పెళ్లికి ముందు జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టారా ? అయితే జాగ్రత్త

    • రచయిత, ప్రమీల కృష్ణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

పెళ్లికి ముందు జిమ్‌కి వెళ్లడం మొదలు పెట్టాలనుకుంటున్నారా? దీనివల్ల కొన్ని సమస్యలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.

చాలామంది యువకులు పెళ్లి రోజునాటికి అందంగా కనిపించాలని, ఫిట్ గా ఉండాలని భావిస్తుంటారు.

అందుకే పెళ్లికి ఆరేడు వారాల ముందు నుంచి తీవ్రంగా వ్యాయామం చేస్తారని, కానీ ఇది ప్రమాదకరమని ఆర్థోపెడిక్ సర్జన్ అశ్విన్ విజయ్ చెబుతున్నారు.

గతంలో జిమ్ అలవాటు లేకుండా ఒక్కసారిగా వ్యాయామం మొదలు పెట్టడం వల్ల ఎముకలు, కీళ్లలో కంపనలు వచ్చి శరీరాన్ని, మెదడును గందరగోళానికి గురి చేస్తాయని అశ్విన్ విజయ్ చెబుతున్నారు.

‘‘చాలా సంవత్సరాలు మీ శరీరం ఒక నిర్దిష్ట మార్గంలో పని చేసుకుంటూ వస్తుంటుంది. కానీ, ఒక్కసారిగా మీరు ఎక్కువ బరువు తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఆపరేషన్ చేయించుకోవాల్సినంత పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు’’

అన్నారు విజయ్.

వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

వీడియో క్యాప్షన్, ఆరు దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ బౌద్ధమతంలోకి మారుతున్నారు

శరీరంలో ఏం జరుగుతుంది?

వేగంగా పరిగెత్తడంతోపాటు, మరికొన్నివ్యాయామాలు పదే పదే చేయడం వల్ల శరీరంలోని వెన్నెముక, కీళ్లలో కంపనం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.

‘‘గత మూడేళ్లలో, ఇలాంటి సమస్యలతో చికిత్స కోసం అడ్మిట్ అవుతున్న యువకుల సంఖ్య పెరగడం నేను చూశా. మెడ, వెన్నెముక, కాళ్లలోని కీళ్లపై ఒత్తిడి పెరిగినట్లు తేలింది’’ అని ఆయన చెప్పారు.

ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, పిండి పదార్ధాలు, కొవ్వులను అకస్మాత్తుగా తగ్గించడం ప్రమాదకరమని విజయ్ అంటున్నారు

"పెళ్లి కోసం బరువు తగ్గాలనే లక్ష్యంతో కొందరు ఒక్కసారిగా తమ ఆహారపు అలవాట్లను మార్చేస్తారు. ఒకటి రెండు నెలలు బరువు తగ్గేలా ఆహారాన్ని తీసుకుని, తర్వాత మళ్లీ పాత అలవాట్లకు మారిపోతారు. అలాంటి సందర్భాల్లో బరువు రెట్టింపు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది’’ అని ఆయన హెచ్చరిస్తున్నారు.

వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

పెళ్లి తర్వాత....

పెళ్లి తర్వాత విందు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అంతకు ముందు రోజుల తరబడి చేసిన వ్యాయామం ఆపేస్తారు.

పెళ్లి సమయంలో ఎక్కువ ఆహారం తీసుకుంటారు. మూడు పూటలా భోజనం చేయడం, వ్యాయామం చేయకపోవడం వల్ల అలసట,డిప్రెషన్‌లాంటి సమస్యలు ఎదురవుతాయని డాక్టర్ అశ్విన్‌ విజయ్‌ చెబుతున్నారు.

‘‘పెళ్లి పార్టీలో స్వీట్లు, ఎక్కువ షుగర్ ఉన్న పదార్ధాలు తినాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో, అంతకు కొన్ని రోజుల ముందు నుంచి వ్యాయామం మానేసి ఉంటారు. ఇలాంటి సందర్భంలో శరీరం వణుకుతూ, కంగారు పడిపోతుంది’’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, అడవిలో తిరిగే చిరుత నట్టింట్లోకి వచ్చి కూర్చుంది
పెళ్లి

ఫొటో సోర్స్, Getty Images

వ్యాయామం ఎంత అవసరం?

రోజుకు దాదాపు 45 నిమిషాల పాటు వ్యాయామం ఎంత అవసరమో వివరిస్తూ ‘‘ వ్యాయామం చేయడం వల్ల శరీర అవయవాలు మెరుగుపడతాయి. శరీరానికి కదలిక ఇస్తే గ్రంథులు సక్రమంగా పనిచేసి మీలో ఒక ఉత్తేజం పుడుతుంది. ఇది మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది.

వ్యాయామాన్ని మీ లైఫ్‌లాంగ్ అలవాటుగా మార్చుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు. అలా కాకుండా శరీరాన్ని కదిలించకుండా ఉండటం, ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల కీళ్లు రెస్ట్ మోడ్‌లోకి వెళతాయి. ఇది భవిష్యత్తులో మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది’’ అని ఆయన చెప్పారు.

"పెళ్లికి ముందు జిమ్‌కి వెళ్లేవారు కేవలం పెళ్లి వరకే తమ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని అర్ధం. కానీ, బరువు తగ్గడం కంటే, ఆరోగ్యంగా ఉండటమే మన లక్ష్యం కావాలి. అది మీ మనస్సును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది’’ అని అశ్విన్ విజయ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)