేశారు. పెళ్లి తర్వాత నా భార్య కూడా నా ఫిట్‌నెస్ కోసం, న్యూట్రిషన్స్ విషయంలో చాలా సహాయం చేసింది’’ అని సూర్యకుమార్ తెలిపాడు.
బెంగళూరులో జరిగిన ఫిట్‌నెస్ టెస్టు తన జీవితాన్ని మలుపు తిప్పిందని సూర్యకుమార్ అన్నాడు. యోయో టెస్ట్ జరిగినప్పుడు ఎన్‌సీఏ హెడ్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరించారు.
ఎప్పుడూ నవ్వుతూ ఉండే, ఇతరులను ప్రోత్సహిస్తూ ఉండే సూర్యకుమార్ యాదవ్ వైఖరిని ద్రవిడ్ ప్రశంసించాడు.
రాబోయే రోజుల్లో సూర్యకుమార్ యాదవ్ నుంచి ఇలాంటి పెర్ఫార్మెన్స్‌లు మరెన్నో వస్తాయని ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత్, శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్ జనవరి 10 నుంచి మొదలు అవుతుంది. భారత వన్డే జట్టులో కూడా సూర్యకుమార్ సభ్యుడు.
ఇవి కూడా చదవండి:
- భాంగఢ్ కోట: "చీకటి పడ్డాక అక్కడికి వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రారు" - ఇది నిజమేనా?
- గౌతమ్ అదానీ: మోదీతో స్నేహాన్ని ఒప్పుకున్నారా, సోషల్ మీడియాలో చర్చ ఏంటి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
- మొబైల్ ఫోన్: సిగ్నల్ అందకపోతే నేరుగా శాటిలైట్‌తో కనెక్షన్, ఇది ఎవరికి అందుబాటులో ఉంటుంది?
- ఆస్కార్-ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘నాటు నాటు’ పాట ఎలా పుట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















