బీబీసీ న్యూస్‌రూమ్‌‌లో ప్రవేశించేందుకు అరుదైన అవకాశం.. అనుభూతి చెందండి

బీబీసీ మెటావర్స్
ఫొటో క్యాప్షన్, ఇది కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

బీబీసీ మెటావర్స్ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్ 40 భాషల్లో వారానికి 31 కోట్ల 80 లక్షల మందిని చేరుతోంది.

గత వందేళ్లుగా ప్రజలు బీబీసీ స్వతంత్ర జర్నలిజం, నిజాయితీపై నమ్మకం ఉంచారు.

క్వీన్ ఎలిజబెత్ 2 రాణిగా ప్రమాణస్వీకారం చేయడం, అపోలో 11 మిషన్, తొలి ఒలింపిక్స్ ప్రత్యక్ష ప్రసారం, బంగ్లాదేశ్ ఆవిర్భావం, 1983 క్రికెట్ వరల్డ్ కప్ కవరేజ్, ఇటీవలి యుద్ధాలు, సంక్షోభాలు...ఇలా ఎన్నింటినో బీబీసీ మీకు అందించింది.

మరి ఇలాంటి సమాచారం అంతా అందించే బీబీసీ ఎలా పనిచేస్తుంది.. న్యూస్‌రూమ్‌ ఎలా ఉంటుంది, న్యూస్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఉన్నాయా.. అయితే ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. బీబీసీ న్యూస్ వర్చువల్ న్యూస్‌రూమ్‌లో భాగమయ్యేందుకు సిద్ధంకండి. ఇది బీబీసీ మెటావర్స్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బీబీసీ మెటావర్స్‌తో న్యూస్‌రూమ్‌లో ఉన్న అనుభూతి

వందేళ్లకు పైగా కాలం నుంచి బీబీసీ వార్తలు, వినోద ప్రపంచంలో ఉందన్న సంగతి మీకు తెలుసా.

బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)ని 1922లో స్థాపించారు. సమాచారం అందించడం, చైతన్యపరచడం, వినోదం పంచడం అనే లక్ష్యాలతో బీబీసీని స్థాపించారు.

వందేళ్లకు పైగా కాలం నుంచి నిష్పక్షపాతంగా వార్తలందిస్తున్నాం. స్ఫూర్తిదాయక, వినోదాత్మక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాం.

వార్తలు, వినోదాత్మక కార్యక్రమాలు అందించే బీబీసీ న్యూస్ రూమ్ ఎలా ఉంటుందన్నది బీబీసీ మెటావర్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

లండన్ బ్రాడ్‌కాస్టింగ్ హౌస్, ఇతర బ్యూరోల్లో వర్క్ ఎలా జరుగుతుందో మెటావర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. విశ్వసనీయ వార్తల వెనక ఉన్న ప్రాథమిక అంశాలేమిటో అర్ధం చేసుకోవచ్చు. తప్పుడు వార్తలను ఎలా గుర్తించాలో తెలుసుకోవచ్చు. క్విజ్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పరీక్షించుకోవచ్చు.

అంతే కాదు...మీ బీబీసీ న్యూస్ వెబ్‌సైట్ హోమ్‌పేజ్‌ను కూడా డిజైన్ చేయొచ్చు.

బీబీసీ మెటావర్స్
ఫొటో క్యాప్షన్, బీబీసీ మెటావర్స్‌తో న్యూస్‌రూమ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు.

సెల్ఫీ, సర్టిఫికెట్ మర్చిపోవద్దు

మీరిక్కడకు వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బీబీసీ వర్చువల్ న్యూస్‌రూమ్ మెటావర్స్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

వర్చువల్ న్యూస్‌రూమ్‌కు స్వాగతం, ఈ అనుభూతి మీకు కొత్తగా, చాలా గొప్పగా ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)