స్కాట్లాండ్: ఫస్ట్ మినిస్టర్‌గా గెలిచిన తొలి ముస్లిం హమ్జా యూసఫ్ ఎవరు?

హమ్జా యూసుఫ్

ఫొటో సోర్స్, PA Media

    • రచయిత, స్టువార్ట్ నికోల్సన్
    • హోదా, బీబీసీ స్కాట్లాండ్ న్యూస్

స్కాట్లాండ్ అధికార పార్టీ నేత(ఫస్ట్ మినిస్టర్)గా హమ్జా యూసఫ్ ఎంపికయ్యారు.

నికోలా స్టర్జియాన్ తర్వాత స్కాటిష్ నేషనల్ పార్టీ నేతగా హంజా యూసఫ్ ఈ బాధ్యతలను చేపట్టనున్నారు.

ఎస్ఎన్‌పీ(స్కాటిష్ నేషనల్ పార్టీ) ఏర్పాటైన తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆదరణ పొందిన నేతగా హమ్జా యూసఫ్ నిలిచారు.

యూసఫ్ తమ ప్రయాణాన్ని స్వతంత్రంగా పూర్తి చేస్తారని డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ భావిస్తున్నారు.

జస్టిస్ సెక్రెటరీ, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ వంటి పలు పదవులను చేపడుతూ 2012 నుంచి ఆయన ప్రభుత్వంలో తన సేవలను అందిస్తున్నారు.

 స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్‌గా ఎదిగిన హమ్జా యూసఫ్

ఫొటో సోర్స్, Getty Images

పార్టీని ఒకతాటి పైకి తీసుకొచ్చేందుకు ఈయన మంచి కమ్యూనికేటర్ అని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు.

స్కాటిష్ గ్రీన్స్‌తో అధికారం పంచుకునే ఒప్పందాన్ని ఆయన కొనసాగించనున్నారని చెబుతున్నారు.

తనకు తాను స్వతాహ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా యూసఫ్ ఈ ఎన్నికల్లో పాల్గొనే ముందు బీబీసీ స్కాట్లాండ్ సండే షోలో చెప్పారు. తన సొంత విధానంలో పనులు చేస్తానన్నారు.

అయితే, ఆయన విమర్శకులు మాత్రం యూసఫ్‌పై పలు ఆరోపణలు చేశారు.

యూసఫ్ ఒక ‘వరస్ట్’ హెల్త్ సెక్రటరీగా రికార్డుల్లో నిలిచారని స్కాటిష్ పార్లమెంట్ సభ్యురాలు జాకీ బైలీ ఆరోపించారు.

అలాగే, ఇప్పుడు ‘వరస్ట్’ ఫస్ట్ మినిస్టర్‌గా రికార్డుల్లోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

అతిపెద్ద యూకే పార్టీకి తొలి ముస్లిం నేత ఇతనే.

అతిపెద్ద యూకే పార్టీకి తొలి ముస్లిం నేత

స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్‌గా ఎదిగిన హమ్జా యూసఫ్

ఫొటో సోర్స్, PA Media

స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్‌గా ఈ 37 ఏళ్ల హంజా యూసఫ్‌ ఎంపికతో, ఒక అభివృద్ధి చెందిన ప్రభుత్వానికి తొలి మైనార్టీ నేతగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.

అలాగే యూకేలో అతిపెద్ద పార్టీని ముందుండి నడిపే తొలి ముస్లింగా పేరులోకి రానున్నారు.

హమ్జా యూసఫ్ తండ్రి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి. 1960ల్లోనే ఆయన కుటుంబం స్కాట్లాండ్‌కి తరలి వెళ్లింది.

యూసఫ్ తల్లి కెన్యాలోని దక్షిణాసియా కుటుంబంలో పుట్టారు.

యూసఫ్ పలుమార్లు తాను ఎదుర్కొన్న జాత్యాంహకారం గురించి మాట్లాడారు.

యూసఫ్ గ్లాస్గోలోని హాచేసన్‌ గ్రామర్ హైస్కూల్‌లో చదివారు.

ఆయన గ్లాస్గో యూనివర్సిటీలో పాలిటిక్స్‌ చదివిన తర్వాత కొంత కాలం కాల్ సెంటర్‌లో పనిచేశారు.

ఆ తర్వాత ఎస్ఎన్‌పీ ఎంఎస్‌పీ బషీర్ అహ్మద్‌కి పార్లమెంటరీ అసిస్టెంట్‌గా వ్యవహరించారు. అలెక్స్ సాల్మాండ్‌కి సన్నిహితుడిగా మారారు.

స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ హమ్జా యూసఫ్

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, భార్య నదియా ఎల్-నక్లా, కూతురు అమల్‌, సవతి కూతురు మాయాతో పాటు హమ్జా యూసఫ్

2011లో గ్లాస్గౌ ప్రాంతానికి స్కాటిష్ పార్లమెంట్ మెంబర్(ఎంఎస్‌పీ) జాబితాలో ఆయన పేరును చేర్చారు.

కేవలం ఏడాదిలోనే అంతర్జాతీయ అభివృద్ధి, యూరప్‌కి మంత్రిగా ఆయన్ని సల్మాండ్ ప్రమోట్ చేశారు.

2016లో రవాణా మంత్రి అయ్యారు. స్కాటిష్ పార్లమెంట్ నుంచి నియోజకవర్గం సీటు గెలిచిన తొలి మైనార్టీ అభ్యర్థి ఈయనే.

పార్టీ నాయకత్వానికి ఎన్నిక ప్రారంభమైనప్పుడు పలు బెదిరింపు కాల్స్ రావడంతో, 25 ఏళ్ల ఒక వ్యక్తిని, 35 ఏళ్ల మహిళను అరెస్ట్ చేసి, కేసు దాఖలు చేశారు.

హమ్జా యూసఫ్, ఆయన భార్య నదియా ఎల్-నక్లా ఇటీవల ఒక నర్సరీపై దాఖలు చేసిన 30 వేల యూరోల న్యాయ వివాదాన్ని వెనక్కి తీసుకున్నారు. వివక్షను ఎదుర్కొన్నట్లు వీరు తమ ఫిర్యాదులో ఆరోపించారు.

బ్రాటీ ఫెర్రీ నర్సరీలో తమ కూతురికి చోటు దక్కలేదని వీరు పేర్కొన్నారు. కానీ, వైట్ స్కాటిష్‌ పేర్లు కలిగి ఉన్న పిల్లల్ని నర్సరీలో చేర్చుకున్నట్లు చెప్పారు.

అయితే, ఈ ఆరోపణలను ఆ నర్సరీ కొట్టివేసింది. వారి తప్పుడు ఆరోపణలతో తమ చిన్న నర్సరీని వేలాది పౌండ్లు ఖర్చు చేసేలా చేశారని పేర్కొంది.

నర్సరీపై ఎల్ నక్లా, హమ్జా యూసఫ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేర్ ఇన్‌స్పెక్టరేట్ కూడా మద్దతు ఇచ్చింది.

కేర్ ఇన్‌స్పెక్టరేట్ స్కాట్లాండ్‌లో సరియైన ప్రమాణాలతో కేర్ సర్వీసులను అందజేస్తున్నాదా లేదా అన్నది తనిఖీ చేసి, నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)