పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జెండా వివాదం: ఫేస్‌బుక్ నుంచి జెండా ఫొటోను పాక్ ఎందుకు తొలగించింది?

ఫొటో సోర్స్, PAKISTAN HIGH COMMISSION BANGLADESH
బంగ్లాదేశ్ విదేశీ మంత్రిత్వ శాఖ కోరిక మేరకు ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్, తమ ఫేస్‌బుక్ పేజీ కవర్ ఫొటోగా ఉన్న 'బంగ్లాదేశ్-పాకిస్తాన్' జెండా చిత్రాన్ని తొలగించింది.
బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం, ఈ ఫొటోను మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మార్చారు. ఆ తర్వాత ఫేస్‌బుక్ కవర్ ఫొటోగా కేవలం పాకిస్తాన్ జెండా ఫొటోను ఉంచారు.
జూలై 21న పాకిస్తాన్ హైకమిషన్ ఫేస్‌బుక్ పేజీకి బంగ్లాదేశ్-పాకిస్తాన్ దేశాల జెండాలను కలిపి చూపే చిత్రాన్ని కవర్ ఫొటోగా పెట్టారు.
బంగ్లాదేశ్‌లోని చాలా సంస్థలు ఈ ఫొటోపై స్పందించడం మొదలుపెట్టాయి. దీంతో బంగ్లాదేశ్ విదేశీ మంత్రిత్వ శాఖ, కవర్ పేజీని తీసేయాలని పాకిస్తాన్ హైకమిషన్‌ను కోరింది.
''మాకు ఇది ఇష్టం లేదు. అందుకే దాన్ని తొలగించాలని మిమ్మల్ని కోరాం'' అని విలేఖరుల సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్ అన్నారు.
పాకిస్తాన్ సమాధానం చెప్పలేదు
పాకిస్తాన్, ఇలాంటి ఫొటోను ఎందుకు కవర్ ఫొటోగా పెట్టింది? దీని గురించి బంగ్లాదేశ్ విదేశీ మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది? అని ఢాకాలోని పాక్ హైకమిషన్‌ను బీబీసీ బంగ్లా ప్రతినిధి అడిగారు.
హైకమిషన్‌కు చెందిన ఒక అధికార ప్రతినిధి ఈ ప్రశ్నలను విన్నారు. కానీ, వాటికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
అయితే, ఆదివారం విలేఖరుల సమావేశంలో ఏకే అబ్దుల్ మోమెన్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని ఎందుకు పెట్టారని పాకిస్తాన్‌ను ప్రశ్నించారు. దానితో పాటు పాక్ హైకమిషన్ పంపించిన కొన్ని చిత్రాలను ఆయన విలేఖరులకు తన ఫోన్‌లో చూపించారు.
ఈ నమూనా చిత్రాలను పాక్ హైకమిషన్ తనకు పంపించిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, FACEBOOK@PAKISTANHIGHCOMISSIONSL
పాక్ హైకమిషన్ వివరణ
సింగపూర్, శ్రీలంక, సౌదీ అరేబియా, మలేసియా వంటి దేశాల ఫేస్‌బుక్ పేజీల్లో కూడా ఇలాగే రెండు జెండాల చిత్రాలను కలిపి పెట్టామని పాక్ హైకమిషన్ చెప్పిందని అబ్దుల్ తెలిపారు.
''మా జెండాతో కలిపి రూపొందించినట్లుగానే మిగతా దేశాల జెండాలతో కూడా వారు కవర్‌ఫొటోలు రూపొందించారు. తప్పుడు ఉద్దేశంతో వారు ఇలా చేయలేదు. మా కోరికను వారు అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నా'' అని ఆయన అన్నారు.
పాక్ హైకమిషన్ వివరణతో సంతృప్తి చెందినట్లు ఆయన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
''మాకు ఇది నచ్చలేదు అని వారికి చెప్పాం. దీన్ని వారు డిలీట్ చేస్తారని మేం నమ్ముతున్నాం. మిగతా దేశాల జెండాతో ఫేస్‌బుక్ కవర్ పేజీని పెట్టుకున్నట్లే బంగ్లాదేశ్ జెండాతో కూడా పెట్టుకోవచ్చని వారు అనుకున్నారు. మిగతా దేశాల వారు దీనికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదని వారు చెప్పారు'' అని ఆయన వివరించారు.
అయితే, బంగ్లాదేశ్ విదేశీ శాఖ విలేఖరుల సమావేశం నిర్వహించడానికి కొద్దిసేపటి ముందు పాకిస్తాన్ హైకమిషన్ కవర్‌పొటోను మార్చేసింది. కేవలం పాక్ జెండాను మాత్రమే ఫొటోగా పెట్టింది.

