70 ఏళ్ల తర్వాత భారత్‌లో పుట్టిన నాలుగు చీతా పిల్లలు

ఫొటో సోర్స్, @BYADAVBJP/TWITTER
- రచయిత, ఫ్రాన్స్‌స్కా గిల్లెట్
- హోదా, బీబీసీ న్యూస్
భారత్‌లో ఒక చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.
చీతాలు అంతరించిపోయినట్లు అధికారికంగా ప్రకటించి 70 ఏళ్లు పైబడిన తర్వాత మళ్లీ భారతీయ గడ్డపై ఈ పిల్లలు పుట్టాయి.
భారతీయ పర్యావరణ శాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. దీన్ని ‘‘చారిత్రాత్మక క్షణం’’గా అభివర్ణించారు.
దశాబ్దాల తర్వాత భారతీయ గడ్డపై ఈ వన్యప్రాణులను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగానే గతేడాది నమీబియా నుంచి 8 చీతాలను తెప్పించారు.
గత నెలలో దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు మరో 12 చీతాలను తీసుకొచ్చారు.
గతేడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల్లోనే ఒక ఆడ చీతా కూనో అభయారణ్యంలో నాలుగు చీతా కూనలకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు.
‘‘భారత్ మళ్లీ చీతాలను తీసుకొచ్చేందుకు రేయింబవళ్లు పనిచేసిన ప్రాజెక్ట్ చీతా టీమ్ మొత్తానికి, గతంలో చేసిన తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోన్న బృందానికి శుభాకాంక్షలు’’ అని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐదు రోజుల క్రితం ఈ నాలుగు కూనలు జన్మించాయి. కానీ, బుధవారం అధికారులు వీటిని గుర్తించినట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) రిపోర్ట్ చేసింది.
ఆడ చీతా సియాయా, దాని కూనలు ఆరోగ్యంగా, మంచిగా ఉన్నట్లు పార్క్ అధికారులు ఈ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.
కూనో అభయారణ్యంలో ఎనిమిది నమీబియా చీతల్లో ఒకటి కిడ్నీ సంబంధిత సమస్యతో మరణించినట్లు వార్తలు వచ్చిన నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ నాలుగు కూనలు జన్మించినట్లు ప్రకటన వచ్చింది.
నమీబియా నుంచి భారత్‌కు గతేడాది ఈ చీతాలను తరలించినప్పుడు, ఒక ఖండం నుంచి మరో ఖండానికి పెద్ద సంఖ్యలో వన్యప్రాణులను తరలించడం అదే తొలిసారి.
ఈ వన్యప్రాణులను మళ్లీ పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది.
1952లో భారత్‌లో చీతాలు అంతరించిపోయినట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న 7 వేల చీతాలు, ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలోని నమీబియా, బోట్స్వానాలలో విస్తరించి ఉన్నాయి.
ఆసియాకు చెందిన చీతాలు ప్రస్తుతం తీవ్ర ప్రమాదంలో ఉన్నాయి. కేవలం ఇరాన్‌లోనే వీటిని గుర్తించవచ్చు. అక్కడ కూడా 50 వరకే ఉండొచ్చు.
ప్రమాదంలో ఉన్న జంతువుల్లో చీతాలు చాలా దారుణమైన స్థానంలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్‌లో వెల్లడైంది.
వేటాడేటప్పుడు ఈ చీతాలు పచ్చిక బయళ్లలో గంటకు 112 కి.మీల వేగంతో పరిగెత్తగలవు.
ఇవి కూడా చదవండి:
- బంగారం హాల్ మార్కింగ్ అంటే ఏమిటి? ఏప్రిల్ 1 నుంచి మీ గోల్డ్ అమ్ముకోవడం సాధ్యమేనా?
- ‘‘నోట్లో కంకర పోసి పట్టకారుతో పళ్లను పీకేసిన పోలీసు...’’
- టీటీడీకి కేంద్రం రూ.3 కోట్ల జరిమానా ఎందుకు విధించింది? అసలు ఏమిటీ వివాదం?
- చికెన్ మంచూరియా ఎక్కడ పుట్టింది? ఈ వంటకం భారత్దా, పాకిస్తాన్దా? సోషల్ మీడియాలో జోరుగా చర్చ
- ప్రియాంక చోప్రా: ‘‘నన్ను బాలీవుడ్లో కావాలనే పక్కన పెట్టారు... అక్కడ రాజకీయాలు తట్టుకోలేక పోయాను’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















