జోయిష్ ఇరానీ: గోవాలో చట్ట వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కూతురు బార్ నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపణ.. లీగల్ నోటీసు ఇచ్చిన సృతి ఇరానీ

స్మృతి ఇరానీ

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ పార్టీ తన కూతురి ప్రతిష్టను దెబ్బ తీసే ఉద్దేశ్యంతో ద్వేషపూరిత ప్రచారాన్ని చేస్తోందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.

గాంధీ కుటుంబం గురించి బహిరంగంగా మాట్లాడటం వల్లే తన కూతురిని లక్ష్యంగా చేసుకున్నారని స్మృతి ఇరానీ ఆరోపించారు. గోవాలో స్మృతి కూతురు చట్ట వ్యతిరేకంగా ఒక బార్ నడుపుతున్నారని శనివారం కాంగ్రెస్ ఆరోపించింది.

లీగల్ నోటీసులు పంపిన కేంద్ర మంత్రి

ఈ మేరకు స్మృతి ఇరానీ విలేఖరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతానని కూడా హెచ్చరించిన స్మృతీ ఇరానీ.. ఆదివారం జైరామ్ రమేశ్, పవన్ ఖేరాలకు లీగల్ నోటీసులు పంపించారు. గోవాలో అక్రమ బార్ నడుపుతున్నారంటే తమ పేర్లను ప్రచారం చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ నోటీసులు ఇచ్చారు.

మరో వైపు స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ కూడా తన పై చేసిన ఆరోపణలు ఆధార రహితమైనవని అన్నారు. ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెబుతూ జోయిష్ తరుపు న్యాయవాది కిరాత్ నాగ్రా ఒక ప్రకటనను విడుదల చేశారు.

"జోయిష్ 'సిల్లీ సోల్స్ గోవా' అనే రెస్టారంట్‌కు లేదా మరొక రెస్టారంట్‌కు కూడా యజమాని కాదని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవన్నీ కేవలం ఆమె ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కల్పించి చేస్తున్న ఆరోపణలు" అని ఈ ప్రకటనలో అన్నారు.

కానీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం స్క్రీన్ షాట్లు, సోషల్ మీడియాలో పాత ఇంటర్వ్యూలు షేర్ చేస్తూ ఈ అంశం గురించి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు.

ఏమి జరిగింది?

కాంగ్రెస్ నాయకులు జై రామ్ రమేష్, పవన్ ఖేరా, మహిళా కాంగ్రెస్ అధికారి నెట్టా డిసూజా శనివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో స్మృతి ఇరానీ కుటుంబం పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమెను యూనియన్ క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

"ఇరానీ కూతురు గోవాలో దొంగ లైసెన్స్‌తో రెస్టారంట్ కమ్ బార్ నిర్వహిస్తున్నారు. మే 2021లో మరణించిన ఒక వ్యక్తి పేరు పై ఆ లైసెన్స్ ఉంది. ఆ వ్యక్తి మరణించిన సంవత్సరం తర్వాత ఆయన పేరు పై జూన్ 2022లో లైసెన్స్ తీసుకున్నారు. ఆ రెస్టారంట్‌కు రెండు లైసెన్సులు ఉన్నాయి. గోవా చట్టం ప్రకారం రెస్టారంట్, బార్ నిర్వహణ కోసం ఒక లైసెన్స్‌ను మాత్రమే తీసుకోవాలి. అదే సమయంలో ఈ బార్‌కు రెస్టారంట్ నిర్వహించే లైసెన్స్ లేదు" అని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

సోనియా, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

స్మృతి ఇరానీ ఏమన్నారు?

స్మృతి ఇరానీ శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నిటినీ ఖండించారు. ఈ విషయాన్ని న్యాయస్థానానికి, ప్రజల న్యాయ స్థానానికి తీసుకుని వెళతానని అన్నారు.

తన కూతురు 18 సంవత్సరాల అమ్మాయి అని, కాలేజీలో చదువుకుంటోందని, ఈ సమావేశంలో తన కూతురిని సమర్ధిస్తూ చెప్పారు.

"ఆ అమ్మాయి వ్యక్తిత్వం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదంతా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకే జరుగుతోంది" అని అన్నారు.

"నేను సోనియా, రాహుల్ గాంధీ చోరీ చేసిన రూ.5000 కోట్ల గురించి విలేఖరుల సమావేశాన్ని నిర్వహించడమే నా కూతురు చేసిన తప్పు. నేను 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయడమే తప్పుగా కనిపిస్తోంది" అని అన్నారు.

కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసేందుకు వాడిన ఆర్‌టీఐ దరఖాస్తు, షో కాజ్ నోటీసు గురించి కూడా ఆమె ప్రశ్నించారు.

ఈ అంశంపై కోర్టుకు వెళతానని ఇరానీ అన్నారు. తదనుగుణంగా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులకు లీగల్ నోటీసులు పంించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పవన్ ఖేరా

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు?

స్మృతి ఇరానీ హెచ్చరిక తర్వాత కూడా ఈ అంశం పై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తూ వారిని ఇరకాటంలో పెట్టడం ఆపలేదు.

సోషల్ మీడియాలో ఆమె అబద్ధం ఆడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.ఏప్రిల్ 2022లో ప్రచురించిన ఒక మీడియా రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా, సుప్రియ శ్రీ నేత్ చాలా ట్వీట్లు చేశారు.

తృణముల్ కాంగ్రెస్ నాయకుడు కీర్తి ఆజాద్ కూడా ఈ అంశం పై స్పందించారు. స్మృతి ఇరానీ ఇన్స్టాగ్రామ్ స్క్రీన్ షాట్ అని ఆరోపిస్తూ "ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి" అని ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

" అబద్ధం ఆడుతున్న స్మృతి ఇరానీ ఎవరు? ఏప్రిల్ 14, 2022లో తన కూతురు నిర్వహిస్తున్న రెస్టారంట్ గురించి ప్రశంసలు గుప్పించిన ఇరానీ లేదా ప్రస్తుతం తన కూతురుకు రెస్టారంట్ లేదని చెప్పిన వ్యక్తా? అని పవన్ ఖేరా ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవి శ్రీనివాస్ కూడా సోషల్ మీడియా అకౌంట్‌లో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో జోయిష్ ఇరానీ ఒక ఫుడ్ అండ్ ట్రావెల్ షోలో తన రెస్టారంట్ దగ్గర మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే, బీబీసీ ఈ వీడియోను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

స్మృతి ఇరానీ

ఫొటో సోర్స్, Getty Images

గతంలో కూడా చర్చల్లో కనిపించిన జోయిష్

లోక్ సభ అధికారిక వెబ్ సైటు ప్రకారం కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీకి ఇద్దరు పిల్లలు. కుమారుడు పేరు జోర్ ఇరానీ కాగా, కూతురి పేరు జోయిష్ ఇరానీ.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

కూతురుకి 18 సంవత్సరాలని, కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నారని చెప్పారు.

ఆమె పిల్లల ఫోటోలను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటారు. 2019లో ఆమె కూతురితో కలిసి షేర్ చేసిన ఫోటో వార్తా శీర్షికల్లో నిలిచింది.

అప్పట్లో ఆమె కూతురు కనపడే తీరు పై స్కూలులో ఆమెను ఏడిపిస్తున్నారని చెబుతూ ఒక ఫోటో విడుదల చేశారు.

వీడియో క్యాప్షన్, భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము: ఒడిశాలోని ఆమె స్వగ్రామం ఎలా ఉంది.. అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)