‘ప్రపంచంలోనే అత్యంత వికారమైన జంతువు’గా ఒకప్పుడు పేరుపడిన జీవి ఇప్పుడు ‘ఫిష్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కించుకుంది

బ్లాబ్ ఫిష్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కోవ్ ఇవ్
    • హోదా, బీబీసీ న్యూస్

న్యూజీలాండ్ ఎన్విరాన్‌మెంటల్ గ్రూప్ ఈ వారం ప్రజెంట్ చేసిన 'ఫిష్ ఆఫ్ ది ఇయర్' కిరీటాన్ని బ్లాబ్ ఫిష్ సొంతం చేసుకుంది.

న్యూజీలాండ్‌లో తాజా నీరు, సముద్ర జీవనంపై అవగాహన కల్పించేందుకు 'మౌంటైన్ టూ సీ కన్జర్వేషన్ ట్రస్ట్' ఈ వార్షిక పోటీలను నిర్వహించింది.

ఈ ఏడాది 5,500 ఓట్లకు పైగా పోలవ్వగా.. సుమారు 1,300 ఓట్లతో బ్లాబ్ ఫిష్ విజేతగా నిలిచింది.

ఇది బ్లాబ్ ఫిష్‌కు అనూహ్య విజయం. 2013లో అగ్లీ యానిమల్ ప్రిజర్వేషన్ సొసైటీకి గుర్తుగా అత్యంత వికారమైన జంతువుగా ఇది నిలిచింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ చేప సముద్ర గర్భంలో నివసిస్తుంది. సుమారు 12 అంగుళాల (30 సెంటీమీటర్ల) వరకు పెరుగుతుంది.

ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది. 2 వేల నుంచి 4 వేల అడుగుల లోతులో ఇది నివసిస్తుంది.

చూడటానికి భిన్నమైన ఆకారంలో ఉండే బ్లాబ్ ఫిష్.. సహజంగా సముద్ర గర్భంలో నివసిస్తున్నప్పటికీ, సాధారణ చేపనే పోలి ఉంటుంది.

అత్యధిక నీటి పీడనం వల్ల దీని ఆకారం బొద్దుగా మారుతుంది.

దీని పట్టుకుని, నీటి ఉపరితలంపైకి తీసుకొచ్చినప్పుడు, శరీరం మెత్తగా మారిపోతుంది. ఇవన్ని ప్రపంచంలో అత్యంత వికారమైన జీవుల్లో ఒకటిగా దీనికి అపఖ్యాతిని తెచ్చాయి.

ఆరెంజ్ రఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆరెంజ్ రఫీ

ఇక రెండో స్థానంలో 'ఆరెంజ్ రఫీ' నిలిచింది. ఇది కూడా సముద్ర గర్భంలో చాలా లోతున ఉంటుంది. స్లిమ్‌హెడ్ కుటుంబానికి చెందినది.

లోతైన సముద్ర గర్భంలో పెద్దగా ఎవరికీ తెలియని జాతుల గుర్తింపు ప్రయత్నం ఇదని ‘మౌంటైన్స్ టూ సీ కన్జర్వేషన్ ట్రస్ట్’ కో-డైరెక్టర్ కిమ్ జోన్స్ చెప్పారు.

''రెండు సముద్ర గర్భ జాతుల మధ్య పోటీలో బ్లాబ్ ఫిష్ అసాధారణమైన రూపం ఈ ఓట్లను సంపాదించేలా సహకరించింది'' అని అన్నారు.

ఆరెంజ్ రఫీ విజయం దిశగా వచ్చినట్లు కనిపించినప్పటికీ.. బ్లాబ్ ఫిష్ కోసం రెండు స్థానిక రేడియో స్టేషన్లు కల్పించిన ప్రచారంతో ఇది ముందంజలోకి వచ్చింది.

''పైకి వచ్చే చేప ఒకటి ఉంది. దానికి మీ ఓటు కావాల్సి ఉంది'' అని స్థానిక రేడియో నెట్‌వర్క్ మోర్ ఎఫ్ఎం సారా గ్యాండీ, పాల్ ఫిన్‌లు గత వారం నిర్వహించిన తమ షోలో ప్రచారం చేశారు.

బ్లాబ్ ఫిష్ గెలవడం మనకు కావాల్సి ఉందని అన్నారు.

బ్లాబ్ ఫిష్ గెలుపు వార్త తెలియగానే.. రేడియో హోస్ట్‌లు పండగ చేసుకున్నారు.

''సముద్ర గర్భంలో బ్లాబ్ ఫిష్ చాలా నిశ్శబ్దంగా, ఓపికగా కూర్చుని... ఏదైనా నత్తలాంటి జీవి వస్తే, తిందామని నోరు తెరుచుకుని ఉంటుంది'' అని అంటుంటారు. కానీ, ఈ రకంగా తన జీవితాంతం ఈ చేప నిందలు భరిస్తుందని వారు అన్నారు.

బక్కచిక్కిపోయి, పొలుసులతో కాకుండా బ్లాబ్ ఫిష్ మృదువైన శరీరంతో, మెరుస్తున్న చర్మంతో ఉంటుంది.

ఫిష్ ఆఫ్ ది ఇయర్‌కు వచ్చిన పది నామినీల్లో తొమ్మిదింటిన్ని కన్జర్వేషన్ గ్రూప్‌లు అత్యంత దీనమైన స్థితిలో ఉన్నవాటిగా పరిగణించినట్లు మౌంటైన్స్ టూ సీ కన్జర్వేషన్ ట్రస్ట్ చెప్పింది. దీనిలో బ్లాబ్ ఫిష్ కూడా ఉంది.

కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ ఫారెస్ట్ అండ్ బర్డ్ నిర్వహించిన బర్డ్ ఆఫ్ ది ఇయర్‌ పోటీలకు కూడా న్యూజీలాండర్‌ వేదికైంది. దీనిలో అరుదైన పెంగ్విన్ జాతి హోయిహో పక్షి విజేతగా నిలిచింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయం.)