గుడ్డును పర్‌ఫెక్ట్‌గా ఉడకబెట్టడం ఎలా?

boiled egg

ఫొటో సోర్స్, Getty Images

సరైన పోషకాలు, రంగు రుచి కలిగి ఉండేలా గుడ్డును ఎలా ఉడికించాలో అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం గుడ్డును అర గంట సమయం ఉడికించాలని వారు సూచిస్తున్నారు.

ఉదయం అల్పాహారంలో గుడ్డును చాలా మంది తింటారు.

గుడ్డుని పగలకొట్టి టోస్ట్ చేసే సమయంలో అది చాలా బాగా ఉడికి ఉంటుందనుకుంటారు. కానీ, ఒక్కోసారి పచ్చసొన ఎండిపోయి, విరిగిపోయి, మాడిపోయి, తెల్ల సొన సరిగా ఉడకకుండా నీళ్లనీళ్లగా కనిపిస్తుంది.

అలా జరగకూడదంటే ఏం చేయాలి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గుడ్డు, ఉడకపెట్టడం

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకిలా ?

గుడ్డులోని తెల్ల సొన ఉడకాలంటే 65 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. పచ్చసొన ఉడకడానికి 85 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ కావాలి.

కానీ ప్రాచీనకాలం నుంచి వస్తున్న పద్ధతినే అనుసరించడం వల్ల ఈ విషయంలో రాజీపడ్డారనే చెప్పాలి.

గుడ్డుని 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకపెట్టినప్పుడు తెల్లసొన మృదువుగా, బాగా ఉడుకుతుంది. కానీ పచ్చసొన మాత్రం పూర్తిగా ఉడికిపోయి గట్టిగా ఉంటుంది. అలా తినగలిగినవారికి ఇబ్బంది లేదు.

కానీ మధ్యస్తంగా ఉడికిన పచ్చసొనను తినే అలవాటు ఉన్నవారు మాత్రం నిరాశ చెందుతారు.

boiled egg

ఫొటో సోర్స్, Getty Images

సూ వీడ్

అలాగే ‘సూ వీడ్’ అనేది మరో పద్ధతి. ఇందులో 60-70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మరుగుతున్న నీళ్లలో గుడ్డుని పగలకొట్టి వేస్తారు. ఒక గంటపాటు ఉడికిస్తారు.

అప్పుడు పచ్చసొన పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. కానీ తెల్ల సొన మాత్రం పారదర్శకంగా కనిపిస్తూ కాస్త బంకగా మారుతుంది.

అయితే ఇప్పుడు గుడ్డుని పర్ఫెక్ట్‌గా ఎలా ఉడకపెట్టాలో పరిశోధకులు కనుగొన్నారు.

తాము చెబుతున్న విధానంలో ఉడకపెడితే రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యకరం కూడా అంటున్నారు పరిశోధకులు.

తెల్లసొన, పచ్చసొన, పాలీఫెనాల్స్, మైక్రోన్యూట్రియన్ట్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొత్త పద్ధతి ప్రకారం గుడ్డుని ఉడికిస్తే ఆరోగ్యకరకమైన పాలీఫెనాల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంది.

ఇటలీ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పనిచేస్తున్న శాస్త్రవేత్త పెల్లెగ్రినో ముస్టో నేతృత్వంలోని పరిశోధకులు తాజాగా తెలిపిన వివరాల ప్రకారం మొదట కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్(సీఎఫ్‌డీ) ఉపయోగించి గుడ్డు ఉడకబెట్టారు.

సీఎఫ్‌డీ అంటే ద్రవ్యరాశి, ద్రవ్యవేగం, శక్తి పరిరక్షణ వంటి వాటిని నియంత్రించే ఫిజికల్ లా ఆధారంగా ద్రవాలు, వాయువులు ఎలా ప్రవహిస్తాయో కంప్యూటర్‌లను ఉపయోగించి అంచనా వేసే విధానం.

ఈ విధంగా చేసి ఒక కొత్త పద్ధతిని సూచించారు.

ముందుగా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీటిలో గుడ్డును ఉడికించి తర్వాత 30 డిగ్రీల టెంపరేచర్ ఉన్న నీటిలో ఉడికించాలి. ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి గుడ్డుని మరుగుతున్న నీటి నుంచి గోరువెచ్చని నీటిలోకి, మళ్లీ గోరువెచ్చని నీటి నుంచి మరుగుతున్న నీటిలోకి మారుస్తూ ఉండాలి.

ఇలా 32 నిమిషాల పాటు చేయాలి. అయితే ఇది ఇంట్లో వంట చెేసేవారికి సులభం కాకపోవచ్చు.

శాస్త్రవేత్తలు తమ రోజువారీ జీవితంలో ఇలా చేసినప్పుడు అద్భతమైన ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)