ఫొటో సోర్స్, FB/PAKISTAN HIGH COMMISSION MALDIVES
బంగ్లాదేశ్ ఎందుకు అభ్యంతరం చెప్పింది?
ఈ ఫొటో కారణంగా ఎలాంటి రాజకీయ వివాదంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే ఫొటోను తొలిగించమని పాక్‌ను కోరినట్లు బంగ్లాదేశ్ తెలిపింది.
కవర్‌పేజీగా ఫొటోను పెట్టినప్పటి నుంచి చాలా సంస్థలు, బంగ్లాదేశ్ జెండాను అవమానించారంటూ విమర్శిస్తూ ప్రకటనలు జారీ చేశాయి.
అయితే, కొన్ని నెలల క్రితమే బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చాలా దేశాలు బంగ్లాదేశ్ జెండాతో కూడిన తమ దేశ జెండా చిత్రాలను విడుదల చేశాయి.

ఫొటో సోర్స్, FACEBOOK @PAKINSINGAPORE
ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను తెలిపేందుకు చాలా దేశాలు ఇలాంటి చిత్రాలను విడుదల చేస్తున్నాయి.
కానీ, పాక్ హై కమిషన్ ఫేస్‌బుక్ పేజీలో ఈ చిత్రంపై దేశంలో నిరసనలు రావడంతో ఈ విషయాన్ని విదేశీ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు.
శనివారం సాయంత్రం మంత్రి ఆదేశాల మేరకు ఈ విషయాన్ని పాక్ హైకమిషన్‌తో చర్చించి ఫొటోను తొలిగించాలని కోరారు.
ఆ తర్వాత ఇతర దేశాల పాక్ హైకమిషన్ పేస్‌బుక్ పేజీల్లో ఉన్న కవర్ ఫొటోల సమూహాన్ని బంగ్లాదేశ్ మంత్రిత్వశాఖకు పాక్ హైకమిషన్ పంపింది. ఇరు దేశాల మధ్య స్నేహానికి గుర్తుగా ఇలా చేసినట్లుగా చెప్పింది.
రాజకీయ వివాదాల కారణంగా ఈ పొటోను తొలగించాలని కోరినట్లు ఢాకాలోని ఒక అధికారి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గోవాలో చట్ట వ్యతిరేకంగా కేంద్ర మంత్రి సృతి ఇరానీ కూతురు బార్ నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపణ
- కియారా అద్వానీ: ‘మొదట్లో నన్ను కలవడానికి కూడా భయపడ్డారు.. ఇప్పుడు వాళ్లే ఆఫర్లిస్తున్నారు’
- నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు
- మంకీపాక్స్:75 దేశాలు, 16 వేల కేసులు, 5 మరణాలు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
- రిషి సునాక్: అవును..నిజమే. నేను వెనకబడ్డా...
- ‘‘నేనే ఆ అమ్మాయిని సజీవ దహనం చేశాను. ఆమె అరుపులు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి’’
- ఒకపరి కొకపరి వీడియో తొలగించిన శ్రావణ భార్గవి.. ‘అన్నమయ్యపై అభిమానంతోనే వీడియోను తొలగిస్తున్నా’
- ‘ఇస్లాం పవిత్ర నగరం’ మక్కాలో ప్రవేశించి వీడియో తీసిన ముస్లిమేతర జర్నలిస్ట్.. ఈయన ఎవరు? ఎందుకు వెళ్లారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















